అనంతపురం

‘పురం’లో ముగ్గురికి డెంగ్యూ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం టౌన్, సెప్టెంబర్ 22 : పట్టణంలో ముగ్గురికి డెంగ్యూ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న 35 మందికి, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న మరో ఐదుగురికి డెంగ్యూ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా పట్టణంలోని అహ్మద్‌నగర్‌కు చెందిన ఒకరికి, మడకశిర ప్రాంతానికి చెందిన ఇద్దరికి డెంగ్యూ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. అహ్మద్‌నగర్‌లో డెం గ్యూ వ్యాధి సోకినట్లు రుజువు కావడంతో అటు వైద్యాధికారులు, ఇటు మున్సిపల్ అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ హుటాహుటిన అక్కడికి చేరుకుని పారిశుద్ధ్య పనులను చేయించడంతోపాటు ప్రజలకు అవగాహన కల్పించారు. దోమల నివారణకు ఫాగింగ్ చేస్తున్నామని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. దీనికితోడు గాంధీనగర్, హస్నాబాద్, శాంతినగర్, ఆర్టీసీ కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య పనుల స్పెషల్‌డ్రైవ్‌ను పరిశీలించారు. కాగా నింకంపల్లి పరిధిలో కూడా ఒకరికి డెంగ్యూ జ్వరాలు సోకినట్లు సమాచారం. దీంతో అక్కడ కూడా మున్సిపల్ అధికారులు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.