అనంతపురం

నేటి నుంచి జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఆగస్టు 29: వర్షాభావంతో ఎండుతున్న వేరుశెనగ పంటను కాపాడేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన రక్షక తడి ప్రక్రియను క్షేత్ర స్థాయిలో స్వయంగా పరిశీలించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేడు జిల్లాకు రానున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఆయన జిల్లాలోనే ఉంటూ రెయిన్‌గన్స్ ద్వారా పంటకు ఇచ్చే మొదటి రక్షక నీటి తడులు సక్రమంగా అందేలా పర్యవేక్షిస్తారు. ఈ సందర్భంగా రోజుకు రెండేసి నియోజకవర్గాల్లో పలు గ్రామాల్లో పర్యటించే అవకాశం ఉంది. మంగళవారం మధ్యాహ్నానికి సిఎం జిల్లాకు చేరనున్నారు. తొలుత పెనుకొండ నియోజకవర్గంలోని రొద్దం మండలం పెద్దమంతూరుకు మధ్యాహ్నం ఒంటి గంటలకు రానున్నారు. అక్కడి నుంచి ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని ఉప్పునేసినపల్లికి మూడు గంటల లోగా చేరనున్నట్లు సమాచారం. ఆయా గ్రామాల్లో రైతులతో ముఖాముఖి మాట్లాడుతారు. అక్కడి వేరుశెనగ పంట పొలాలను పరిశీలించి, రెయిన్‌గన్స్ ద్వారా నీటి తడి అందించే విధానాన్ని పర్యవేక్షిస్తారు. నేడు ధర్మవరం, పెనుకొండ నియోజకవర్గాల్లో సిఎం పర్యటించనున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఇన్‌చార్జి కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఆదేశించారు. సోమవారం డ్వామా పిడి చాంబర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పలు సూచనలు చేశారు. రెండు నియోజకవర్గాల్లో సిఎం రక్షక తడుల అమలుపై పరిశీలిస్తారన్నారు. జెసి-2 ఖాజామొహిద్దీన్‌ను పెనుకొండ, ఎపిఎం ఐపి పిడి వెంకటేశ్వర్లు ధర్మవరం నియోజకవర్గాల్లో కార్యక్రమాలకు ఇన్‌చార్జులుగా వ్యవహరిస్తారన్నారు. పెనుకొండ నియోజకవర్గంలో సిరికల్చర్ జెడి అరుణకుమారి, గ్రౌండ్ వాటర్ శాఖ డిడి పురుషోత్తమరెడ్డి, పెనుకొండ ఆర్‌డిఒ రామ్మూర్తి, ధర్మవరానికి సంబంధించి డిప్యూటీ సిఇఒ సూర్యనారాయణ, డిడి హార్టికల్చర్ సుబ్బరాయుడు, ధర్మవరం ఆర్‌డిఓ బాలానాయక్ సహకరించాలని ఆదేశించారు. అలాగే రెవెన్యూ భవన్‌లో 14 కంప్యూటర్లు, 14 ప్రింటర్లు, ఇంటర్నెట్ సౌకర్యంతో సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిఆర్‌ఒ మల్లేశ్వరి, డిఐసి జయం సుదర్శన్‌బాబుకు బాధ్యతలు అప్పగించారు. కంప్యూటర్లలో భూగర్భజలాలు, రెయిన్‌గన్లు తదితరాల వివరాలను నమోదు చేయాలని నియోజకవర్గాల వారీగా నిక్షిప్తం చేయాలని వ్యవసాయ శాఖను ఆదేశించారు. సమావేశంలో సిపిఓ సుదర్శన్‌బాబు, డ్వామా పిడి నాగభూషణం, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఓబులేసు, ఆర్‌డిఓ మలోలా, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ హరేరామ్‌నాయక్, డిప్యూటీ సిఇఓ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.