అనంతపురం

స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వర్గపోరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురంటౌన్, సెప్టెంబర్ 27: కార్పొరేషన్‌లో బుధవారం జరుగనున్న స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పాలక వర్గంలోని ఇరు వర్గాలు గెలుపుతో 3పైచేయి2 సాధించాలని పోరు సాగిస్తున్నారు. గత ఏడాది ఎం.పి, ఎమ్మెల్యే వర్గాలుగా విడిపోయి హోరాహోరీ పోరాటం సాగించారు. ఈసారి మాత్రం మేయర్, డిప్యూటీ మేయర్ ప్యానల్స్‌గా ఏర్పడి కమిటీ ఎన్నికల్లో పోటీకి నిలబడటంతో పాలక వర్గంలోని పోరు పతాక స్థాయికి చేరినట్లైంది. జిల్లా ముఖ్య ప్రజా ప్రతినిధుల విబేధాల కారణంగా ఒక్కటిగా ఉన్న పాలకవర్గం తాజాగా మేయర్, డిప్యూటీ మేయర్ వర్గాలుగా చీలిపోయింది. దీనితో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఇరు వర్గాలుగా చీలిపోయి కమిటీ ఎన్నికలలో పట్టు సాధించటానికి ఢీ అంటే ఢీ అనే స్థాయిలో ఉండటం పార్టీ శ్రేణులలో చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా మేయర్, డిప్యూటీ మేయర్ల నడుమ సఖ్యత కొరవడి ఎడమొహం పెడమొహంగా ఉన్నారన్న చర్చ కొనసాగుతోంది. ఈ చర్చలకు బలం చేకూరేలా తాజా స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరుగుతున్నాయి. కమిటీ ఎన్నికలలో 11 మంది కార్పొరేటర్లు పోటీ చేస్తున్నారు. వీరిలో మేయర్ ప్యానల్‌గా సరళ, లోక్‌నాథ్, రాజారావు, రంగాచారి, లక్ష్మీరంగమ్మలు కాగా డిప్యూటీ మేయర్ ప్యానల్‌గా నటేష్‌చౌదరి, లక్ష్మిరెడ్డి, విజయశ్రీ, శ్రీనివాసులు, హేమలతలు ఉన్నట్లు ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. జె.సి వర్గీయునిగా ముద్రపడిన 29వ డివిజన్ తెదేపా కార్పొరేటర్ ఉమామహేష్ పోటీ చేస్తున్నారు. ఐదు స్థానాలకు 11 మంది పోటీ చేస్తుండటంతో గెలుపు కోసం అభ్యర్థులు కార్పొరేటర్ల ఇళ్ల వద్దకు వెళ్ళి వారిని ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అధికార తెలుగుదేశం పార్టీకి 32 మంది బలం ఉంది. 11 మంది వైకాపా కార్పొరేటర్లు మిగతా ఆరుమందిలో ఒక్కొక్కరు సిపిఎం, సిపిఐ కాగా మిగతా నలుగురు అధికార పార్టీకి మద్దతుదారులుగా ఉన్నారు. అయితే గత ఏడాది ఎన్నికల్లో 3బోగస్2 ఓట్ల కలకలం రేగింది. జె.సి వర్గీయులు ఈ అంశంపై పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఓట్ల పోలింగ్ నుంచి లెక్కింపు వరకు హైడ్రామా నడచింది. పోలీసుల జోక్యంతో అతి కష్టంపై ఎం.పి వర్గీయులకు నచ్చచెప్పి వివాదానికి తెరదించారు. దీనిని దృష్టిలో ఉంచుకుని డిప్యూటీ మేయర్ ప్యానల్‌కు చెందిన కార్పొరేటర్ నటేష్‌చౌదరి మంగళవారం కమిషనర్ ఓబులేశును కలిసి గత ఏడాది ఎన్నికలలో మాదిరిగా బోగస్ ఓట్లు పోలింగ్ కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని కోరుతూ లేఖ అందచేశారు. గత ఏడాది ఓటుహక్కు వినియోగించుకునే రబ్బరు స్టాంపుల మార్పిడి అంశాన్ని గుర్తుచేశారు. ఈ సంఘటనలు పునరావృతం కాకుండా స్టాండింగ్ కమిటీ ఎన్నికలు పారదర్శకంగా సాగించటం అధికార యంత్రాంగానికి సవాలుగా మారింది.