అనంతపురం

సిఎం గారూ.. హామీల అమలేదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, డిసెంబర్ 1 : ముఖ్యమ ంత్రి అయిన తర్వాత 15 సార్లు జిల్లా ప ర్యటనకు వచ్చన చంద్రబాబు ఇచ్చిన హా మీలు అమలుకు నోచుకోలేదన్న విమర్శ లు వెల్లవెత్తుతున్నాయి. జిల్లా అంటే తనకె ంతో ప్రేమ ఉందని, నీరు అందించి సస్యశ్యామలం చేసి, సమగ్రాభివృద్ధికి కృషి చే స్తానని చంద్రబాబు పదేపదే చెప్పడమే తప్ప చేసింది శూన్యమనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని, లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని, నైపుణ్యం ఉన్న, నైపుణ్యం లేని, పూ ర్తి స్థాయి నైపుణ్యం లేని యువతకు ఉ ద్యోగావకాశాలు కల్పిస్తామని జిల్లా పర్యటనకు వచ్చిన ప్రతిసారీ చెబుతూనే ఉన్నా రు. మరోవైపు జిల్లామంత్రులు, ప్రజాప్రతినిధులు సైతం రైతు సంక్షేమం, ఉపాధి కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ప్రతి సమావేశంలోనూ వెల్లడిస్తున్నారు. అయితే ఆచరణలో అమలు చేయడంతో జాప్యం చోటుచేసుకుంటోంది. దీంతో ఎప్పుడెప్పుడు అవకాశాలు కల్పిస్తారా? అంటూ ఆశగా ఎదురు చూడటం జిల్లావాసుల వంతైంది. ముఖ్యంగా ఈఏడాది ఖరీఫ్‌లో రైతులు వేరుశెనగ పంటను పూర్తిగా నష్టపోయారు. ఈ రబీ సీజన్‌లో కూడా వర్షాలు లేకపోవడంతో పంటల్ని కోల్పోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఇటు హంద్రీనీవా ద్వారాగానీ, అటు తుంగభద్ర జలాశయం నుంచి గానీ వ్యవసాయానికి నీరు అందడం లేదు. నీటి కోసం స్థానికంగా యుద్ధాలు చేసే పరిస్థితి ఏర్పడింది. ఇక హంద్రీనీవా సుజల స్రవంతి పథకం ద్వారా రాయలసీమలో మొత్తం 6.25 లక్షల ఎకరాలకు సాగు నీరివ్వాలన్నది లక్ష్యం. అలాగే జిల్లాలో3.45 లక్షల ఎకరాలను నీరివ్వాలని నిర్దేశించారు. అయితే కాలువ వెడల్పు చేయాల్సిన అవసరం ఉండటంతోపాటు రెండో దశలో 29 టిఎంసిల నీటిని సరఫరా చేయాల్సిన అవసరం ఉంది. అయితే ప్రస్తుతం కాలువ ద్వారా నీటిని సరఫరా చేస్తూ కుంటలు, చెరువులకు నీటిని నింపుతున్నా, ఆయకట్టుకు నీటి సరఫరా లేకుండా పోయింది. ప్రభుత్వం డిస్ట్రిబ్యూటరీల పనులు చేయడానికి అనుమతి ఇవ్వకపోవడంతో సాగునీరు ప్రశ్నార్థకంగా మారింది. కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం మల్లాల నుంచి ప్రారంభమైన హంద్రీనీవా కాలువ జిల్లాలోని జీడిపల్లి వరకూ తొలిదశను పూర్తి చేసుకుంది. తద్వారా ఇప్పటి వరకూ సుమారు 11.50 టిఎంసిల నీటిని తరలించి తాగునీటి అవసరాలను సరఫరా చేశారు. జీడిపల్లి నుంచి గొల్లపల్లి వరకూ నీటిని తిరిగి తరలించారు. ఇక్కడి నుంచి ఈనీటిని చిత్తూరు జిల్లా కుప్పం వరకూ తీసుకెళ్లడం ప్రభుత్వ లక్ష్యం. ఈ నేపథ్యంలో ఆయకట్టుకు నీటి విడుదల వచ్చే ఖరీఫ్ నాటికైనా అందుతుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే జిల్లాలో అనేక మంది రైతులు హంద్రీనీవా