ఆంధ్ర గాథాలహరి

అదే బాణంతో.. --96

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాకృత మూలం
జమ్మంతరే వి చలణం జీ ఏణ ఖుమ అణతుజ్ఘ అచ్చిస్సం
జ ఇతం పి తేణ బాణేణ విజ్ఘసే జేణ హంవిజ్ఘా (ముగ్ధుడు)
సంస్కృతచ్ఛాయ
జన్మాంతరే పి చరణౌ జీవేన ఖలు మదన తవార్చయిష్యామి
యది తమపి తేన బాణేన విధ్యసి యేనాహం విద్ధా
ఆ.వె॥ ఎట్టి శరముతోడ కొట్టినావో నన్ను
అట్టి శరముతోడ కొట్టుమతని
మార! శ్రీ రమాకుమార! పూజింతును
జన్మ జన్మములకు జ్ఞప్తికలిగి!
- ‘‘ఓ మన్మథా! నీ బాణాలతో ననే్న ఎందుకు కొడుతున్నావు. ఏ బాణంతో అయితే నన్ను కొట్టావో, అదే బాణంతో నా ప్రియుణ్ణి కూడా కొట్టు. అప్పుడు వాడికి నా విరహ బాధేమిటో తెలిసివస్తుంది. అట్లా చేశావనుకో! వచ్చే జన్మలో కూడా నినే్న పూజిస్తాను. అంటే జన్మ జన్మలకూ నినే్న పూజిస్తూ ఉంటాను’’ అంటోంది నాయిక.

--ఇంకావుంది

--డి.వి.ఎం.సత్యనారాయణ 9885846949