ఆంధ్ర గాథాలహరి

సుజనుడు - వినయశీలుడు (ఆంధ్రగాథాలహరి-69)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాకృతమూలం
ఫల సంపత్తీ అ సమోణ ఆఇ తుంగాఇ ఫలవిపత్తి ఏ
హి అఆఇ సుపురిసాణం మహాతరూణంవ సిహరాఇం (కువలయుడు)
సంస్కృతచ్ఛాయ
ఫల సంపత్యా సమవతాని తుంగాని ఫల విపత్యా
హృదయాని సుపురుషాణాం మహాతరూణా మివ శిఖరాణి
తెలుగు
తే.గీ ఫల భరములైన తరువులు వంగినటుల
వినయముగనుండు, సుజనుండు ధనము కలుగ
కలిమి పోయినన్ తల ఎత్తి నిలచియుండు
ఫలరహితవేళ వృక్షాగ్ర భాగమట్లు
ఇది మరొక నీతిగాథ- సజ్జనులు ధనం కలిగినప్పుడు ఫలభరితములైన వృక్షాల్లాగా వినయంగా వంగి ఉంటారు. అదే ధనం లేనప్పుడు ధైన్యం పొందకుండా ధైర్యంగా పండ్లులేని చెట్టులాగా నిటారుగా నిలచి ఉంటారు.
వివరణ
చెడ్డవాడు తన చెడ్డ పనులకు కారణాలను అనే్వషించినట్లు, మంచివాడు తన మంచితనానికి కారణాలను వెతుక్కోడు. ఏ పరిస్థితుల్లోనయినా మంచివాడు ఉన్నతంగానే ఆలోచిస్తాడు. ఉత్తమంగానే ప్రవర్తిస్తాడు అని ఈ గాథ తెలుపుతుంది.
ఉత్తముడు డబ్బున్నపుడు మునుపటికన్నా వినయంగా, సత్కార్యాలకు డబ్బును వెచ్చిస్తూ ఫలవృక్షంలాగా ప్రవర్తిస్తాడట. అదే డబ్బు లేనప్పుడు కూడా ఎవరినీ దేబిరించకుండా, ఆత్మగౌరవానికి ప్రాధాన్యతనిచ్చి సంతృప్తిగా జీవిస్తాడట. ‘‘్ధనమును, విద్యయు వంశంబును, దుర్మతులకు మదంబొనరించును, సజ్జనులైనవారి కడకువయును, వినయము నివియు తెచ్చునుర్వీనాధా!’’ అంటాడు విదురుడు మహాభారతంలో. అందువల్ల ధనంకన్నా గుణం ప్రధానం.
ఇంకావుంది..

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949