అనంతపురం

విపత్తుల నుంచి కాపాడేందుకు ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుత్తి, ఆగస్టు 30 : రాయలసీమ జిల్లాలో నెలకొన్న కరవు, ఇతర విపత్తుల నుంచి రైతు, యువతను కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను రూపొందించినట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జిల్లాలోని గుంతకల్లు, ఉరవకొండ నియోజక వర్గాలకు ఇన్‌చార్జిగా నియమించిన సందర్భంగా మంగళవారం స్థానిక ఆర్‌అండ్‌బి బంగ్లాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో తీవ్రమైన వర్షాభావం ఏర్పడిన దృష్ట్యా పంటలు ఎండిపోయిన పరిస్థితి నెలకొందన్నారు. విపత్కర పరిస్థితుల నుంచి రైతులను కాపాడేందుకు, జిల్లా నుండి సంపూర్ణంగా కదవును పారదోలేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక చర్యలు చేపట్టారన్నారు. ఇందులో భాగంగానే రెయిన్ గన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. అంతేగాకుండా జిల్లాకు 11 మంది ఐఎఎస్ అధికారులతో పాటు ప్రతి రెండు నియోజక వర్గాలకు ఓ మంత్రిని నియమించి విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అయితే జిల్లాలోని 28 మండలాల్లో సోమవారం రాత్రి కురిసిన వర్షాల వల్ల కొంతమేర పంటలకు ఊరట లభించిందన్నారు. ఇకపోతే ప్రభుత్వం మద్యం వ్యాపారాన్ని ఆర్థిక వనరుగా చూడటం లేదన్నారు. నిర్ణీత ధరకే మద్యం అమ్మకాలు కొనసాగించాలన్నారు. అధిక ధరలకు అమ్మె దుకాణాలకు రూ.5లక్షల జరిమానా విధిస్తామన్నారు. నవోదయం కార్యక్రమం ద్వారా ఇప్పటికే గ్రామాల్లో నాటుసారాను పూర్తిగా నివారించగలిగామన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే జితేంద్రగౌడ్, నాయకులు హరినాథ్‌గౌడ్, నాయకులు శివలింగారెడ్డి, ఎ వెంకటరాముడు, సర్పంచు నాగేంద్ర, వెంకటరాముడు, శ్రీనివాస చౌదరి, చెన్నకేశవులు, భాస్కర్ స్వామి తదితరులు పాల్గొన్నారు.