అనంతపురం

రైతుల కల సాకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, సెప్టెంబర్ 24: ఆత్మకూరు-కూడేరు మండల సరిహద్దులోని తిమ్మాపురం గ్రామం వద్ద హంద్రీనీవా కాలువ నుంచి మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కామినేని శ్రీనివాసులు, మంత్రి పల్లె రఘునాథరెడ్డిలు శనివారం రాప్తాడు నియోజకవర్గంలోని ఆత్మకూరు మండల పరిధిలోకి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ రైతుల కల సాకారం చేసిన వ్యక్తిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గుర్తుండి పోతారని పేర్కొన్నారు. జిల్లాలోని చెరువులన్నింటికి హంద్రీనీవా నీటితో తప్పక నింపుతామని, పేరూరు డ్యాంకు నీరు విడుదల చేయించే వరకు విశ్రమించేది లేదన్నారు. జీడిపల్లి నుంచి వచ్చిన నీరు బద్దలాపురం వరకు మొత్తం 64 కి.మీ. దూరం ముందుకు సాగుతాయన్నారు. ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉండగా మన జిల్లా నుంచే పాదయాత్ర చేశారని పేరూరు డ్యాం స్థితిని చూసి ఆనాడే హంద్రీనీవా నుంచి నీరు తెప్పిస్తామని హామీ ఇచ్చి రూ.850 కోట్లు నిధులు కేటాయించారన్నారు. పేరూరు డ్యాంకు నీరు తెప్పించి రైతు కళ్లలో ఆనందాన్ని చూస్తామని ముఖ్యమంత్రి కోరిక కూడా ఇదేనన్నారు. హంద్రీనీవా కాలువకు టిడిపి నేతలు నీరు తెప్పిస్తే మా పదవులకు రాజీనామా చేస్తామని, ఈరోజు సాంత్రం లోగా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి కామినేని శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజాభిమానం ఉన్న నేతలుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడులు రాష్ట్రానికి ఎనలేని సేవ చేస్తున్నారని జిల్లాకు హంద్రీనీవా గొప్పవరంలాంటిదన్నారు. సభకు విచ్చేసిన వారందరి వద్ద సెల్‌ఫోన్లున్నాయి. సిఎంకు ధన్యవాదాలు తెలుపుతూ పగలే సెల్‌ఫోన్లకు టార్చిలైట్లు వేసి సంఘీభావం ప్రకటించాలని సూచించగా అందరూ నిలబడి టార్చిలైట్లు వెలిగించి జయజయధ్వానాలు చేశారు. ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ ఈ వేదిక మీద ఉన్నవారందరికీ రాజకీయ భిక్ష పెట్టిన నాయకుడు ఎన్టీఆర్ అని, 1985లో హంద్రీనీవాకు మొదట శంఖుస్థాపన చేసిన నాయకుడాయన్నారు. కాంగ్రెస్ నాయకులు హంద్రీనీవాతో ధన యజ్ఞం చేపట్టి నేల మెతువుగా ఉన్నచోట గుంతలు తీసి 80శాతం నిధులు కాజేశారని, టిడిపి అధికారంలోకి రాగానే రైతు కష్టాలు తీర్చడానికి హంద్రీనీవాయే శరణ్యమని గుర్తించి చాలా వేగవంతంగా కాలువ పని పూర్తిచేయించారన్నారు. వచ్చే నెల నాటికి గొల్లపల్లి రిజర్వాయర్ వరకు నీరు తీసుకెళ్తామన్నారు. ఇది చారిత్రాత్మక