ఆంధ్ర గాథాలహరి

ఏనుగు ఏనుగే-101

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ మేనిపై ధూళి మెండుగా మెలగుగాక!
పంక సంకరస్థితిలోన పరుగుగాక!
గడ్డిపోచలు దేహాన కలుగుగాక!
తానె చాటగలదు కరి తనదు ఘనత
ఏనుగు గొప్పతనాన్ని తెలిపే గాథ ఇది. ‘చచ్చినా, బ్రతికినా ఏనుగు ఏనుగే’ అనే సామెతకు సాదృశ్యరూపం ఈ గాథ. ఏనుగు ఒంటినిండా దుమ్ము కొట్టుకొని ఉండనీ, బురద పూసుకుని ఉండనీ, గడ్డిపోచలు ఒళ్ళంతా అంటుకొని ఉండనీగాక! ఏనుగు యొక్క ఘనతను ఒకరు చెప్పక్కర్లేదు. ఏనుగు తన ఘనతను తానే చాటుకొనగలదని ఈ గాథ సారాంశం.
వివరణ- ఏనుగు భూమిమీద చరించే జంతువులలో అతి పెద్దది. అందుకే ఏనుగును గజేంద్రుడు అంటారు. ఏనుగు ఐశ్వర్యానికి ప్రతీక కూడా. అందుకే ఏనుగును శ్రీమహాలక్ష్మికి ఇరువైపులా చిత్రిస్తారు. ఇంటి గుమ్మాలకు ఏనుగు బొమ్మలుంచుతారు. ఏనుగును ఎట్టి పరిస్థితుల్లోనూ కించపరచకూడదు. అసలు ఈ గాథలోని అంతరార్థమేమిటంటే- గొప్పవాళ్లు, విద్వాంసులు, ఉత్తములు పరిస్థితులవల్ల గడ్డం మాసిపోయి, చిరిగిన బట్టలతో కనిపించినా వారి గొప్పతనానికి అణుమాత్రం కూడా లోపం రాదని. వారిని సమాజమూ తక్కువ చేసి చూడకూడదని.
ప్రాకృతమూలం
ధూలిమఇలో విపంకంకిఓ వితణరఇ అదేహ భరణోవి
తహవి గ ఇన్దోగరు అత్తణేణ ఢక్కం సమువ్వహఇ
సంస్కృతచ్ఛాయ
ధూలి మలినో పి పంకాంకితో పి తృణరచిత దేహభరణో పి
తథాపి గజేన్ద్రో గురుకత్వేన ఢక్కాం సముద్వహతి
- ఇంకావుంది

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949