అనంతపురం

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మవరం రూరల్, ఆగస్టు 30 : మండలంలోని మల్లేనిపల్లి గ్రామంలో విద్యుత్ షాక్‌తో రమేష్(23) మృతిచెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం రమేష్‌తో పాటు మరో నలుగురు యువకులు గ్రామానికి సమీపంలో ఉన్న పొలంలో విద్యుత్ వైరును లాగుతున్న సమయంలో వైరు పైభాగాన ఉన్న హైటెన్షన్ తీగలకు తగిలి ముగ్గురు యువకులకు షాక్ కొట్టింది. అయితే రమేష్‌కు అధికంగా విద్యుత్‌షాక్ కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు రమేష్‌ను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించగా షాక్‌తో అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఒక్కగానొక్క కొడుకు మృతిచెందడంతో తమకు దిక్కెవరంటూ తండ్రి కాటమయ్య, తల్లి రమణమ్మతో పాటు సోదరులు, బంధువుల రోధనలు మిన్నంటాయి. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆస్పత్రికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించడంతో కుటుంబాన్ని ఓదార్చారు. అలాగే టిడిపి నాయకులు మద్దిలేటితో పాటు సిపిఎం నాయకులు పోలా రామాంజనేయులు, పోలా లక్ష్మీనారాయణ, జంగాలపల్లి పెద్దన్న, ఎస్‌హెచ్.బాషా మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. రూరల్ ఎస్‌ఐ నాగశేఖర్, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
యువకుడి ఆత్మహత్య
తాడిపత్రి, ఆగస్టు 30 : మండల పరిధిలోని వెంకటరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మహబూబ్‌బాషా(30) మంగళవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువులు తెలిపిన వివరాల మేరకు పెద్దపప్పూరు మం డలం జె.కొత్తపల్లి గ్రామానికి చెందిన మహబూబ్‌బాషా ఏడు సంవత్సరాల క్రితం వెంకటరెడ్డిపల్లికి చెందిన అజీజ్‌ను వివాహం చేసుకుని ఇక్కడే నివాసం ఉంటున్నాడు. అయితే వ్యసనానికి బానిసై అనారోగ్యం పాలైన మహబూబ్‌బాషా జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి
మడకశిర, ఆగస్టు 30 : ఇటీవల జరిగిన ప్రమాదంలో గాయపడ్డ మండలంలోని దొడ్డేపల్లికి చెందిన రంగనాథ్ (38) మంగళవారం మృతి చెందాడు. గత వారం రోజుల క్రితం రంగనాథ్ వాగులో ట్రాక్టర్‌కు ఇసుక నింపేందుకు వెళ్లి ఇసుక దిబ్బలు పైన పడటంతో తీవ్ర గాయాలకు గురయ్యాడు. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించగా వైద్యుల సూచన మేరకు కుటుంబ సభ్యులు బెంగళూరుకు తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. కాగా మృతి చెందిన రంగనాథ్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
చికిత్స పొందుతూ మహిళ మృతి
యాడికి, ఆగస్టు 30 : మండల పరిధిలోని చందన గ్రామానికి చెందిన లక్ష్మీదేవి మంగళవారం చికిత్స పొందుతూ మృతి చెందింది. లక్ష్మీదేవి గత మూడు రోజుల క్రితం కడుపు నొప్పి తాళలేక కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రంగా గాయపడిన ఆమెను వైద్య చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మంగళవారం కర్నూలులో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు యాడికి పోలీసులు తెలిపారు.