ఆంధ్ర గాథాలహరి

ఆమె ఊరూ నాకు గొప్పే! (ఆంధ్రగాథాలహరి-55)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తె.గీ నామ నోహరి, మృదువద నారవింద
దర్శనం, బతిఘనము, ముదావహమ్ము
అంతియేకాదు, ఆమెదౌ అభిజనంపు
మేరయును నాకు, ముదమిచ్చు మేరలేక

నా ప్రియురాలి ముఖ చంద్రబింబానే్న కాదు, ఆమె ఊరి పొలిమేరను చూచినా, నాకు అపరిమితమైన ఆనందం కలుగుతుందని నాయకుడు తన స్నేహితునితో చెపుతున్నాడు.

వివరణ: ప్రేయసికి సంబంధించిన వాటన్నింటినీ ప్రేమించడం ప్రేమకు తారస్థాయి. ఆమె ఊరి పొలిమేర కనపడ్డా- ఆమే కనిపించినంత సంతోషం అనడం నాయకుని వీర ప్రేమను తెలుపుతుంది. ఈ వీర ప్రేమలోకొక్కమారు వికటించే ప్రమాదం కూడా వుంది. ప్రేమ అర్థవంతంగా, అవతలివారిని ఇబ్బంది పెట్టనంతవరకూ ఫర్వాలేదు.

ప్రాకృతమూలం:
అచ్ఛఉ దావమణహరం పి ఆఇముహదం సణం అమహగ్ధమ్
తగ్గామ చ్ఛేత్తసీమా విఝత్తి దిట్ఠా సుహావేఇ (మహిలుడు)
సంస్కృత ఛాయ
అస్తు తావన్న నోహరం ప్రియాయా ముఖదర్శనమతి మహోర్ఘమ్
తద్గ్రామ క్షేత్ర సీమాపి ఝటి తిదృష్టాసుఖయతి
- ఇంకావుంది...

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949