ఆంధ్ర గాథాలహరి

ఆమె ముఖం - వింత పద్మం -84

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాకృతమూలం
అహిలేంతి సురహిణీ ససి అ పరిమలాబద్ధ మండలం భమరా!
అముణి అ చంద పరిహవం అ పువ్వకమలం ముహంతిస్సా (వసంతుడు)
సంస్కృత ఛాయ
అభిలీయంతే సురభినిః శ్వసిత పరిమలాబద్ధమండలం భ్రమరాః
అజ్ఞాత చంద్ర పరిభవ మపూరవకమలం ముఖం తస్యాః

తె.గీ పూర్ణ శశిమించు పరిమళ పూర్ణమైన
ఆమె ముఖ పద్మమొకవింత అబ్జమనియు
భ్రమసి ఆ సౌర భంబుల బడయనెంచి
గుములు గుములుగ మూగెను భ్రమరసమితి
‘‘చంద్రబింబాన్ని మించిన అందంగల ఆమె ముఖం పరిమళభరితమైన ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఒక వింత పద్మంలా భాసిస్తోంది. ఆ పరిమళాలను ఆస్వాదించడానికి తుమ్మెదలు గుంపులు గుంపులుగా ఆమె ముఖపద్మాన్ని చుట్టుముట్టాయి’’ అని నాయికమీద నాయకునికి మరులు పెంచడానికి దూతిక ఉత్ప్రేక్షించి చెప్తోంది.
వివరణ: సహజంగా అందమైన ఆడువారి ముఖాన్ని పద్మంతోనో, చంద్రబింబంతోనో పోల్చడం ఆనవాయితీ. కానీ రెండింటినీ చెప్పి అంతకుమించి ఆమె ముఖం సువాసనాభరితమైన పద్మం అని చెప్పడం ఈ గాథలోని విశేషం. బంగారానికి తావి అబ్బడం అంటే ఇదే. సౌందర్యానికి సౌశీల్యంతోడైతే మనిషికి అంతకన్నా మించిన పరిమళమేముంటంది. ఒక వ్యక్తి సౌందర్యం చూసినవారికే తెలుస్తుంది. కానీ ఆ వ్యక్తి యొక్క ప్రతిభా విశేషాలు, గుణగరిష్టత ఖండాంతరాలు దాటి వ్యాపిస్తాయి. అదే మనిషి తాలూకా పరిమళం అంటే.
- ఇంకా ఉంది

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949