అనంతపురం

మానసిక ఒత్తిడిని జయించేందుకు క్రీడలు అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, సెప్టెంబర్ 13: నిత్య జీవితంలో ఆటుపోట్లతో పయనిస్తున్న ప్రతి మనిషికి మానసిక ఒత్తిడి తీవ్ర ఆందోళన కల్గిస్తోందని, వీటిని జయించేందుకు క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని మైనార్టీ సంక్షేమ, సమాచార, పౌర సంబంధాల, ఐటి శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి తెలిపారు. మంగళవారం నగరంలోని అశోక్ నగర్‌లోని ఇండోర్ స్టేడియంను స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో కలసి మంత్రి సందర్శించారు. వర్షపు నీటితో బురదమయం అయిన స్టేడియం ఆవరణ ప్రాంతాన్ని వారు పరిశీలించారు. సత్వరమే మట్టిని వేసి వర్షపు నీరు రాకుండా అడ్డుకట్ట వేయాలని కార్పొరేటర్ సరిపూటి రమణకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విధి నిర్వహణలో మానసిక ఒత్తిడితో సతమతమవుతూ అనేక రోగాలకు గురవుతున్నారని, అలాంటి వారికి క్రీడలు ఎంతో అవసరమన్నారు. మనిషికి ఆటలు ఎంతో ఉల్లాసాన్ని కల్గిస్తాయన్నారు. అనంతరం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మాట్లాడుతూ క్రీడలను ప్రాధాన్యతగా గుర్తించి వీటిని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇండోర్ స్డేడియం అభివృద్ధికి 7 లక్షల రూపాయల నిధులు మంజూరు చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ స్వరూప, కార్పొరేటర్ సరిపూటి రమణ, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.