ఆంధ్ర గాథాలహరి

ఇపుడు బాధపడితే...? -82)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ.వె చెడ్డవారలైన, చేడెల ముందర
పురుష రత్నమంచు, పొగడుకొంటి
నిన్ను, దూరమైతినీ ప్రేమ ఝరినుండి
ఇపుడు తీరి వగవ నేమి ఫలము?
‘‘సత్ప్రవర్తన లేని ఆడవాళ్ళముందు నా భర్తను అదేపనిగా పొగుడుకున్నాను. వాళ్లల్లో ఎవరో ఒకరు వాణ్ణి వల్లో వేసుకుని నాకు దూరం చేశారు. అంతా చేతులారా నేనే చేసుకున్నాను. ఇపుడు బాధపడి ఉపయోగమేముంది?’’ అని పతికి దూరమైన ఒక స్ర్తి అనుకొంటోంది.
వివరణ: మగని లేనిపోని గొప్పల్ని అమ్మలక్కలముందు చాటే వాళ్ళకు గుణపాణం లాంటి గాథ ఇది. మగని జీతానికి సున్నా చేర్చి చెప్పటం, లేని కార్లను సృష్టించటం, కొంతమంది ఆడవాళ్ళు చేసే పని. ఇది వారి కొంప ముంచిన సందర్భాలు కోకొల్లలు. ‘ఒకామె మా ఆయన ఐదు వేల రూపాయల చీరెను తన పలుకుబడితో రెండు వందలకే తెచ్చాడన్నదనుకోండి. విన్న వాళ్ళు మాక్కూడా ఒకటి తెచ్చిపెట్టామన్నారనుకోండి, ఈమెకు గొంతులో పచ్చి వెలక్కాయే! అందువల్ల ఇంటి గుట్టును పదిమందితో చాటకపోవడం మంచిది.
ప్రాకృతమూలం
వణ్ణం తీహిఁ తుహగుణే బహుసో అమ్హేఁ ఛి చ్ఛ ఈపుర ఓ
బాలఅ స అమేఅ కఓసి దుల్లహో కస్స కుప్పామో (సంకరసత్తి)
సంస్కృత ఛాయ
వర్ణయంతీ భిస్తవ గుణాన్ బహుశో స్మాభి రసతీ పురతః బాలక స్వయంమేవ కృతోసి దుర్లభః కస్మై కుప్యామః
- ఇంకావుంది...

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949