అనంతపురం

డిసిహెచ్‌ఎస్‌పై దాడి ఉన్మాద చర్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, సెప్టెంబర్ 25 : కదిరి ప్రభుత్వాస్పత్రిలో డిసిహెచ్‌ఎస్ రమేష్‌నాథ్‌పై సిపిఐ నాయకులు, కార్యకర్తలు దాడి చేయడం ఉన్మాద చర్య అని ఎస్పీ రాజశేఖరబాబు అన్నారు. ఈకేసుపై ఎస్పీ సీరియస్ అయ్యారు. ఇందులో భాగంగా నిందితులపై 9 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి ప్రధాన నిందితుల్లో ఒకరైన వేమయ్యయాదవ్‌తో పాటు ఏడుగురిని అరెస్టు చేసినట్లు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. నిందితులపై హత్యాయత్నం, ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కల్పించడం, దాడి చేయడం, ఎస్సీ, ఎస్టీ చట్టం తదితర అభియోగాలకు సంబంధించిన అండర్ సెక్షన్ 147, 148, 341, 323, 353, 332, 307, 506 ఆర్‌బైడబ్లు, 149 ఐపిసి సెక్షన్లు విధించి కేసులు నమోదు చేశారు. ఏవైనా సమస్యలుంటే శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరసనలు, ఆందోళనలు చేసుకోవాలే తప్ప ప్రజల ప్రాణాలతో చెలగాటమాటడం సరైంది కాదన్నారు. విజ్ఞత కోల్పోయి ఇలాంటి దుశ్చర్యకు పాల్పడటం దారుణమన్నారు. నీతిమాలిన చర్యల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. ప్రధాన నిందితుడు ముబారక్‌పై రౌడీషీట్ తెరుస్తున్నామన్నారు.

80 చెరువుల్లో గ్రాసం పెంపకం
* 4 వేల ఎకరాల్లో జొన్న రకం పెంపకమే పశు సంవర్ధక శాఖ లక్ష్యం

అనంతపురం, సెప్టెంబర్ 25 : రానున్న వేసవిలో పశుగ్రాసం కొరత నివారించేందుకు జిల్లా పశు సంవర్ధక శాఖ చర్యలు ఇప్పటి నుంచే చేపట్టింది. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా చెరువుల్లో గ్రాసం పెంచేందుకు తయారు చేసిన కార్యాచరణ ప్రణాళిక మేరకు 80 చెరువుల్లో గడ్డి విత్తనాలు వేయనున్నారు. ఇందులో భాగంగా జొన్న రకానికి చెందిన సిఎస్‌హెచ్-24 ఎంఎఫ్ రకం విత్తనాలు రైతులకు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి వరకు 200 క్వింటాళ్ల విత్తనం సిద్ధం చేసి నిర్దేశించిన చెరువుల పరిధిలోని పశు సంవర్ధకశాఖ వైద్యశాలకు పంపి నిల్వ ఉంచారు. గతేడాది 700 టన్నుల విత్తనాలు ఇచ్చారు. ఈ ఏడాది కూడా దశలవారీగా పరిస్థితిని బట్టి అవసరమైన మోతాదులో జొన్న రకం విత్తనాన్ని అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా వెయ్యికి పైగానే చెరువులు ఉన్నాయి. వీటిలో 80 దాకా చెరువుల్లో సుమారు 4వేల ఎకరాల విస్తీర్ణంలో జొన్న రకం పశుగ్రాసం పెంచాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే బుక్కరాయసముద్రం మండలం సిద్ధరాంపురం చెరువులో 1000, గుమ్మఘట్టలోని చెరువులో 60 ఎకరాల్లో విత్తనాలు వేశారు. అలాగే మరో మూడు రోజుల్లో 250 ఎకరాల్లో విత్తనాలు వేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కాగా రాయదుర్గం ప్రాంతంలో రెండు, మూడు చెరువుల్లో గ్రాసం పెంపకానికి విత్తనం వేయనున్నార. కొత్తచెరువు-బుక్కపట్నం, ధర్మవరం, బత్తలపల్లి చెరువుల్లో మరో 1000 ఎకరాల విస్తీర్ణంలో పశుగ్రాసాన్ని పెంపకంలో భాగంగా త్వరలో విత్తనాలు వేయడానికి పశు సంవర్థక శాఖాధికారులు సిద్ధం ఉన్నారు. కాగా వర్షం రాక పోవడంతో ఈ చెరువుల్లో గ్రాసం విత్తనం వేయడం ఆలస్యమవుతోంది.
