అనంతపురం

బుల్లెట్ నడిపిన బాలయ్య..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, అక్టోబర్ 22 : స్థానిక ఆటోనగర్ నుంచి మండల పరిధిలోని కిరికెర బసవనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వరకూ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శనివారం బుల్లెట్‌ను నడిపి అటు అభిమానులు, ఇటు కార్యకర్తలను ఉత్సాహ పరిచారు. లేపాక్షి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా కొడికొండ చెక్‌పోస్టు నుంచి లేపాక్షి వరకూ దాదాపు 15 కిలోమీటర్ల మేర సైకిల్ తొక్కుతూ విన్యాసాలు చేసిన బాలయ్య తాజాగా కిరికెర సర్పంచు, బాలకృష్ణ వీరాభిమాని హెచ్‌ఎన్ రాము ఆధ్వర్యంలో ఆటోనగర్ నుంచి బసవనపల్లి ఉన్నత పాఠశాల వరకూ చేపట్టిన ద్విచక్ర వాహన ర్యాలీలో పాల్గొన్నారు. ప్రత్యేకంగా బుల్లెట్‌ను హెచ్‌ఎన్ రాము ఏర్పాటు చేయగా బాలయ్య స్వయంగా నడిపారు. పోలీసులు వారించినా అభిమానుల కోరిక మేరకు బుల్లెట్ నడుపుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న బాలయ్య
రెండు రోజుల పర్యటనలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శనివారం వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా స్థానిక పాండురంగనగర్‌లో రూ.23 లక్షలతో అభివృద్ధి పరచిన ఎన్టీఆర్ మున్సిపల్ ఉద్యానవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ రావిళ్ల లక్ష్మి, వైస్ చైర్మన్ జెపికె రాము, కౌన్సిలర్ శశికళ, టిడిపి నేతలు గ్రీన్‌పార్క్ నాగరాజు, జయసింహ తదితరులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం నూతనంగా పార్కులో ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహానికి బాలకృష్ణ క్షీరాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దీనికి తోడు ఉద్యానవనంలో కలియ తిరిగి టిడిపి నేత నాగరాజుతో అక్కడ జరుగుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక నేతాజీ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో నిర్మించిన అదనపు తరగతి గదులను ఎమ్మెల్యే ప్రారంభించారు. దీనికి తోడు పరిగి రోడ్డులో మినీ లారీ అసోసియేషన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం జరగాల్సిన అధికారుల సమీక్షా సమావేశాన్ని పర్యటన ఆలస్యం కావడంతో రద్దు చేసుకుని తిరుగు పయనమయ్యారు. ఈ కార్యక్రమాల్లో బిసి కార్పొరేషన్ చైర్మన్ పామిశెట్టి రంగనాయకులు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ గౌస్‌మోహిద్దీన్, మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్, ప్రభుత్వాసుపత్రి కమిటీ చైర్మన్ జెఇ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా కల్యాణ రథం ఊరేగింపు
గుంతకల్లురూరల్, అక్టోబర్ 22 : శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్ల కల్యాణ రథాన్ని శనివారం సాయంత్రం పట్టణంలోని మార్కెట్ యార్డు నుంచి శ్రీశైల జగద్గురు సూర్యసింహాసన ఉపపీఠం వరకూ మేళతాళాలు, భాజభజంత్రీల నడుమ అంగరంగ వైభవంగా ఊరేగించారు. ఆదివారం స్థానిక పాత గుంతకల్లులోని శ్రీశైల జగద్గురు సూర్యసింహాసన ఉపపీఠంలో జరగనున్న శ్రీశైల భమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్ల కల్యాణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా స్వామివార్ల ఉత్సవ విగ్రహాలను కొలువదీర్చిన కల్యాణ రథాన్ని మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో కలశాలు, హారతులతో శనివారం ఊరేగించారు. లోక కల్యాణార్థమై నిర్వహిస్తున్న స్వామివార్ల కల్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని మఠంలో శనివారం ఉదయం నుంచి శ్రీశైల జగద్గురు డాక్టర్ చెన్న సిద్దరామ పండితారాద్య శివాచార్య మహాస్వాములు ఇష్టలింగపూజ, ప్రత్యేక పూజలు చేశారు.