ఆంధ్ర గాథాలహరి

దైవబలం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ.వె. వట్టి ఇసుక గోడ పదిలంబుగానట్లు
కమలధవుని యొక్క కరుణ లేక
పురుషయత్నమెంత పూర్ణంబుగానున్న
చక్కబడునె పనులు సత్వరముగ
‘షడ్విధం మానవ యత్నం సప్తమం దైవచింతనం’ అనికదా ఆర్యోక్తి! మనిషి తను చేపట్టిన పనులలో కృతకృత్యుడవ్వాలంటే దైవానుగ్రహం కూడా తోడవ్వాలి. అలా లేకుంటే అది ఇసుకతో కట్టిన గోడే అవుతుంది. వట్టి ఇసుకతో కట్టిన గోడ నిలువదు కదా! మనిషి ఎంత కష్టపడితే ఏం లాభం? దైవం అనుకూలించకపోతే! అనే భావం నాటి సమాజంలో (క్రీ.శ. 1వ శతాబ్దం) కూడా ఉందన్నమాట.
వివరణ:అవినీతిపరుడైన కాంట్రాక్టరు వట్టి ఇసుకతోనే నిర్మాణాలు లాగించేస్తుంటాడు. అవి మూణ్ణాళ్ళ ముచ్చటే. నిర్మాణం పటిష్టంగా ఉండాలంటే మాత్రం సిమెంటు కలపవలసిందే. దైవబలం అనే సిమెంటు ఎంత ఎక్కువగా ఉంటే పనులు అంత త్వరితంగా ఫలవంతమవుతాయి. ‘దైవం మానుష రూపేణ’ అని దేవుడు స్వయంగా ‘ఇన్‌వాల్వ్’ కాకపోవచ్చు. కానీ మనకు ఉపకరించేవాళ్ళ రూపంలో దేవుడే సహకరిస్తుంటాడు. అందువల్ల మనకు ఉపకారం చేసినవాళ్ళను దైవంగా భావించి వారికి ప్రత్యుపకారం చేయవచ్చు కానీ అపకారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తలపెట్టకూడదు.
ప్రాకృతమూలం
దేవ్వమ్మి పరాహుత్తే పత్తిఅ ఘడి అం వివిహడఇణరాణం
కజ్జం వాలు అవరణం వ్వకహవి బంధం వి అణఏఇ (అంధుడు)

సంస్కృత ఛాయ
దైవలే పరాన్ముఖే ప్రతీహి ఘటిత మపి విఘటతే నరాణాం
కార్యం వాలుకావరణ ఇవకథ మపి బంధమేవ నదదాతి
*
- ఇంకావుంది...

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949