గ్రాసంతో అధిక దిగుబడి..: ఏడి సుబ్రహ్మణ్యం
ఎకరాకు కనీసం 2 టన్నుల ఎండు గ్రాసం, 10 టన్నుల పచ్చగడ్డి (గ్రీన్ ఫాడర్) వచ్చే అవకాశం ఉందని పశు గ్రాస పెంపకం విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఆంధ్రభూమితో మాట్లాడుతూ ఈసారి 80 చెరువుల్లో పశుగ్రాసం 8వేల టన్నులు ఎండు గ్రాసం (డ్రై ఫాడర్), 40వేల టన్నుల దాకా గ్రీన్ ఫాడర్ వచ్చే వీలుందని తెలిపారు. కాగా జొన్న రకం గ్రాసం 60 రోజుల (రెండు నెలలు) వ్యవధిలో కోతకు వస్తుందన్నారు. అక్టోబర్, నవంబరు నెలల్లో గ్రాసం అవసరం ఉంటుందన్నారు. గ్రాసం కోత పడిన తర్వాత వర్షం కురిస్తే రెండో కోత కూడా తీయవచ్చన్నారు. గత రెండేళ్ల క్రితం కదిరి మండలంలోని ముత్యాలచెరువులో రెండు సంవత్సరాల క్రితం గ్రాసం ఆరుసార్లు కోతకు వచ్చిందని గుర్తు చేశారు. కాగా సి ఎస్ హెచ్-24 ఎం ఎఫ్ జొన్న రకం విత్తనాన్ని రైతులకు అందిస్తున్నామన్నారు. దీని ధర కిలో రూ.56 కాగా, 75 శాతం సబ్సిడీ పోనూ రూ.14కే సరఫరా చేస్తున్నామన్నారు. బోర్లు, బావుల కింద పశుగ్రాసం పెంపకం చేపట్టే రైతులకు అవగాహన పెరిగిందని, రైతులకు ఎంత అవసరమైనా విత్తనాలు సరఫరా చేస్తామన్నారు. రైతులు నీటి వనరులున్న చోట్ల పాడి పశువులు, పశు సంపదను కాపాడుకునేందుకు జొన్న రకం గడ్డి విత్తనాలు ఉపయోగించుకోవాలని కోరారు.

భూ లావాదేవీలపై ఐటి శాఖ నిఘా!
* ‘పురం’లో ఎమ్మెల్యే అనుయాయుల ఇళ్లల్లో తనిఖీలు
హిందూపురం, సెప్టెంబర్ 25 : గత కొంతకాలంగా హిందూపురం ప్రాంతంలోని భూములకు రెక్కలు రాగా పోటాపోటీగా వివిధ వర్గాలు కొనుగోలు చేస్తున్నారు. ప్రధానంగా హిందూపురం-గౌరిబిదనూరు, కొడికొండ చెక్‌పోస్టు - అనంతపురం, కొడికొండ చెక్‌పోస్టు-బాగేపల్లి రోడ్డు మార్గాల్లో భూములకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత 44వ నెంబర్ జాతీయ రహదారికి ఇరువైపులా భూ ములు కొనుగోలు చేసేందుకు గుం టూరు, విజయవాడ, కర్నూలు, చి త్తూరు వంటి సుదూర ప్రాంతాలకు చెందిన రియల్టర్లు, రాజకీయ నాయకులు ముందుకొచ్చారు. వీరందరూ బినామీల పేర భూములను కొనుగోలు చేస్తూ ఆదాయపు పన్ను శాఖ కళ్లు గప్పుతున్నారని విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో శనివారం హిందూపురంలోని వివిధ ప్రాంతా ల్లో ఆదాయపు పన్నుల శాఖ అసిస్టెం ట్ కమిషనర్ ఆధ్వర్యంలో ఆకస్మిక దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఇం దులో భాగంగా ఎమ్మెల్యే బాలకృష్ణ కు అత్యంత సన్నిహితులైన ఇరువురి నాయకుల ఇళ్లల్లో సోదాలు చేసినట్లు సమాచారం. కొడికొండ చెక్‌పోస్టు సమీపంలో 25 ఎకరాల విలువైన భూమిని ముగ్గురు టిడిపి నేతలు కొన్ని నెలల క్రితం అగ్రిమెంట్ చేసుకున్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో నియోజకవర్గంలో టిడిపికి కీలకంగా వ్యవహరిస్తున్న ఓ నాయకుడి భార్య పేర, స్థానిక ఓ బాలకృష్ణ వీరాభిమానితోపాటు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పేర ఆ భూములు అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి ఇళ్లపై ఐటి శాఖ అధికారులు తనిఖీలు చేసి విచారించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఇదే తరహాలో హిందూపురం ప్రాంతంలో భూములను కొనుగోలు చేసిన వారి వివరాలను కూడా ఐటి శాఖ ఆరా తీస్తూ లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు చర్చ సాగుతోంది.

