అనంతపురం

జ్వర బాధితులకు తాత్కాలికంగా నాలుగు అదనపు వార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం అర్బన్, సెప్టెంబర్ 19 : జిల్లా కేంద్రంలోని సర్వజన ఆసుపత్రిలో 350 రోగులకు సరిపడా వైద్యసేవలందించే డాక్టర్లు, సిబ్బంది, వౌలిక వసతులు వున్నాయని అయితే వైరల్ ఫీవర్స్ భయంతో 3 రెట్లు అధికంగా (1006) రోగులు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో సోమవారం నాటికి ఇన్‌పేషెంట్స్‌గా వున్నారని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం జ్వర బాధితుల కోసం మరో నాలుగు అదనపు వార్డులను ఏర్పాటుచేయడానికి సూపరింటెండెంట్ ఛాంబర్‌లో నిర్వహించిన అత్యవసర సమావేశంలో కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ అదనపు వార్డ్‌ల ఏర్పాటుతో అధికంగా వస్తున్న విష జ్వరాల బాధితులకు వైద్యం అందిస్తామన్నారు. ఏ ఒక్కరిని కూడా వెనక్కి పంపకుండా అందరికి వైద్య సహాయం అందిస్తామన్నారు. తాత్కాతిక అదనపు వార్డుల్లో పనిచేయడానికి మెడికల్ కాలేజీ నుంచి ముగ్గురు డాక్టర్లను డిప్యూట్ చేయాలని వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ను కలెక్టర్ ఆదేశించారు. అలాగే 70 పరుపులను అదనపు వార్డులకు అందించాలని డియంహెచ్‌ఒకు ఆదేశించారు. అవసరమైన ఫ్యాన్లు, మంచాలు, లైట్లు, ఇతర వౌళిక వసతులు తక్షణమే సమకూర్చాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌యంఓ డా.వైవి రావ్, హెచ్‌ఓడిలు డా.వెంకటేశ్వర్‌రావ్, డా.రామస్వామి నాయక్, డా.మల్లిశ్వరి, అన్ని విభాగాల హెచ్‌ఓడి డాక్టర్లు, డియంఓ దోసారెడ్డి, నర్సింగ్ హెచ్‌ఓడి రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.