అనంతపురం

ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరుకు నివేదికలు పంపండి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురంటౌన్, సెప్టెంబర్ 22: వరుస కరవులకుతోడు వర్షాభావ పరిస్థితులతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారిని ఆదుకునేందుకు ఇన్‌పుట్ సబ్సిడీకై నివేదికలు పంపి ఆదుకునేలా చర్యలు చేపట్టాలని వ్యవసా య స్థారుూ సంఘ తాత్కాలిక అధ్యక్షుడు లక్ష్మినారాయణరెడ్డి కోరారు. గురువారం జడ్.పి హాలులో జరిగిన సమావేశానికి ఆయన అధ్యక్షత వహి ంచారు. ఇతర స్థారుూ సంఘాలకు జడ్.పి చైర్మన్ చమన్ అధ్యక్షత వహించారు. వ్యవసాయ స్థారుూ సంఘం లో రెయిన్‌గన్లపై చర్చ జరిగింది. వ్యవసాయ శాఖ జె.డి రామ్మూర్తి మాట్లాడుతూ జిల్లాకు 11 వేల రెయిన్‌గన్లకై ప్రతిపాదనలు పంపామన్నారు. రెయిన్‌గన్లతో పంటలు ఎండిపోకుండా కా పాడేందుకు చర్యలు చేపట్టామన్నారు. నీటి వసతి ఉన్న రైతులు పక్క పొలం వారికి కూడా సహకారం అందించారన్నారు. దీనిపై సంఘం అధ్యక్షుడు లక్ష్మినారాయణరెడ్డి, ఓడిసి జడ్‌పిటిసి ఓబిరెడ్డిలు మాట్లాడుతూ వంద ఎకరాల పంటకు కూడా రెయిన్‌గన్లతో ప్రయోజనం చేకూరలేదన్నారు. నీటి వసతి తక్కువగా ఉన్న వారు పక్క పొలాలకు నీరివ్వటానికి సుముఖత చూపలేదన్నారు. రెయిన్‌గన్లతోపాటు పైపులను రైతులు తీసుకెళ్ళి ఇళ్లలో పెట్టుకున్నారని అన్నారు. వాటిని అధికారులు స్వాధీనం చేసుకుంటారాయని ప్రశ్నించారు. అంతేకాక పైపులు ఇవ్వని వారిపై పోలీసు కేసులు పెడతారాయని అడిగారు. ఎరువుల కుంభకోణంలో అక్రమాలకు పాల్పడిన అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని కోరారు. దీనిపై వ్యవసాయ శాఖ అధికారులు మాట్లాడుతూ రెయిన్‌గన్లను వెనక్కు తీసుకుంటామని అన్నారు. ఎరువుల కుంభకోణంలో ఇద్దరు ఉద్యోగులను సరెండర్ చేశామన్నారు. విచారణ జరిపి బాధ్యులని తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జడ్.పిచైర్మన్ చమన్ అధ్యక్షతన జరిగిన 1, 7 స్థారుూ సంఘాలలో తాగునీరు, పారిశుద్ధ్యం అంశాలపై చర్చ జరిగింది. సభ్యులు మాట్లాడుతూ గ్రామాల్లోని వాటర్ ట్యాంకులలో ఆరు నెలలైనా బ్లీచింగ్ వేసి శుభ్రం చేయటం లేదన్నారు. గ్రామాలలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందన్నారు. ట్యాంకర్లను పెంచి నీటి సరఫరా జరిగేలా చూడాలన్నారు. అలాగే పారిశుద్ధ్యం పనులు చేపట్టి దోమలు వృద్ధి చెందకుండా చూడాలని కోరారు. జడ్.పి చైర్మన్ చమన్ మాట్లాడుతూ తుంగభధ్ర డ్యాం పూర్తిగా నిండకపోవటంతో జిల్లాకు రావాల్సిన కోటా నీటిని కూడా పొందలేకపోతున్నామని అన్నారు. ఇలాంటి పరిస్థితులలో హంద్రీనీవా జలాలే శరణ్యమన్నారు. భూగర్భ జలాలు పెంచటానికి కాలువల ద్వారా నీటిని వదలి చెరువులను నింపాలని సూచించారు. హెచ్‌ఎల్‌సి అధికారులు మాట్లాడుతూ నవంబరులో పిఏబిఆర్ ద్వారా 28 చెరువులు నింపటానికి చర్యలు చేపడతామన్నారు. అలాగే ఈ నెలాఖరుకు ఎంపిఆర్ డ్యామ్ ద్వారా దిగువన చెరువులు నింపేందుకు చర్యలు చేపడతామని తెలిపారు.