నీటి కోసం ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. ఇక పారిశ్రామికంగా చూస్తే బెల్ (్భరత్ ఎలక్ట్రికల్ లిమిడెట్) పరిశ్రమ ప్రకటనలకే పరిమితమైంది. కుద్రేముఖ్ పేరుతో ఏర్పాటు చేయనున్న ఇనుప పిల్లెట్స్ పరిశ్రమ ఊసే లేదు. హిందూపురంలో కేన్సర్ ఆస్పత్రిని నిర్మిస్తామన్న హామీ ఆచరణకు నోచుకోవాల్సి ఉంది. జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా మారుస్తామన్న సిఎం హామీకి ఇప్పటి వరకు సరైన రూపకల్పన జరగలేదు. తుంగభద్ర జలాశయం నుంచి నీటిని తరలించేందుకు ఉద్దేశించిన హెచ్చెల్సీని ఆధునికీకరించాల్సి ఉంది. కర్ణాటక సరిహద్దు నుంచి జిల్లాకు వచ్చే హెచ్చెల్సీ కాలువను కూడా వెడల్పు చేయాల్సి ఉంది. పనులు మొదలైనా వేగంగా కొనసాగడం లేదు. ఇంకా ఉద్యానవన కేంద్రం ఏర్పాటు, సెంట్రల్ వర్సిటీల ఊసే లేకుండా పోయింది. ఇక అనంతపురాన్ని స్మార్ట్‌సిటీగా మార్చాలన్న హామీ ఎప్పుడు రూపుదాల్చుతుందో ప్రశ్నార్థకమే. ఇంకా పుట్టపర్తిలో విమానాల నిర్వహణ, మరమ్మతుల కేంద్రం ఏర్పాటూ అంతే... రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ పూర్తి స్థాయిలో అందలేదు. గత నవంబర్‌లో వర్షాల కారణంగా పంటలు తీవ్రంగా నష్టపోయిన రైతులకు పరిహారం ఎప్పుడిస్తారో తెలియడం లేదు. కనీసం ఈసారి పర్యటనలోనైనా హామీలు అమలుకు నోచుకుంటాయా? అని జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు.

తప్పని నిరీక్షణ!
* పింఛన్ల సొమ్ము ఖాతాల్లో జమ
* బ్యాంకులు, ఎటిఎంల వద్ద వృద్ధుల పడిగాపులు

అనంతపురం, డిసెంబర్ 1 : పెద్ద నోట్ల రద్దు కష్టాలు జిల్లాలో కొనసాగుతూనే ఉన్నాయి. ఒకటో తారీఖు కావడంతో గురువారం బ్యాంకులు, ఎటిఎంల వద్ద క్యూలు దర్శనమిచ్చాయి. ఓవైపు సామాజిక పింఛన్లు సైతం బ్యాంకుల్లో జమ చేయడంతోపాటు ఉద్యోగులకు రూ.10వేలు చొప్పున నగదు ఇచ్చేందుకు ప్రభుత్వం అనుమతించడంతో ఎటిఎంలు, బ్యాంకులు జనంతో ఉదయం నుంచే కిక్కిరిసిపోయాయి. నగరంలోని సాయినగర్ మెయిన్ బ్రాంచిలో ఉదయం జనం డబ్బు డ్రా చేసుకునేందుకు క్యూ కట్టారు. పింఛనర్లు సైతం రావడంతో సకాలంలో డబ్బు ఖాతాల్లో పడక మధ్యాహ్నం 12 గంటల వరకు వేచి ఉన్నారు. తర్వాత దశలవారీగా నగదు జమకావడంతో పింఛనర్లకు డబ్బులు అందాయి. అలాగే రూ.24 వేలు అవసరమైన వారికి అందజేశారు. కానీ రూ.500 కొత్త నోట్లు మాత్రం బ్యాంకుకు చేరకపోవడంతో రూ.2వేలు నోట్లనే వినియోగదారులకు అందించారు. కాగా జిల్లాలోని ఎస్‌బిఐకి చెందిన మొత్త0 12 కరెన్సీ చెస్ట్‌లలో గురువారం వరకూ రూ.21 కోట్ల మేర నగదు అందజేసినట్లు ఎజిఎం ఎం.