శునకానికి సీమంతం!
* కొట్నూరులో కుక్కను బిడ్డలా ఆదరించిన కుటుంబం
హిందూపురం, సెప్టెంబర్ 25 : సాధారణంగా ఆడబిడ్డల పట్ల ఒకింత చిన్న చూపుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఓ ఆడ శునకానికి సీమంతం చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది ఆ కుటుంబం. హిందూపురం రూరల్ పరిధిలోని కొట్నూరుకు చెందిన బేల్దార్ శ్రీనివాసులు, లీలావతమ్మకి ఇద్దరూ మగ పిల్లలే. అయితే తమకు ఆడ బిడ్డ పుట్టాలని ఎంతో ఆశ పెట్టుకోగా వారి కల నెరవేరలేదు. ఈనేపథ్యంలో రెండేళ్ల నుంచి ఆడ శునకాన్ని పెంచుకుంటున్నారు. ఇటీవలే శునకం గర్భం దాల్చింది. విషయం తెలుసుకున్న దంపతులు శునకానికి ఘనంగా సీమంతం నిర్వహించాలని నిర్ణయించి తమ ఇంటి ముందు పందిరి వేయడంతోపాటు మహారాజా కుర్చీలను తెప్పించి అలంకరించారు. అదేవిధంగా శునకాన్ని పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి హారతులు ఇచ్చారు. బంధువులు, పరిసర ప్రాంతవాసులను ఆహ్వానించి భోజన ఏర్పాట్లు చేశారు. అచ్చం నిండు చూలాలకు ఎలా సీమంతం జరిపిస్తారో అదే తరహాలో శునకానికి సీమంతం నిర్వహించారు శ్రీనివాసులు కుటుంబ సభ్యులు. సమాచారం తెలుసుకున్న ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆయా కార్యక్రమాలను తిలకించి సంతోషం వ్యక్తం చేశారు.

సత్యసాయి జయంతి వేడుకలకు
అభివృద్ధి పనులు పూర్తి చేస్తాం
* మంత్రి పల్లె
పుట్టపర్తి, సెప్టెంబర్ 25: నవంబర్ నెలలో జరగనున్న భగవాన్ సత్యసాయిబాబా జయంతి వేడుకలకు అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పుట్టపర్తికి విచ్చేసిన ఆయన మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నవంబర్ 23న జరగబోయే సత్యసాయి జయంతి వేడుకల్లోపు మున్సిపాలిటీ పరిధిలోని అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పుట్టపర్తి మున్సిపాలిటీ కార్యాలయ భవనం నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరైందని మరో రూ.3.5 కోట్లు ప్రతిపాదనలు పంపామన్నారు. అలాగే 11 అంగన్వాడీ కేంద్ర భవనాలకు రూ.75 లక్షలు మంజూరైందన్నారు. రూ.4.90 కోట్లతో నిర్మిస్తున్న అంతర్గత రహదారులు పూర్తి చేస్తామన్నారు. రూ.10 లక్షలతో చేపట్టిన ముస్లిం శ్మశానవాటిక ప్రహరీ గోడను త్వరలో పూర్తిచేస్తామన్నారు. ముస్లిం శ్మశానవాటిక ప్రహరీగోడ వద్ద కొందరు అభ్యంతరం వ్యక్తం చేయగా వారి సమస్యను తీరుస్తామని హామీ ఇచ్చారు. ఆ సమయంలో హరిజన అంజినప్ప తన ఇంటి పక్కన రహదారి వేయరాదని అడ్డుకొని కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. పోలీసులు అడ్డుకొని అతనిని నివారించారు. ఎమ్మార్పీఎస్ నాయకులు బేకరి గంగాధర్, ఓబులేసు, నరసింహులు ఈ సందర్భంగా ప్రతిఘటించారు. న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం 72 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్లకు మంత్రి భూమిపూజ చేశారు. అలాగే పట్టణంలో పారిశుద్ధ్యం మెరుగుకు మున్సిపాలిటీ ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎనుములపల్లి ఎస్సీ కాలనీ, లక్ష్మినరసింహస్వామి దేవాలయం వద్ద అంగన్వాడీ సెంటర్‌కు భూమిపూజ చేశారు. అక్కడ నిర్మించతలపెట్టిన శివాలయాన్ని సందర్శించారు. ఆలయ నిర్మాణానికి సహకారమందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పీసీ గంగన్న, పుడా ఛైర్మన్ కడియాల సుధాకర్, మున్సిపల్ వైస్ ఛైర్మన్ కడియాల రాము, నాయకులు రామాంజనేయులు, గూడూరు ఓబులేసు, మురళి, దామోదర్, బోలాగంగాధర్, కౌన్సిలర్లు సుభాషిణి, లక్ష్మిదేవి, శ్రీరాంనాయక్, నారాయణరెడ్డి, షకీల, ఆసుపత్రి కమిటీ ఛైర్మన్ జయరాంనాయుడు, తదితరులు పాల్గొన్నారు.
