అనంతపురం

ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, అక్టోబర్ 21 : రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రులను అన్నివిధాలా అభివృద్ధి చేసి కార్పొరేట్ తరహాలో వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం స్థానిక పట్టణంలోని జిల్లాస్థాయి ప్రభుత్వాసుపత్రిలో డ యాలసిస్ సెంటర్, అన్నా క్యాంటిన్, మినరల్ వాటర్ ప్లాంట్లను పరిటాల సునీతతోపాటు ఎంపి నిమ్మల కిష్టప్ప, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, రాష్ట్ర బిసి కార్పొరేషన్ చైర్మన్ పామిశెట్టి రంగనాయకులు, కలెక్టర్ కోన శశిధర్‌తో కలిసి ప్రారంభించారు. అనంత రం ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ జెఇ వెంకటస్వామి అధ్యక్షతన జరిగిన బహిరంగ సమావేశంలో మం త్రి కామినేని మాట్లాడుతూ ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా సాధారణ, మధ్య తరగతి కుటుంబాలు అనారోగ్యానికి గురైతే ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లకుండా ప్రభుత్వాసుపత్రుల్లోనే వీలైనంత మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కొత్తగా అర్బన్ హెల్త్ సెంటర్లను అన్ని హంగులతో ఏర్పాటు చేసి కార్పొరేట్ ఆసుపత్రి తరహాలో ఎయిర్ కండీషన్ గదుల్లో ఉచితంగా 24 రకాల వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందచేస్తామన్నారు. ఇందులో అనంతపురం జిల్లాకే 19 అర్బన్ హెల్త్ సెంటర్లు, హిందూపురానికి నాలుగు మంజూరైనట్లు తెలిపారు. దీనికితోడు ప్రభుత్వాసుపత్రిలో పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు తీసుకుంటామన్నారు. జనన ధ్రువీకరణ పత్రంతోపాటు బాలింతలకు రూ.1000 నగదు, ఎన్టీఆర్ సురక్ష కిట్‌లను పంపిణీ చేస్తున్నామన్నారు. రాష్టవ్య్రాప్తంగా ఖాళీగా ఉన్న వైద్యులు, నర్సులు, సిబ్బంది పోస్టులను త్వరితగతిన భర్తీ చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. కాగా ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మంచి పనులు చేయదలిస్తే ప్రతిపక్ష పార్టీలు అనవసరంగా కోర్టులకు వెళ్తూ ఇబ్బందులు పెడుతున్నాయన్నారు. వెనుకబడిన అనంతపురం జిల్లాకు హంద్రీనీవా సుజల స్రవంతి పథకం ఓ వరం లాంటిందన్నారు. గోదావరి, కృష్ణా జలాలను అనంతపురంకు తరలించి సస్యశ్యామలం చేస్తామన్నారు. మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ హిందూపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం నందమూరి బాలకృష్ణ ఎంతో చొరవ చూపిస్తున్నారని అభినందించారు. ఎన్టీఆర్ కుటుంబం పేద సంక్షేమానికి అనాదిగా కృషి చేస్తోందన్నారు. హిందూపురంలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు ద్వారా సాధారణ రోగులకు ఎంతో ఊరట కలుగుతుందన్నారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ‘వైద్యో నారాయణో హరి’ అన్న సూక్తికి అనుగుణంగా వైద్యులు, సిబ్బంది ప్రజలకు సేవ చేయాలని సూచించారు. ప్రభుత్వాసుపత్రులపై ప్రజల్లో నమ్మకం కలిగే విధంగా వైద్య సేవలు అందివ్వాలని, ఈదిశగా హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో చర్యలు కొనసాగుతుండటం అభినందనీయమన్నారు. హిందూపురం కర్నాటకు సరిహద్దులో ఉన్న నేపథ్యంలో బెంగళూరులో రామయ్య కార్పొరేట్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు వర్తించేలా ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు అటు రామయ్య చర్చిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే సానుకూల ఫలితం వస్తుందన్నారు. విద్య, వైద్య, వ్యవసాయ విషయాల్లో ప్రభుత్వం అన్నివిధాలా దృష్టి పెడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ రావిళ్ల లక్ష్మి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కేశవులు, ఆర్‌ఎంఓ డాక్టర్ రుక్మిణమ్మ, కమిటీ సభ్యులు బండారు బాలాజీ, సుశీలమ్మ తదితరులు పాల్గొన్నారు.