అనంతపురం

మందకొడిగా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, అక్టోబర్ 28 : పశ్చిమ రాయలసీమలోని అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల పట్ట్భద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదు వేగవంతం కానుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటరు నమోదు ప్రక్రియ ఈనెల 1 నుంచి షెడ్యూల్ ప్రారంభమై నవంబర్ 5వ తేదీ ముగియనుంది. దీంతో ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకోని వారు ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు ముందుకు వస్తుండటంతో ఓటర్ల సంఖ్య పెరగనుంది. కాగా ఉపాధ్యాయ ఓటర్ల నమోదు మందకొడిగా సాగుతోంది. అధికారిక గణాంకాల మేరకు ఇప్పటి వరకు గ్రాడ్యుయేట్ ఓటర్లు (్ఫరం-18) 30,079, ఉపాధ్యాయ ఓటర్లు (్ఫరం-19) 543 మంది ఓటు హక్కు కోసం పేర్లు నమోదు చేసున్నారు. ఇందులో కడప జిల్లాలో అత్యధికంగా పట్ట్భద్రులు, ఉపాధ్యాయ ఓటర్లు తమపేర్లు నమోదు చేసుకున్నారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో నమోదైన ఓటర్లతో పోలిస్తే ఈసారి సంఖ్య పెరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. వీరిలో మూడు జిల్లాల్లోనూ పట్ట్భద్రులైన ఓటర్ల సంఖ్య అధికంగా ఉండబోతోంది. జిల్లాల వారీగా చూస్తే పట్ట్భద్రులు అనంతపురంలో 9,643, కడపలో 12,267, కర్నూలులో 8,169 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఉపాధ్యాయులు అనంతపురం జిల్లాలో 121, కడపలో 290, కర్నూలులో 132 మంది చొప్పున ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. 31 అక్టోబర్ 2013 నాటికి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు వెంటనే ఫారం-18ను పూరించి సంబంధిత తహశీల్దార్, ఎంపిడిఓ, ఎంఇఓ, మున్సిపల్ కమిషనర్, రెవెన్యూ డివిజనల్ అధికారులను తమ డిగ్రీ సర్ట్ఫికెట్లను అటెస్ట్ చేసి, నివాస ధ్రువీకరణపత్రం, సర్టిపికెట్స్ జత పరిచి అందజేయాల్సి ఉంది. ఆన్‌లైన్ ద్వారా (సిఇఒఎఎన్‌డిహెచ్‌ఆర్‌ఎ.ఎన్‌ఐసి.ఐఎన్) కూడా నమోదు చేసుకోవచ్చని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కోన శశిధర్, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, అనంతపురం డిఆర్‌ఓ సి.మల్లీశ్వరిదేవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫారం-18, 19ను ఆయా కార్యాలయాల్లో అందుబాటులో ఉంచామన్నారు.