ఆంధ్ర గాథాలహరి

బుద్ధం శరణం గచ్ఛామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ
శుకముఖాగ్ర భాగంబుల సొంపుమీర
పుడమిరాలిన మోదుగు పూవులవిగొ
బుద్ధదేవు పదములకు మ్రొక్కుచున్న
భిక్షు సంఘములట్టుల వెలయుచుండె
ప్రాకృతమూలం
కీర ముహి స చ్ఛహేహి రేహఇ వసుహా పలాస కుసుమేహిమ్
బుద్ధస్స చలణ వందణపడి ఏహివ బిక్సుసంఘేహిం (సూరనుడు)
సంస్కృత ఛ్ఛాయ
కీరముఖ సదృక్షైః రాజతే వసుధా పలాశకుసుమైః
బుద్ధస్య చరణ వందన పతి తైరివ భిక్షు సంఘైః (సూరనుడు)
బుద్ధదేవుని పాదాలకు మ్రొక్కుతూ ఉన్న కాషాయాంబరధారులైన బౌద్ధ భిక్షువుల్లాగా, చెట్టునుంచి రాలిపరచుకొని వున్న చిలకముక్కు రంగులోని ఎర్రని మోదుగుపూలు ప్రకాశిస్తూ ఉన్నాయి చూడు!’’ అని ప్రియునితో అంటోంది ప్రేయసి.
వివరణ
క్రీ.శ. ఒకటవ శతాబ్దం నాటికి భారతీయ సమాజంలో బౌద్ధమత విస్తృతిని ఈ గాథ సూచిస్తుంది. ఎర్రని కాషాయ వస్త్రాలు ధరించడం, నుదుటిపై గుండ్రంగా ఎర్రని కుంకుమ బొట్టు పెట్టుకోవడం నున్నని గుండుతో ఉండడం- ఇవి బౌద్ధ భిక్షువుల లక్షణాలు. ఎర్రని మోదుగు పూలను బౌద్ధ్భిక్షువులతో పోల్చడం సహజ సుందరం. మోదుగు పూలను మళ్లీ చిలుక ముక్కులతో పోల్చడం మరింత సుందరం. ఉపమానానికి ఉపమానం వేయడం ఈ గాథలోని చమత్కారం.
ఇంకావుంది...

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949