అనంతపురం

వేరుశెనగ రైతులను ఆదుకుంటాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంబదూరు, ఆగస్టు 30 : రక్షక తడులను అందించి వేర్జుఇనగ పంటలను కాపాడుతామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కదిరి దేవరపల్లి, అండేపల్లి, గుత్తిరెడ్డిపల్లి, ఓబుగానిపల్లిలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెయిన్ గన్‌లను ఉపయోగించి వేరుశెనగ పంటను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. బోరు బావులు ఉన్న రైతులు ఇతర రైతులకు రక్షకతడులు అందించేందుకు సహకరించాలని కోరారు. పది రోజుల ముందుగా రెయిన్‌గన్‌లను పంపిణీ చేయాల్సి ఉంన్నిందని రైతులు మంత్రిని కోరారు. కృష్ణా పుష్కరాల వల్ల సకాలంలో రైతులకు అందించలేకపోయామని, అయినప్పటికీ రక్షక తడులతో పంటలను కాపాడుతామన్నారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసి సిబ్బంది పనితీరుపై రోగులను అడిగి తెలుసుకున్నారు. 30 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని ప్రజలు కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హనుమంతరాయచౌదరి, మార్కెట్ యార్డు చైర్మన్ బాదన్న, ఎంపిపి గోవిందుచౌదరి, సర్పంచ్ శ్రీరాములు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు తిప్పేస్వామి, డిఎంఅండ్‌హెచ్ వెంకటరమణ, వ్యవసాయాధికారి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
శింగనమలలో...
శింగనమల : మండలంలోని నాగులగుడ్డం, నరసాపురం గ్రామాల్లో రైతులు సాగు చేసిన పంట పొలాలను మంత్రి పీతల సుజాత పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు సాగు చేసిన వేరుశెనగ పంట వర్షాలు రాకపోవడం వల్ల ఎండి పోకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు రక్షక తడులు అందించేందుకు రెయిన్‌గన్‌లు అందజేస్తున్నారన్నారు. అనంతరం మండలానికి వచ్చిన రెయిన్‌గన్‌లు, స్పింకర్లను పరిశీలించారు. వాటిని వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విప్ యామినీబాల, ఎమ్మెల్సీ శమంతకమణి, ప్రత్యేకాధికారి రామ్మోహన్, తహశీల్దార్ విజయకుమారి, ఎంపిడిఓ శ్రీరాములు, ఎంపిపి అమృత, జడ్పీటీసీ శ్యామల, ఎఓ పవన్‌కుమార్, మార్కెట్ యార్డు చైర్మన్ చంద్రమోహన్, నాయకులు కృష్ణమూర్తి, మండల నాయకులు ఆదినారాయణ, గంగాధర్, విజయ్‌భాస్కర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, రాఘవరెడ్డి పాల్గొన్నారు.