ఆంధ్ర గాథాలహరి

మన్మథ ప్రతాపం-106

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ.వె మావిచిగురు కనగ, మధుమాసవేళలో
మరి మరి విహరించు మన్మధుండు
విరహుల ప్రహరించి పెకలించినట్టిదౌ
బల్లెమట్లు అరుణ వర్ణమందె
నవ వసంతవేళ కుంకుమ వర్ణంతో ఉన్న మావిచిగురు ఎలా ఉందంటే, విరహ బాధాతప్తులైనవాళ్లను మన్మథుడు తన బల్లెంతో పొడిచి వెలికి తీయగా దానికి నెత్తురంటితే ఎలా ఉంటుందో, అలా ఉందట.
వివరణ
ఈ గాథలో ఒక సహజమైన విషయాన్ని ఉత్ప్రేక్షిస్తున్నాడు గాథాకారుడు. సహజంగా మావిచిగురు ఎర్రగా ఉంటుంది. అంత ఎర్రగా ఉండటానికి కారణం మన్మధుడట. మన్మథుడు తన బల్లెంతో విరహంతో ఉన్నవాళ్ళను కొడితే.. అది దిగబడిపోతే.. దాన్ని పెకలిస్తే... ఎంత రక్తవర్ణ శోభితవౌతుందోఊహించుకోమంటున్నాడు గాథాకారుడు.
అంతేకాదు చైత్రమాసంలోనే కదా మావిచిగురు తొడిగేది మన్మథుని చూసి సిగ్గిల్లిన మావి పిందె వేసినా సిగ్గు వీడక పోయేసరికి మావి తనని తాను దాచుకోవడానికి ఎర్రమందార మొగ్గలను తనపై సింగారించుకుంటుంది.
ప్రాకృతమూలం
ణవపల్లవం విసణ్ణా పహిఆ పేచ్ఛన్తిచూ అరుక్ఖస్స
కామస్స లోహి ఉప్పంగరా ఇఅం హత్థ్భల్లంవ
సంస్కృతచ్ఛాయ
నవపల్లవం విషణ్ణాః పథికాః పశ్యన్తి చూతవృక్షస్య
కామస్య లోహిత సమూహ రాజితం హస్త్భల్లమివ
- ఇంకావుంది

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949