ఆంధ్ర గాథాలహరి

విరహబాధ -97

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ శౌరితో గూడి భీముడు, కౌరవేయు
మర్దనము సేయుగతి, మధుమాసవేళ
దక్షిణానిల మక్షీణ కక్షబూని
బాధపెట్టుచున్నది, పాంథతతిని
-అసలే మధుమాసం. ఆపైన మలయానిలం చల్లగా వీస్తోంది. అంతకుమించి వ్యాపారార్థులై దూరదేశానుండడంవల్ల కలుగుతున్న సతీ విరహబాధ. ఆ బాధ ఎలా ఉందంటే శ్రీకృష్ణుని నేతృత్వంలో భీముడు, దుర్యోధనుని మర్దించినప్పుడు అతనికి కలిగిన బాధకన్నా ఎక్కువగా ఉందట.
వివరణ: ప్రియురాలు చెంత ఉన్నపుడు ఆనందహేతువులైనవే, వియోగ సమయంలో విషాద హేతువులౌతాయి. వసంత ఋతువు, మలయానిలం ఎప్పుడూ ఆహ్లాదకరములే కదా! కానీ విరహంలో ఇవన్నీ శత్రు సదృశాలౌతాయని, మహాభారత కథతో పోల్చి మరీ చెపుతున్నాడు గాథాకారుడు.
కవుల కదనానికి రాజుల మధ్య ఈర్ష్యా సూయలు, రాజ్యకాంక్షలు అక్కర్లేదు. కేవలం ప్రేయసీప్రియుల మధ్య ఎడబాటు కలిగించి ప్రకృతిని దుష్టుడిగా చిత్రీకరించి ఆ ప్రకృతితోనే భీకర యుద్ధం చేయంచగలరు. ప్రకృతిని ముల్లోకాలను పీడించే రాక్షసులకన్నా మిన్నయైన దుష్టత్వాన్ని కలిగి ఉన్నట్టు చూపించగలరు. అడిగేవానికి చెప్పేవాడు లోకువ అన్నట్టు భగ్నప్రేమికుడికి మహా రాక్షసి ప్రకృతియే. ఆ ప్రకృతి తనపై కక్షకట్టింది అంటాడు. కత్తి దూస్తోంది అనీ అంటాడు. అదే కదా విరహం.
ప్రాకృతమూలం
కరుణా హూ వ్విఅ పహిఓ దూమిజ్జఇ మాహవస్సమిలి ఏణ
భీమేణ జహిఛిఆయే దాహిణ వాఏణ ఛిప్పంతో
సంస్కృత ఛాయ
కురునాథ ఇవప థికో దూయతే మాధవస్య మిలితేన
భీమేన యధేచ్ఛయా దక్షిణవాతేన స్పృశ్యమానః
- ఇంకావుంది

-డి.వి.ఎం.సత్యనారాయణ 9885846949