శ్రీనివాస్ తెలిపారు. ఫిక్స్‌డ్ డిపాజిట్స్‌కు యథావిధిగా నగదు అందిస్తున్నామన్నారు. కాగా చిన్న నోట్ల కొరత ప్రతి బ్యాంకులోనూ కనిపిస్తోంది. రూ.100, రూ.50, రూ.20, రూ.10 డినామినేషన్లలో నగదు బ్యాంకర్లు ఆశించినంత మేర చలామణి కావడం లేదు. ముఖ్యంగా కొత్త రూ.2వేల నోట్లను వినియోగదారులు బ్యాంకుల్లో తిరిగి డిపాజిట్లు చేస్తున్నా, రోజువారీ లావాదేవీలకు నగదు ఇచ్చిపుచ్చుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతున్న దృష్ట్యా అనేక మంది వ్యాపారులు, వాణిజ్య సంస్థల వారు చిన్న నోట్లను తమ వద్దే ఉంచుకుంటున్నారు. దీంతో ఆశించిన మేర చిన్ననోట్లు జమ కావడం లేదని బ్యాంకర్లు అంటున్నారు. ఇక గురువారం సైతం పలు బ్యాంకుల్లో చెక్కులు, విత్‌డ్రాయల్స్ చేసుకునే వారికి రూ.6వేల నుంచి రూ.10 వేల వరకూ మాత్రమే అందజేశారు. దీంతో జనం ఇబ్బంది పడక తప్పలేదు. నేడు కూడా ఉద్యోగులకు రూ.10వేలు నగదు అందించనున్నందున వీరితోపాటు పింఛనుదారులు సైతం క్యూలు కట్టనున్నారు. బ్యాంకు అకౌంట్లు లేని పింఛనుదారులు కొందరు పలు బ్యాంకుల వద్ద అధికారులతో వాగ్వాదానికి దిగారు. నగదు చెల్లింపులకే బ్యాంకుల సిబ్బంది సరిపోతుండటంతో కొత్త అకౌంట్లు ప్రారంభించేందుకు ఎవరూ సహకారం ఇవ్వక పోవడంతో ఖాతాల ప్రారంభించలేక ఇబ్బందుల పాలతువున్నారు. ఇక పాత రూ.500 నోట్లు ఈనెలాఖరు వరకు డిపాజిట్ల రూపంలో తీసుకుంటారని బ్యాంకర్లు చెబుతున్నారు. నేటి రాత్రి వరకే పెట్రోలు బంకుల్లో ఈ నోట్లు చలామణికి ఆర్‌బిఐ అనుమతించింది.

కల్లుమర్రిలో సెజ్,
పరిగిలో ఇండస్ట్రియల్ పార్క్
* మంత్రి మండలి సమావేశంలో ఆమోదం

అనంతపురం, డిసెంబర్ 1 : జిల్లాలో పారిశ్రామిక ప్రగతికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈమేరకు గురువారం రాజధాని అమరావతిలో నిర్వహించిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో పారిశ్రమల ఏర్పాటుకు ఆమోదం లభించింది. వీటిలో మడకశిర మండలం కల్లుమర్రి గ్రామంలో ఇండస్ట్రియల్ పార్న్, బహుళ ఉత్పత్తుల పారిశ్రామిక వాడ (సెజ్) ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం గ్రామంలోని సర్వే నంబర్ 447-2 తదితరాల్లోని 23.11 ఎకరాల భూమిని ఎపిఐఐసి (ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్)కి బదలాయిస్తూ మంత్రి మండలి ఆమోదించింది. ఈక్రమంలో ఈఏడాది ఏప్రిల్ 19న రెవెన్యూ శాఖ జారీ చేసిన జిఓ ఎంఎస్ 155 ప్రకారం ఎకరా భూమి రూ.65 వేల చొప్పున కేటాయిస్తారు. అలాగే పరిగి మండల కేంద్రంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. అక్కడి సర్వే నంబర్ 451-1 ఎలోని 44.05 ఎకరాల భూమిని సెజ్ ఏర్పాటు కోసం ఎపిఐఐసికి బదలాయించారు. ఇక్కడ ఎకరా రూ.3 లక్షల చొప్పున భూమిని కేటాయిస్తారు. ఇక మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్‌పర్సన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్ల గౌరవ వేతనం, ఇర భత్యాల పెంపునకు రాష్టమ్రంత్రి మండలి నిర్ణయం తీసుకోవడం పట్ల సంబంధిత ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

ఉపాధి కల్పన ఎక్కడ ’బాబూ‘!
