అనంతపురం

సమ్మెటీవ్-1 పరీక్షలకు సర్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, సెప్టెంబర్ 19: నూతన పద్ధతిలో సమ్మెటీవ్-1 త్రై మాసిక పరీక్షలు ఈ నెల 21వ తేదీ నుండి 28వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించడానికి విద్యా శాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. త్రై మాసిక పరీక్షలు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, గురుకుల, కెజిబివి అన్ని పాఠశాలల్లో ఈ నెల 21 నుండి త్రైమాసిక పరీక్షలు ఒకే రకంగా రహస్య పద్ధతిలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబందించి అన్ని పాఠశాలలకు సోమవారం నుండి త్రైమాసిక పరీక్షలకు సంబందించిన ప్రభుత్వం అందించిన ప్రశ్నపత్రాలు జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో డిసిఈబి అధికారులు రహస్యంగా జిల్లాలోని అన్ని పాఠశాలలకు పంపిణీ చేశారు. గతంలో జిల్లాస్థాయిలో డిసిఈబి ద్వారా ప్రశ్నా పత్రాన్ని తయారుచేసుకుని పాఠశాలల్లో త్రైమాసిక పరీక్షలు నిర్వహించే వారని, కానీ విద్యార్థుల సామర్థ్యాన్ని గుర్తించేందుకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకమైన ప్రశ్నపత్రాన్ని తయారుచేయించి, త్రైమాసిక పరీక్షలు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి పరీక్షల ద్వారా ఉపాధ్యాయులు పరీక్షలకు అనుగుణంగా విద్యార్థులకు సిలబస్‌ను బోధించుకునేందుకు వీలుటుందని, చిన్న తరగతి నుండి పరీక్షలపై విద్యార్థులు ఆసక్తి చూపుతారనే ఉద్దేశ్యంతో విద్యా శాఖ ఈ ఉమ్మడి పరీక్షలు ప్రవేశపెట్టింది. ఏ రోజుకు ఆ రోజు ప్రశ్నపత్రాలను విద్యార్థులకు అందించి పరీక్షలు రాయించాలని విద్యా శాఖ ప్రధానోపాధ్యాయులకు సూచనలు చేశారు. ఇందుకు సంబందించి జిల్లాలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు నిర్వహించే త్రైమాసిక పరీక్షలను పక్బాందీగా నిర్వహించాలని జిల్లా విద్యా శాఖ గత వారం రోజులుగా ప్రధానోపాధ్యాయులకు, మండల విద్యాధికారులకు శిక్షణ, అవగాహనను కల్పించారు. ఈ పరీక్షల ప్రశ్న పత్రాలను సోమవారం రోజున ఉపాధ్యాయ భవన్‌లో జిల్లాలోని అన్ని పాఠశాలలకు పంపిణీ చేసారు. త్రైమాసిక పరీక్షల అనంతరం వాటిని వాల్యూయేషన్ చేయడానికి పక్క మండలాలకు పంపించి వాల్యూయేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయింది. ఈ విధానాన్ని ప్రభుత్వ ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా దానిపై ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి సమగ్ర సమాచారం అందకపోవడంతో ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొన్నది. త్రైమాసిక పరీక్షలను రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా నిర్వహిస్తుండడంతో జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో పకడ్బందీగా ఏర్పాట్లును చేశారు.