ఆంధ్ర గాథాలహరి

చిక్కుకున్న లేడికూన (ఆంధ్రగాథాలహరి--107)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ.వె కానలోనమండు కార్చిచ్చునుగనియు
అరుణవర్ణ శోభనలరుచున్న
పూచినెగడు నట్టి మోదుగు చెట్లంచు
భ్రమసి లేడి కూన వదలిరాదు
అడవిలో కార్చిచ్చు ఎర్రగా మండుతోంది. కానీ అమాయకమైన లేడి మాత్రం ఆ ఎర్రదనాన్ని పూచిన ఎర్రని మోదుగు పూలుగా భావించి ఇవతలికి రావటం లేదట. పాపం ఆ అమాయకపు లేడికి ఏవౌతుందోనని ఆందోళన పడుతున్నాడు గాథాకారుడు.
వివరణ
భ్రమ ఎప్పుడూ ప్రమాదహేతువే. ఎండమావుల్ని సరస్సులుగా భావించి పరుగెత్తే లేళ్ళను కావ్యాల్లో చూడవచ్చు. అందుకే ఎండమావుల్ని మృగతృష్ణలు అంటారు. మనిషి కూడా ప్రమాదం వస్తుందని తెలుసుకోలేక అనేక వ్యసనాల్లో కూరుకుపోతుంటాడు. వ్యసనాలు మనిషిని ఆపదల్లో పడవేస్తాయి. వ్యసనాలే కాదు బంధాలు కూడా మురిపిస్తాయ కాని బంధితుడిని చేసి మనిషితనాన్ని మరి చేట్టు చేస్తాయ. ఈ విషయంలో తప్పక జాగ్రత్త వహించాలి. అమాయక లేడిలాగా వాటిల్లో చిక్కుకున్న మనిషి మాడి మసైపోతాడు. తస్మాత్ జాగ్రత్త!

ప్రాకృతమూలం
తమ్మిరపసరి అహు అవహ జాలాలి పలీవిఏ వణాహోఏ
కింసు అవణన్తి కలిఊణ ముద్ధహరింణణిక్క మఇ
(సారుడు)
సంస్కృతచ్ఛాయ
తామ్రవర్ణ ప్రసృతహుతవహ జ్జ్వాలా వలిప్రదీపితే వనాభోగే
కింశు కవన మితి కలయిత్వా ముగ్ధహరిణోనని ష్క్రామతి

- ఇంకావుంది

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949