అనంతపురం

పొలాల్లో చిరుతల సంచారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వజ్రకరూరు, సెప్టెంబర్ 19:నిన్నమొన్నటి వరకు రెండు చిరుతలు కొండ గుట్టల్లో ఊరిచివరి కుంటల్లో నీరు తాగి పోయేవి. సోమవారం పొలాల వెంబడి తిరుగుతూ పట్టపగలే ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. అదిగో చిరుతలు, ఇదిగో చిరుతలు అని గూళ్లపాళ్యం గ్రామస్తులు భయాందోళనలు చెందుతున్నారు. రైతులు తమ ఎద్దుల బండితో పొలాలకు వెళ్లడానికి, పశువుల కాపర్లు పశువులను మేపడానికి వెళ్లాలంటేనే భయబ్రాంతులకు గురౌతున్నారు. తోటల్లో పనిచేసే కూలీలు చిరుతల సంచారంతో పనులకు వెళ్లడానికి నిరాకరిస్తున్నారు. లక్షలాది వ్యయం చేసి తోటల్లో పంటలు సాగుచేసిన రైతులు తోటలకు వెళ్లాలంటేనే భయాందోళనలు చెందుతున్నారు. చిరుతలు పగలంతా పొలాల్లో తిరుగుతూ, రాత్రివేళల్లో కొండల్లో చేరుతున్నాయన్నారు. వీటిని వేరేప్రాంతాలకు మళ్లించాల్సిన అటవీసిబ్బంది నామమాత్రంగా గ్రామాల్లో కాపలా ఉన్నారని గ్రామస్తులు పేర్కొంటున్నారు.