* శిలాఫలకానికే పరిమితమైన రాగ మయూరి
* ప్రకటనలకే పరిమితమైన పరిశ్రమల ఏర్పాటు
హిందూపురం, డిసెంబర్ 1 : వెనుకబడిన జిల్లాలో పెద్దఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేసి వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన భరోసా ప్రకటనలకే పరిమితమైందని విమర్శలు వినిపిస్తున్నాయి. పెనుకొండ నియోజకవర్గం పరిధిలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్), సెంట్రల్ ఎక్సైజ్ అకాడమీ సంస్థల ఏర్పాటుకు పెద్ద ఎత్తున బహిరంగ సభలను నిర్వహించి ముఖ్యమంత్రితోపాటు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. అయితే ఇప్పటికీ ఆయా సంస్థల ఏర్పాటుపై ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న’ చందంగా తయారైంది. ఇందులో బెల్ సంస్థకు సంబంధించి దాదాపు రూ.20 కోట్లతో ప్రహరీ నిర్మాణానికి ప్రస్తుతం పనులు సాగుతున్నాయి. సెంట్రల్ ఎక్సైజ్ అకాడమీకి సంబంధించి ఇప్పటికీ ఆ సంస్థకు కేటాయించిన భూముల్లో ఎటువంటి పనులు సాగడం లేదు. ఇకపోతే ఈ ఏడాది ఏప్రిల్ 21వ తేదీన హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరుం మండలం కొడికొండ చెక్‌పోస్టు సమీపంలో 44వ జాతీయ రహదారి ప్రక్కనే 50 ఎకరాల్లో రాగమయూరి ఇండస్ట్రీయల్ పార్క్ పేర సిఎం చంద్రబాబు భూమిపూజ చేశారు. అయితే ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థకు సంబంధించి స్పష్టమైన ఒప్పందాలు లేకపోగా హడావుడిగా శంకుస్థాపన చేశారన్న అభిప్రాయాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుండి ఆ సంస్థకు ఎలాంటి సహకారం లేకపోవడంతో రద్దు చేసుకున్నట్లు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వం తరహాలోనే ప్రస్తుత ప్రభుత్వం కూడా పరిశ్రమల ఏర్పాటులో ఉదాసీనతగా వ్యవహరిస్తున్నట్లు స్థానిక నిరుద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వం లేపాక్షి నాలెడ్జ్ హబ్ సిటీ సంస్థకు 8448 ఎకరాల భూమిని జాతీయ రహదారికి ఇరువైపులా కేటాయించగా అప్పట్లో ఒక్క పరిశ్రమ ఏర్పాటుకు నోచుకోలేదు. అయితే ఆ భూముల పేర సంబంధిత సంస్థ బ్యాంకుల్లో కోట్లాది రూపాయల రుణాలు తీసుకుని చేతులు దులుపుకోగా దానిపై విచారణ సాగించి ఆ భూముల్లో అటు రైతాంగానికి ఇటు నిరుద్యోగులకు న్యాయం చేసే విధంగా చర్యలు గైకొంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొనగా ఇప్పటికీ ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఇకపోతే హిందూపురం తూమకుంట పారిశ్రామిక వాడలో సంతూర్ సబ్బుల తయారీ సంస్థను నెలకొల్పనున్నట్లు ఆ సంస్థ ఎండి అజీం ప్రేమ్‌జీ ప్రకటించగా అది కూడా చిత్తూరు జిల్లాకు తరలిపోయింది. కనీసం భూమిపూజ చేసిన బెల్, సెంట్రల్ ఎక్సైజ్ అకాడమీ, రాగమయూరి సంస్థల ఏర్పాటులో కూడా ఎలాంటి పురోగతి కనిపించకపోవడం పట్ల స్థానిక నిరుద్యోగుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా స్థానికంగా ఎలాంటి పరిశ్రమల్లో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో చదువుకున్న నిరుద్యోగులు పొట్టకూటి కోసం అరకొర వేతనాలతో బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు తరలిపోతున్నారు. వౌలిక సదుపాయాల కల్పనకు కూడా ప్రభుత్వం నుండి అవసరమైన మేరకు సహకారం లభించకపోవడం, అందుకు అవసరమైన వనరులు ప్రభుత్వానికి లేకపోవడంతో పరిశ్రమల ఏర్పాటుపై ఎలాంటి పురోగతి లేదన్న అభిప్రాయాలు వివిధ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
పింఛన్ల పంపిణీలో గందరగోళం!
