అనంతపురం

కదిరి ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కదిరి, సెప్టెంబర్ 25: స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసేందుకు వచ్చిన జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డా. రమేష్‌నాథ్‌పై సిపిఐ నాయకులు ఆదివారం ఆసుపత్రి ఎదుట నడి రోడ్డుపై దాడి చేసి చొక్కాను చింపివేశారు. దాడికి నిరసనగా ప్రభుత్వ వైద్యులు విధులు బహిష్కరించగా సిబ్బంది ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. జిల్లా అధికారిపై దాడికి నిరసనగా నేడు డివిజన్ వ్యాప్తంగా వైద్య సేవలు నిలిపివేసి ధర్నా నిర్వహిస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోషియేషన్ (ఐఎంఎ) నాయకులు పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా వున్నా యి... రాష్ట్ర వైద్య విధాన పరిషత్ జాయింట్ కమిషనర్ జయచంద్రారెడ్డి కదిరి ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసేందుకు వస్తుండగా ప్రొటోకాల్ ప్రకారం జిల్లా అధికారి అయిన రమేష్‌నాథ్ కదిరికి వచ్చారు. అయితే అంతకుముందే సిపిఐ నాయకులు ఆసుపత్రిలో వైద్యుల పోస్టులు భర్తీ చేయాలని, రోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి ఆసుపత్రి స్థాయిని పెంచాలని కోరుతూ జాయింట్ కమిషనర్‌ను అడ్డుకునేందుకు ఆసుపత్రి గేటు వద్ద ధర్నా నిర్వహించారు. జా యింట్ కమిషనర్‌కంటే ముందే డిసిహెచ్ ఎస్ కమిషనర్ ఆసుపత్రి వద్దకు రాగానే సిపిఐ నాయకులు వేమయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో కొందరు రమేష్‌నాథ్‌పై దాడి చేసి చొక్కాను చింపివేశారు. వెంటనే విషయం తెలుసుకున్న ఆసుపత్రి సూపరింటెండెంట్ మహబూబ్ బాషా, వైద్యులు మధుసూదన్, మోహన్‌నాయక్, ఐనొద్దీన్, తిప్పేంద్ర నాయక్‌లు రమేష్‌నాథ్‌ను ఆసుపత్రిలోకి తీసుకెళ్లారు. వారితోపాటు సిపిఐ నాయకులు సూపరింటెండెంట్ కార్యాలయంలోకి చేరుకొని రోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను, డెంగ్యూ రోగుల వివరాలను పక్కదోవ పట్టిస్తున్న డిసిహెచ్ ఎస్‌ను సస్పెండ్ చేయాలని బైఠాయించి నిరసన తెలిపారు. విషయాన్ని డిసిహెచ్ ఎస్ కలెక్టర్ కోన శశిధర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే ఆసుపత్రికి వెళ్లి పరిస్థితి సమీక్షించాలని ఆర్డీఓ వెంకటేసును ఆదేశించారు. ఇదే సందర్భంలో ఈ విషయం ఎస్పీ రాజశేఖర్‌బాబు దృష్టికి వెళ్లగా ఆయన సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కదిరి డీఎస్పీ వెంకటరామాంజినేయులును ఆదేశించారు. దీంతో డీఎస్పీ, రూరల్ సీఐ రవికుమార్, ఎస్‌ఐలు రాజేష్, గోపాలుడు, మధుసూదన్‌రెడ్డి, వెంకటప్రసాద్‌లు సిబ్బందితో కలిసి సిపిఐ నాయకులను అరెస్ట్ చేశారు. ఇంతలో అక్కడికి చేరుకున్న జాయింట్ కమిషనర్ జయచంద్రారెడ్డితో ఆర్డీఓ, డీఎస్పీ, ఆసుపత్రి సూపరింటెండెంట్‌లు సమావేశమై సంఘటనపై మాట్లాడారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా, మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌లు అక్కడికి చేరుకొని అధికారులతో చర్చించారు. జరిగిన సంఘటనపై వారు విచారం వ్యక్తం చేస్తూ, దాడి చేసిన వారిపై చర్యలు తీసుకునేలా చూస్తామని, విధులను బహిష్కరించకుండా ప్రజలకు అసౌకర్యం కలగకుండా వైద్య సేవలు అందించాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. అయితే జిల్లా స్థాయి అధికారిపైనే దాడి జరిగితే తమలాంటి వారికి రక్షణ ఎలా అని వారు ప్రశ్నించగా, ప్రస్తుతం జిల్లాలో సీజనల్ వ్యాధులు సోకుతున్నాయని, అవి ప్రబలకుండా ప్రజలకు వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు కోరారు. ఇదే సందర్భంలో శనివారం రాత్రి గాండ్లపెంట మండలంకు చెందిన రాంప్రసాద్ నాయక్ భార్య ప్రసవానికి వచ్చి వైద్యురాలు విజయలక్ష్మి నిర్లక్ష్యం వలన పురిటిలోనే తమ కుమారుడు మృతి చెందాడని, ఆమెపై చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారికి వినతిపత్రం సమర్పించారు. దీంతో ఆందోళనకు గురైన వైద్యురాలు విజయలక్ష్మి గుండెపోటుకు గురైంది. వెంటనే ఆమెను ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు.