అనంతపురం

యువకుడి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనుకొండ, సెప్టెంబర్ 19:పట్టణంలోని రైల్వేస్టేషన్ సమీపంలో స్థానిక దర్గాపేటకు చెందిన ముసాపీర్ (22) అనే యువకుడు రైలు కింద ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు గత కొన్ని నెలలుగా మతిస్థిమితం లేకుండా సంచరిస్తుండేవాడని, మానసిక వైకల్యంతో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. హిందూపురం రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.
వ్యక్తి ఆత్మహత్య
చిలమత్తూరు, సెప్టెంబర్ 19:మండల పరిధిలోని హుసేన్‌పురంలో సోమవారం తెల్లవారుజామున ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హుసేన్‌పురం గ్రామానికి చెందిన వడ్డె రామాంజినేయులు (26) వివాహేతర సంబందం తన భార్యకు తెలియడంతో వారి మధ్య గత కొంతకాలంగా వివాదం నెలకొంది. దీంతో మనస్తాపానికి గురైన రామాంజినేయులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే అతనిని హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్సలు పొందుతూ మృతి చెందాడు. ఎస్‌ఐ బ్రహ్మానందరెడ్డి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
యువకుడి ఆత్మహత్య
కదిరి, సెప్టెంబర్ 19: ఉద్యోగం రాలేదన్న మనస్థాపంతో బాలాజీ (26) సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అమడగూరు మండలం చీకిరేవులపల్లికి చెందిన బాలాజీ మిలటరీ సెలక్షన్లకు వెళ్లి ఎంపిక కాకపోవడంతో మనస్థాపంకు గురై కదిరి రైల్వే స్టేషన్ సమీపంలోని అమీన్ నగర్‌లో విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన స్థానికులు పట్టణ పోలీసులకు సమాచారం అందించడంతో పట్టణ ఎస్‌ఐ గోపాలుడు సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. సంఘటనపై ఆరా తీసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో భార్య మృతి
భర్తకు గాయాలు
ముదిగుబ్బ, సెప్టెంబర్ 19: ముదిగుబ్బ మండలంలో దొరిగల్లు- పులివెందుల మధ్య గల ఘాట్ రోడ్డునందు ములుపులో సో మవారం ద్విచక్ర వాహనం అదుపుతప్పి బుక్కపట్నం మండలం మారాల గ్రామానికి చెందిన రంగనాథమ్మ (53) మృతి చెందగా ఆమె భర్త చండ్రాయుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ముదిగుబ్బ ఎస్సై జయానాయక్ తెలిపి సమాచారం మేరకు వివరాలు... మారాలకు చెందిన చండ్రాయుడు తన భార్య రంగనాథమ్మ, 5 ఏళ్ల వయసున్న మనుమడితో కలిసి ద్విచక్ర వాహనంలో పులివెందుల వెళ్తుండగా ఘాట్ రోడ్డు నందు మలుపులో వాహనం అదుపుతప్పి రోడ్డు డివైడర్‌లకు ఢీకొనగా భార్య, భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి చికిత్స కొరకు అనంతపురం తరలించగా రంగనాథమ్మ చికిత్స పొందుతూ మృతి చెందింది. చండ్రాయుడు పరిస్థితి విషమంగా వున్నట్లు తెలిసింది. చిన్నారికి ఎలాంటి గాయాలు కాలేదని ఎస్సై తెలిపారు.
మహిళలపై దాడి
పరిగి, సెప్టెంబర్ 19:ఇసుకను తమ పొలాల గుండా అక్రమంగా తరలించడం పట్ల సహించని మహిళలు ట్రాక్టర్‌ను అడ్డుకోవడంతో ట్రాక్టర్‌కు చెందిన వ్యక్తులు శీగుపల్లి గ్రామానికి చెందిన రామాంజినమ్మ, రామలక్ష్మమ్మ తదితరుల దాడి చేసి గాయపరిచినట్లు బాధితులు తెలిపారు. గాయపడ్డవారిని హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.