అనంతపురం

ఎంత ఖర్చయినా పంటలను రక్షిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కదిరి, ఆగస్టు 29:జిల్లాలో రైతులు సాగు చేసిన వేరుశనగ పంటకు సకాలంలో వర్షాలు కురవలేదని, ఎంత ఖర్చైనా పంటలు కాపాడుతామని సాంఘిక సంక్షేమ శాఖామంత్రి రావెల కిషోర్‌బాబు పేర్కొన్నారు. సోమవారం స్థానిక రోడ్లు భవనాల అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వేరుశనగ పంటను రక్షించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు. వర్షాభావం వల్ల వేరుశనగ పంట ఎండిపోయిందని, ఉన్న పంటకు రక్షక తడులు ఇచ్చి కాపాడడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి యుద్ధప్రాతిపదికన రక్షక తడులు అందించాలని ఆదేశాలు ఇవ్వడంతో పాటు నియోజకవర్గానికి ఒక మంత్రిని నియమించడం జరిగిందన్నారు. మరిన్ని రైన్‌గన్లు జిల్లాకు తీసుకొస్తున్నామన్నారు. వున్న అన్ని జలవనరులను, యంత్ర సామాగ్రిని ఉపయోగించి పంటలను కాపాడడమే ప్రథమ కర్తవ్యం అన్నారు. జిల్లాకు అవసరమైన రైన్‌గన్‌లు, స్ప్రింక్లర్లు, ఆయిల్ ఇంజన్లు, పైపులు సిద్ధం చేశామన్నారు. అనంతరం కదిరి రూరల్ అల్లీపూర్‌తండా సమీపంలోని పొలాల్లో రైన్‌గన్‌లు పనితీరును మంత్రి పరిశీలించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా, మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ గుడిసె దేవానంద్, మహిళా కమీషన్ సభ్యురాలు పర్వీన్‌బాను, మార్కెట్ యార్డు ఛైర్మన్ గరికపల్లి రామక్రిష్ణారెడ్డి, ఆర్డీఓ వెంకటేసు, తహసీల్దార్ రామక్రిష్ణారెడ్డి, టీడీపీ నాయకులు బాబ్‌జాన్, కౌన్సిలర్లు చంద్రశేఖర్, రాజశేఖరాచారి, తాతా శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.