అనంతపురం

వ్యక్తి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామిడి, సెప్టెంబర్ 22: వ్యవసాయం కోసం చేసిన అప్పులు అధికం కావటం.. భార్య పుట్టింటికి వెళ్ళిపోవటంతో విరక్తి చెందిన తలారి శివ (30) పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన బుధవారం రాత్రి మండల పరిధిలోని అనుంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. సంఘటనకు సంబందించి పోలీసులు అందించిన వివరాలిలా వున్నాయి.. తనకున్న రెండెకరాలతోపాటు సోదరుని 4 ఎకరాలు పొలాన్ని గుత్తకు తీసుకుని తలారి శివ పత్తి పంటను సాగు చేశాడన్నారు. పత్తి పంట సాగులో నష్టాలు రావటంతో చేసిన అప్పులు అధికం కావటం కారణంగా సతమతమవుతున్న క్రమంలో భార్య పుట్టింటికి వెళ్ళిపోవటంతో విరక్తి చెంది పురుగుల మందును సేవించాడన్నారు. అపస్మారక స్థితిలో పడి వున్న తలారి శివను అనంతపురంకు తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఒకని ఆత్మహత్యాయత్నం
లేపాక్షి, సెప్టెంబర్ 22 : మండల పరిధిలోని కుర్లపల్లికి చెందిన సత్యనారాయణ గురువారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు చిలమత్తూరు మండల పరిధిలోని ఓబుళాపురం గ్రామానికి చెందిన సత్యనారాయణ కుర్లపల్లి గ్రామానికి చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. అయితే భార్యాభర్తల మధ్య తరచూ కుటుంబ కలహాలు చోటు చేసుకునేవి. ఇందులో భాగంగానే ఇటీవల భార్య తన భర్తకు చెప్పకుండా పుట్టింటికి వచ్చింది. భార్యను వెతుక్కుంటూ సత్యనారాయణ గురువారం కుర్లపల్లి గ్రామానికి వచ్చాడు. అత్తగారింట్లో భార్య కనిపించకపోయే సరికి తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు 108 వాహనంలో హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
దొంగలు అరెస్టు
* బంగారం, వెండి ఆభరణాలు, ద్విచక్ర వాహనం స్వాధీనం
అనంతపురం అర్బన్, సెప్టెంబర్ 22: గత రెండు నెలలుగా నగరంలోని పోలీసులు వివిధ బందోబస్తుల్లో భాగంగా పనిచేయాల్సి రావటంతో దీనిని అనుకూలంగా మలుచుకొన్న ఇద్దరు దొంగలు పగలు రెక్కీ నిర్వహించి రాత్రిళ్లు తాళాలు వేసిన ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు దొంగలను అరెస్టు చేసనట్లు డిఎస్పీ మల్లికార్జున వర్మ తెలిపారు. గురువారం పోలీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో విలేఖరుల సమావేశాన్ని నిర్వహించిన డిఎస్పీ మల్లికార్జున వర్మ వివరాలను వెల్లడించారు. దొంగల నుంచి 40 తులాల బంగారం, 9 తులాల వెండి ఆభరణాలు, ఒక ద్విచక్ర వాహనంతోపాటు మూడు కంప్యూటర్లను స్వాధీనం చేసుకోవటం జరిగిందిన్నారు. వీటి విలువ మెత్తం రూ.13 లక్షలు వుంటుందన్నారు. నిందితుల్లో ఒకరు నగరంలోని అశోక్ నగర్‌కు చెందిన షేక్ రషీద్, మరో నిందితుడు కనగానపల్లి మండలం మద్దెల చెర్వు గ్రామానికి చెందిన ప్రభంజన్‌రెడ్డి అని తెలిపారు. వీరిద్దరూ గత కొంతకాలంగా మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారన్నారు. ఇందులో షేక్ రషీద్ పాత నేరస్తుడేనన్నారు. ప్రభంజన్‌రెడ్డి ఏ పని చేయకుండా తల్లిదండ్రుల మీద ఆధారపడి జీవనం సాగించేవాడన్నారు. జల్సాలకు అలవాటుపడిన ఇద్దరు తాగుడు, జూదం తదితర వ్యవసానాలకు సైతం బానిసలుగా మారారన్నారు. కష్టపడి పనిచేయడం ఇష్టం లేని వీరు దొంగతనాలకు అలవాటుపడ్డారన్నారు. వీరు పగలు రెక్కీ నిర్వహించి రాత్రిళ్లు దొంగతనాలకు పాల్పడ్డారన్నారు. నగరంలో వీరు ఇద్దరూ ఏడు దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. నందమూరి నగర్, లక్ష్మి నగర్, భాగ్య నగర్, మండ్ల సుబ్బారెడ్డి నగర్, జీసస్ నగర్ ప్రాంతాల్లోని ఇళ్లల్లో చోరీలు చేశారన్నారు. వరుస చోరీలతో ఎస్‌పి రాజశేఖర్‌బాబు ఆదేశాల మేరకు తన ఆధ్వర్యంలో సిఐ శుభకుమార్, ఎస్‌ఐలు జనార్దన్, క్రాంతికుమార్, శివగంగాధర్‌రెడ్డి చోరీలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని దొంగలను స్థానిక సాయినగర్‌లో శుభకుమార్ అరెస్టు చేసినట్లు డియస్‌పి తెలిపారు. వీరి అరెస్టులో కీలకపాత్ర పోషించిన హెడ్ కానిస్టేబుల్ గిరిమహేష్, కానిస్టేబుళ్లు జాన్స న్, జయశంకర్, అసిఫ్, షఫీ, కేశవ, ఉమాశంకర్‌కు ఎస్‌పిచే రివార్డ్‌లు అందించటం జరుగుతుందన్నారు.