రోజు, చరిత్రలో నిలిచిపోయే రోజన్నారు. మదరాసు రాష్ట్రంలోనే మేముంటామని ప్రత్యేకాంధ్ర ఉద్యమం సందర్భంగా సీమవాసులు తమ వాణి వినిపించగా మేము మీకు శ్రీశైలం నుంచి 100 టిఎంసిలు నీరు ఇస్తాము మనమందరం కలిసే ఉందామని ఆరోజు కోస్తా నేతలు పేర్కొన్నారని ఈరోజు ముఖ్యమంత్రి కోస్తావాసులను తృప్తిపరచడానికి, పట్టిసీమ సీమవాసుల సంతృప్తికి హంద్రీనీవా చేపట్టి కలసాకారం చేశారన్నారు. వైసిపి నేత కోస్తాకు వెళితే మీకు నీరు లేకుండా చంద్రబాబు పన్నాగం పన్నారని వారితో చెబుతున్నారు, ఇక్కడికి వస్తే పట్టిసీమ హంద్రీనీవా అన్ని బూటకపు వాగ్దానాలని సీమ రైతులను మోసం చేస్తున్నాడని దుయ్యబట్టారు. ఇరు ప్రాంతాల ప్రజలను మోసగిస్తూ కాలయాపన చేస్తున్న జగన్‌కు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ ఈరోజు 9 లక్షల రైతు కుటుంబాలకు పర్వదినమని గత 130 ఏళ్లలో మన జిల్లా 70సార్లు కరవు నెదుర్కొందని, గత 18 ఏళ్లలో 14మార్లు కరవు రాజ్యమేలిందని హంద్రీనీవాతో కొంతవరకైనా రైతు ఆనందమయ జీవితం గడుపుతారన్నారు. ప్రపంచ వింతల్లో తాజ్‌మహల్ ఒకవింతైతే, ప్రపంచంలో అతి పెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు హంద్రీనీవాయన్నారు. ఊరందరిది ఒక దారైతే ఉలిపిరి కట్టెది మరో దారని, 13 కేసుల్లో ముద్దాయిగా పేరొందిన జగన్ 16 నెలలు జైలు శిక్ష అనుభవించి వచ్చి ఓటుకు నోటు పేరుతో సిఎం జైలుకెళ్తాతారని పేర్కొనడం రాక్షస కృత్యమన్నారు. ఆయనదొక గురివింద గింజ సామెత నీతియని విమర్శించారు. రెయిన్‌గన్‌ల వల్ల ఇన్‌పుట్ సబ్సిడీకి, ఇన్సూరెన్సు పథకాలకు సంబందం లేదని రైతుల పంటలు రక్షించే ప్రయత్నం రాజకీయం చేయడం జగన్‌కే చెల్లిందన్నారు. మడకశిర వరకు నీరు తెప్పించడానికి వేదిక మీద ఉన్న నేతలంతా చొరవ చూపి అక్కడి రైతులకు ఆనందం కల్గించాలని ఎమ్మెల్సీ గుండుమల, ఎమ్మెల్యే ఈరన్న మంత్రులను, సహచర ప్రజా ప్రతినిధులను కోరారు. ఎంపి నిమ్మల మాట్లాడుతూ కాంగ్రెస్‌వారి అనాలోచిత నిర్ణయాల వల్ల హంద్రీనీవా దశ దిశ మార్చి నిధులు కొల్లగొట్టి రైతులు నిరాశ చెందే విధంగా వ్యవహరించి ఎంతో నష్టం కల్గించారన్నారు. వారికి చిత్తశుద్ధి ఉండి ఉంటే ఎప్పుడో పూర్తి కావలసిన హంద్రీనీవా పూర్తికి 20 ఏళ్లు పట్టిందని అందుకు ముఖ్యమంత్రి కృషే కారణమన్నారు. ఈ కార్యక్రమంలో కళ్యాణదుర్గం, ధర్మవరం ఎమ్మెల్యేలు, కలెక్టర్ కోన శశిధర్ తదితరులు ప్రసంగించారు. హంద్రీనీవా కాంట్రాక్టర్లను, అధికారులను నేతలంతా ప్రశంసలతో మంచెత్తారు. ఈ కార్యక్రమాన్ని చూడడానికి కూడేరు, ఆత్మకూరు మండలాల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చారు.