ఆంధ్ర గాథాలహరి

చేయరానిది చేయకు( ఆంధ్రగాథాలహరి-54)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ చేయవలసినదానిని చేయకుంట
చేయకూడనిదానిని చేయుచుంట
అనెడురెండు పనులెపుడు, కనక శైల
మంత వానిని సైతము, అధముసేయు
‘‘చేయవలసినదానిని చేయకుండా ఉండడం, చేయకూడనిదానిని చేయడం, అనే రెండు పనులే- కొండంత మనిషిని సైతం అల్పునిగా చేస్తాయి’’ అని మిత్రుడికి హితోపదేశం చేస్తున్నాడో నాగరికుడు.
వివరణ: మనిషి చేయవలసిందేమిటి?- ధర్మంగా ఉండడం, కర్తవ్యాన్ని నిర్వహించడం. చేయకూడనివేమిటి? పరస్ర్తిలను, పరుల ధనాన్ని అపేక్షించడం, హింసకు పాల్పడటం. తమ్ముని కుమారులకు ఇవ్వవలసిన రాజ్యభారాన్ని ఇవ్వకపోవడం, దుర్యోధనుణ్ణి నియంత్రించకపోవడంవల్ల ధృతరాష్ట్రుడు ఎంతగా దిగజారాడో మనకుతెలిసిందే. పర స్ర్తిని ఆశించి నశించిన రావణుడి సంగతే మనకు తెలుసు. అహల్యను ఆశించి శాపక్రస్తుడైన ఇంద్రుని వృత్తాంతమూ మనకు తెలుసు. అలాగే చేయకూడని పనులు చేయడంవల్ల సమాజంలో అత్యున్నత శిఖరాలపై వున్న పెద్దలు కూడా అథఃపాతాళానికి పడిపోయిన విషయం మనకు తెలియంది కాదు.
ప్రాకృతమూలం
లహు అంతి లహుం పురిసం ప వ్వ అమేత్తం పిదోవి కజ్జాఇం
ణివ్వరణ మణివ్వూఢే జం అణివ్వరణమ్ (గోవిందస్వామి)
సంస్కృత ఛాయ
లఘుయతో లఘు పురుషం పర్వత మాత్రమపి ద్వే అపికార్యే
నిర్వరణ మనిర్యూఢే నిర్వ్యూఢే యచ్చ నిర్వరణమ్ - ఇంకావుంది...

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949