ఆంధ్ర గాథాలహరి

సజ్జనుడు సజ్జనుడే( ఆంధ్రగాథాలహరి-77)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ.వె
గ్రహణవేళనైన రజనీశు బింబమ్ము
అమృత కిరణములనె అందజేయు
అటులె సజ్జనుండు అమిత కష్టమునను
ప్రల్లదంబు లెపుడు పలుకబోడు

‘రాహువు నోట బడిన గ్రహణ సమయంలో కూడా చంద్రుడు చల్లని అమృతమయమైన కిరణాలనే వెలువరిస్తాడు. అట్లే ఎన్ని కష్టాల్లో వున్నా ఎంత కోపం వచ్చినా మంచివాడు చెడ్డ మాటలు మాట్లాడడు’ అని ఈ గాథకు అర్థం.
వివరణ: అసలు పరుషంగా మాట్లాడడమనేది సప్తవ్యసనాలలో ఒకటిగా ‘వాక్పరుష్యము’ అనే రూపంలో పరిగణించబడింది. కఠినంగా మాట్లాడటం పాపం అని అనంతామాత్యుని భోజరాజీయం కూడా తెలుపుతుంది. ఒంటికి తగిలిన గాయం కొంత కాలానికి మాయవౌతుంది కానీ, సూటి పోటి మాటలవల్ల మనసుకు గాయమైతే మాత్రం మానటం కష్టం. అవి ఎప్పుడూ ములకుల్లా గుచ్చుతూనే ఉంటాయి. అందువల్ల మాట్లాడేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి మాట్లాడడం మంచిది. మధుర భాషణుడిగా హనుమంతుడికీ లోకంలో ప్రఖ్యాతి ఉంది.

ప్రాకృతమూలం

దృఢ రోసకలు సి అస్స విసు అణస్స ముహాహి విప్పి అంకంత్తో
రాహుయు హమ్మి వి సిసిణో కిరణా అమ అం విఅ ముఅంతి
సంస్కృత ఛాయ
దృఢ రోష కలుషితస్యా పిసుజనస్య ముఖాదప్రియం కుతః
రాహు ముఖేడిపి శశినః కిరణా అమృత మేవ ముంచంతి

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949