ఆంధ్ర గాథాలహరి

అన్నిటా నీదు రూపమే -102

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ.వె నిఖిల జగమునందు నీ చిత్రపటముల
వ్రేలగట్టిరనగ వేల్పులెవరో
అన్ని దిక్కులందు అగుపించు నీ రూపు
నాదు నేత్రములకు ననవరతము
ప్రియా! ఎటు చూస్తే అటు నువ్వే కనిపిస్తున్నావు. నీ చిత్ర పటాలను భూమిపై అన్ని దిక్కులయందు వ్రేలగట్టినారా ఏమి? అని ప్రశ్నిస్తోంది నాయిక.
వివరణ
‘కనులు మూసినా నీవాయె, కనులు తెరిచినా నీవాయె’ అన్న స్థితే ప్రతి ప్రేమికుల జంటకూ ఉంటుంది. ‘ఎదుటా నీవే, ఎదులోనా నీవే’ అన్నట్టూ ఉంటుంది. ఈ గాథలో నాయికకు ఎటుచూస్తే అటు నాయకుని రూపమే కనిపిస్తోందట. ఆమె చమత్కారంగా ‘నీ చిత్ర పటాలేమైనా అన్ని చోట్లా వ్రేలగట్టారా ఏమి?’ అని అమాయకంగా అడుగుతోంది.కూరిమి గల దినములలో నేరములెన్నడు గలుగనేరవు అని శతకకారుడు ఎన్నడో చెప్పే ఉన్నాడు కదా. అంతా మనసు ప్రభావం. మనసుకు నచ్చితే చాలు అంతటా అన్నింటా కోరు కున్నదే కనిపిస్తుంది. అందు కే నాయకులు మనస్సౌంద ర్యాన్ని కలిగి ఉంటే చాలు నాయకలు తమను తాము దత్తం చేసుకుంటారు. మన సున ఒకటి పైకి ఒకటి కన బరిస్తే మాత్రం వారు అపర కాళికలు అవుతారు కనుక నాయకులారా తస్మాత్ జాగ్రత్త.. జాగ్రత్త...
భాగతోత్తములైనవారికి విశ్వమంతా విష్ణుమయమైనట్లు, ప్రేమికులకు జగమంతా ప్రేమమయమే!
ప్రాకృతమూలం
జం జంపుల ఏమి దిసంపుర ఓ లిహిఅవ్వదీససే తత్తో
తుహపడిమాపడి వాడిం వహఇవ్వస అలం దిసాచక్రం
సంస్కృతచ్ఛాయ
యాంయాం ప్రలోకయామి దిశం పురతో లిఖిత ఏవ దృశ్యతే తత్ర
తవప్రతిమా పరిపాటీం వహతీవ సకలం దిశాచక్రమ్

- ఇంకావుంది

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949