అనంతపురం

నగర పంచాయతీ కార్యాలయాన్ని స్థానికంగానే నిర్మించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామిడి, సెప్టెంబర్ 27: నగర పంచాయతీ కార్యాలయాన్ని స్థానికంగానే నిర్మించి పందుల తరలింపును వెంటనే చేపడుతూ ప్రజారోగ్యాలను కాపాడాలంటూ నవ్యాంధ్ర పరిరక్షణ సమితి అధ్యక్షులు కట్లపొడి రామాంజనేయులు గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌కు విన్నవించారు. సోమవారం పందుల స్వైర విహారం-పట్టించుకోని అధికారులు మంగళవారం స్థానిక సంస్థల కార్యాలయాలు స్థానికంగానే ఉండాలంటూ 3ఆంద్రభూమి2లో ప్రచురితమైన క్లిప్పింగ్‌లతో నవ్యాంధ్ర పరిరక్షణ సమితి అధ్యక్షులు రామాంజనేయులు కట్లపొడి రామాంజనేయులు మంగళవారం హోమియో మందుల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌కు విన్నవించారు. స్పందించిన ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ పట్టణ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని కార్యాలయాలను పట్టణం బయట నిర్మిస్తే ఆదాయ మార్గాలు సుగమం అవుతాయని చెప్పటంతో కట్లపొడి కలుగుజేసుకుని నగర పంచాయతీ కార్యాలయం ప్రజలకు అందుబాటులో ఉంటేనే బాగుంటుందని, పట్టణానికి దూరంగా జాతీయ రహదారి పక్కన నిర్మిస్తే ప్రజల ప్రాణాలకు ముప్పు సంభవించే ప్రమాదముందని తెలియజేస్తూ నగర పంచాయతీ కార్యాలయం నూతన భవనం నిర్మించటంలో కొందరి స్వార్థపూరిత ఆలోచనల కారణంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి నష్టం వాటిళ్లుతుందని తెలిపారు. కాగా అక్కడే ఉన్నటువంటి ఎస్‌ఐ రవిశంకర్‌రెడ్డిని పిలిచి నగర పంచాయతీ, రెవెన్యూ అధికారులను సంప్రదించి పందుల తరలింపునకు చర్యలు చేపట్టాలని సూచించారు.