ఆర్‌ఎంపి క్లినిక్‌ల
పేరు మార్పునకు కసరత్తు

అనంతపురం, సెప్టెంబర్ 25 : జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల నేపథ్యంలో ఆర్‌ఎంపి క్లినిక్‌లను ప్రథమ చికిత్స కేంద్రాలు (్ఫస్ట్ ఎయిడ్ సెంటర్)గా మార్చుకునేందుకు కసరత్తు మొదలు పెట్టారు. ఈమేరకు సంబంధిత అసోసియేషన్ నాయకులు ఆయా క్లినిక్‌ల ముందు బోర్డులను మార్పు చేసుకునేలా ఆర్‌ఎంపిలను సమాయత్తం చేస్తోంది. అనంతపురంలో డెంగ్యూ కారణంగా ఇద్దరు చిన్నారులు మృతి చెందిన నేపథ్యంలో నగర పాలక సంస్థ, మున్సిపాలిటీల్లోని ఆర్‌ఎంపిల క్లినిక్‌లను మూసివేయించారు. దీంతో ఈనెల 23న జిల్లా ఆర్‌ఎంపిల అసోసియేషన్ జెసి-2 సయ్యద్ ఖాజామొహిద్దీన్, డిఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ వెంకటరమణను కలిసి ప్రజారోగ్య పరిరక్షణలో తాము చేస్తున్న తప్పుల్ని ఒప్పుకుంటూ.. ఇకపై క్లినిక్‌ల ముందు డాక్టర్లు, ఆస్పత్రులు అని బోర్డులు పెట్టుకోబోమని రాతమూలకంగా రాసిచ్చి, ప్రథమ చికిత్స కేంద్రాలుగా నడుపుకోవడానికి అనుమతివ్వాల్సిందిగా విజ్ఞప్తి చేసిన విషయం విధితమే. వారి ఆదేశాల మేరకు ఫస్ట్ ఎయిడ్ సెంటర్లుగా బోర్డులు మార్పు చేసుకుంటున్నారు.
నెట్టికంటి ఆలయంలో విశేష పూజలు
గుంతకల్లు, సెప్టెంబర్ 25 : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో శ్రీరాముల వారి జన్మనక్షత్రం పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని మూలవిరాట్ ఆంజనేయస్వామికి తెల్లవారుజామున సుప్రభాత సేవలో భాగంగా మహాభిషేం, విశేష అలంకారాలు, బంగారు కిరీటధారణ, వజ్రకవచాలంకరణ, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హోమశాలలో స్వామివార్ల ఉత్సవ విగ్రహాలకు అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇఓ ముత్యాలరావు, ఆలయ ఎఇఓ మధు, ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త కుటుంబ సభ్యురాలు సుగుణమ్మ, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

‘ప్యాకేజీ’లో సీమకు అన్యాయం
* సిపిఎం రాష్ట్ర నేత ఓబులు
హిందూపురం, సెప్టెంబర్ 25 : విభజనతో అన్నివిధాలా నష్టపోయిన రాయలసీమకు ప్రత్యేక హోదా ఇవ్వకపోగా ప్రత్యేక ప్యాకేజీలో సైతం తీరని అన్యాయం జరిగిందని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సమితి సభ్యులు ఓబులు అన్నారు. ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల స మావేశంలో ఆయన మాట్లాడుతూ రా యలసీమలోని నాలుగు జిల్లాలతోపా టు ఉత్తరకోస్తా పరిధిలోని మూడు జిల్లాలను వెనుకబడిన ప్రాంతాలుగా గుర్తించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం ప్రత్యేక ప్యాకేజీలో సైతం మోసం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. ప్రత్యేక హోదా కంటే వెయ్యి రెట్లు మేలు చేసే ప్యాకేజీని ఆంధ్రప్రదేశ్‌కు ఇస్తున్నామంటూ మభ్యపెట్టారన్నారు. రూ.1.25 లక్షల కోట్ల నిధులు ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు సమకూర్చామని కేంద్ర మంత్రి చెప్పారన్నారు. అయితే అన్నివిధాలా వెనుకబడ్డ రాయలసీమతోపాటు ఉత్తర కోస్తాలోని మూడు జిల్లాలకు ఏడాదికి రూ.50 కోట్ల నిధులు అభివృద్ధి పనుల కోసం కేటాయిస్తున్నట్లు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కనీసం ఆ నిధులతో తాగునీటి పథకాలకు విద్యుత్ బిల్లులైనా చెల్లించవచ్చా అని ప్రశ్నించారు. అదేవిధంగా సీమకు ముఖ్యమైన హంద్రీనీవా, తెలుగుగంగ, గాలేరు, నగరి