ఆంధ్ర గాథాలహరి

శరత్కాల మేఘాలు-109

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ జలధరంబులు శారద సమయమందు
వర్షధారలు కురిపించి వట్టిపోయి
ఉప్పుకొండలవలె దూది కుప్పలవలె
వెలయుచుండెను ఆకాశవీధిలోన

శరత్కాలంలో మేఘాలు నీరు లేకపోవడంవల్ల తెల్లగా ఉప్పు కొండల్లాగా, ఏకిన దూది కుప్పల్లాగా ఉన్నాయని వర్ణిస్తున్నాడు గాథాకారుడు.
వివరణ: వర్షఋతువులో మేఘాలు నల్లగా కదిలిపోయే ఏనుగుల్లాగా ఉంటాయి. అదే శరదృతువు వచ్చేసరికి మేఘాల్లో నీరుండదు కనుక అవి తెల్లగా మారిపోతాయి. అప్పుడు ఆకాశం నిర్మలంగా ఉంటుంది. మబ్బులు వెండికొండల్లాగా మెరుస్తూ ఉంటాయి. ఆస్వాదించే వారికి ఏ ఋతువులోనైనా ప్రకృతి అందంగానే కనిపిస్తుంది. మనిషికి ఉన్న గొప్పగుణమే భావన. ఆ భావనకు తగ్గట్టుగా తన వూహాలోకంలో దేనినైనా సృజియం చుకుంటాడు. దానే్న చూస్తూ అనుభవిస్తూ జీవితాన్ని ఆనందంగా గడిపేస్తాడు.
ప్రాకృతమూలం
ఉఅ సింధవ పవ్వ అసచ్ఛహా ఇధు అతూలపుంజ సరిసాఇం
సోహంతి సుఅణు ముక్కో అఆఇం సరఏసి అబ్భాఇం
సంస్కృతచ్ఛాయ
పశ్యసైంధవ పర్వత సదృక్షాణి ధుతతూలపుంజసదృశాని
శోభంతే సుతను ముక్తోదకానిశరది సితాభ్రాణి
- ఇంకావుంది

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949