వంటి సాగునీటి పథకాలకు నిధుల్లో ప్రాధాన్యత ఇవ్వకుండా మోసం చేస్తున్నారన్నారు. ఇక రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కనీసం పదిమందికి ఉపాధి కల్పించే పరిశ్రమలను స్థాపించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. కరవు కాటకాలతో ఇబ్బంది పడుతున్న అనంతపురం జిల్లాలో కేంద్రీయ విశ్వ విద్యాలయాన్ని నిర్మిస్తామని ప్రకటనలు చేస్తున్నారే తప్ప రెండున్నర సంవత్సరాలైనా ఆ దిశగా చర్యలు లేవన్నారు. జిల్లాలో ఖుదురేముఖ్ ఫ్యాక్టరీని నెలకొల్పుతామని ఇచ్చిన సిఎం భరోసా సైతం పరిమితమైందన్నారు. అలాగే కర్నూలులో రైలు వ్యాగన్ పరిశ్రమను ఏర్పాటు చేస్తామని ప్రకటించి మరిచారన్నారు. హంద్రీనీవాను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. సీమతోపాటు ఉత్తర కోస్తాలోని మూడు జిల్లాలకు జరుగుతున్న అన్యాయంపై వచ్చేనెల 3న ఆయా కలెక్టరేట్‌ల వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసనలు వ్యక్తం చేయనున్నట్లు తెలిపారు. ఈ నిరసనలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, రైతులు తరలివచ్చి మద్దతు పలికాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు శ్రీనివాసులు, చంద్రశేఖర్, రామాంజినేయులు, ప్రవీణ్, రాము తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌కు పూర్వ వైభవం
* కాంగ్రెస్ రాష్ట్ర కిసాన్‌సెల్ ప్రధాన కార్యదర్శి రవీంద్రారెడ్డి
గుంతకల్లు, సెప్టెంబర్ 25 : వచ్చే ఉగాది తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పా ర్టీకి పూర్వవైభవం వస్తుందని ఆ పార్టీ కిసాన్‌సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ర వీంద్రారెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పా టు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేసిన అభివృద్ధి ఇంకా ప్రజల మనసుల్లో ఉందన్నారు. బిజెపి, టిడిపి ప్రభుత్వాలు చేసిన ద గాను ప్రజలు గమనిస్తున్నారని, వారే త్వరలో బుద్ధి చెబుతారన్నారు. ము ఖ్యంగా ఎన్నికల ముందు ప్రత్యేక హోదాతో మభ్య పెట్టి అధికారంలోకి వచ్చి మాట మార్చడం బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్ర తిపక్ష పార్టీలతోపాటు ప్రజలను ప్ర త్యేక హోదాపై దృష్టి మళ్లించి రాజధా ని నిర్మాణం పేర రూ.కోట్ల అవినీతికి పాల్పడుతున్నారన్నారు. మోసం చే యడంలో ఆయనకు మించిన వారు లేరన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టి గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోటా సత్యం మాట్లాడుతూ గత పదేళ్ల క్రితం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తలపెట్టిన విధంగా పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో మహోత్తరమైన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. జాతీయ నాయకులు రాహుల్‌గాందీ సైతం రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే జిల్లాకు మూడుమార్లు వచ్చారన్నారు. పార్టీ అ భివృద్ధికి కార్యకర్తలు సైనికుల్లా పని చే యాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో గుంతకల్లు కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ప్రభాకర్, బిసి సెల్ రాష్ట్ర కార్యదర్శి గాలి మల్లికార్జున, జిల్లా కార్యదర్శి సూర్యనారాయణ, హనుమంతు, ఉరవకొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వశికేరి రమేష్ పాల్గొన్నారు.