* ఖాతాల్లో జమపై ఆందోళన
అనంతపురంటౌన్, డిసెంబర్ 1 : సామాజిక పింఛన్ల మొత్తాన్ని బ్యాంకు ఖాతాల్లోకి జమచేయడం గందరగోళంగా మారింది. నగదురహిత లావాదేవీల పేర పింఛన్లు పొందే వృద్ధులు, వికలాంగులు, వితంతువుల బ్యాంకు అకౌంట్ల ఖాతాలకు జమ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల క్రితం ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే మూడు నెలల క్రితమే పెన్షన్‌దారుల నుంచి బ్యాంక్ అకౌంట్లు, ఆధార్‌కార్డు వివరాలను సేకరించారు. నగరంలో 20473 మంది సాంఘిక భద్రత పెన్షన్‌దదారులు ఉన్నారు. వీరిలో 12653 అకౌంట్లు మాత్రమే ఆన్‌లైన్‌లో నమోదు అయ్యాయి. అకౌంట్లు ఉండి ఆధార్ లింక్ లేనివి 5650 ఉన్నాయి. బ్యాంక్ ఖాతాలు లేనివారు 2170 మంది ఉన్నారు. అయితే ఆన్‌లైన్‌లో అకౌంట్లు నమోదైనప్పటికీ అధికశాతం మంది ఖాతాలకు పెన్షన్ మొత్తం జమ చేసినట్లు మెసేజ్‌లు రాకపోవటంతో పెన్షన్‌దారులను ఆందోళనకు గురి చేస్తోంది. కొంతమందికి బుధవారం మధ్యాహ్నం నుంచే ఖాతాల్లో పింఛన్ల మొత్తాన్ని జమ చేసినట్లుగా మెసేజ్‌లు అందటం ప్రారంభమైంది. గురువారంనాటికి రూ.20కోట్లు ఖాతాల్లోకి జమ చేశామని, మిగతావి ఖాతాలు ఆన్‌లైన్ వెంటనే జమ చేస్తామని గురువారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో డిఆర్‌డిఎ పిడి వెంకటేశ్వరు అన్నారు. అయితే ఆన్‌లైన్ వివరాలు పరిశీలించిన వారి ఖాతాలకు సొమ్ము జమ చేసినట్లు సమాచారం వస్తున్నా ఆచరణలో పెన్షన్‌దారులకు మెసేజ్‌లు రాకపోవటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. మరోవైపు దీనిపై సరైన సమాచారం ఇచ్చేవారు కరవు అవడంతో పెన్షన్‌దారుల్లో గందరగోళం, ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదేమని అడిగితే అటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికారులు కొత్తలో కొంత కష్టమైనా తర్వాత అంతా సర్దుకుంటుందని చెప్పి పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది పెన్షన్‌దారులు బ్యాంకులు, ఎటిఎంల వద్ద క్యూల్లో నిలబడి అలసట, నిస్సత్తువ కారణంగా వెనుతిరగటం కనిపించింది. గతంలో మాదిరిగా చేతికి సొమ్ము అందించకుండా తమను ముప్పుతిప్పలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకుల వద్ద సొమ్ము ఎలా తెచ్చుకోవాలో అర్థం కావటం లేదని వాపోతున్నారు. ఇలాగే పరిస్థితి కొనసాగితే అధికశాతం మంది పెన్షన్ కోల్పోయే ప్రమాదం ఉందని అంటున్నారు. దీనికితోడు రెండువేల రూపాయల నోట్లు మాత్రమే అందుబాటులో ఉండటంతో వృద్ధులకు వెయ్యి, వికలాంగులకు 1500 రూపాయలు ఇప్పట్లో అందే అవకాశాలు అంతంత మాత్రమేనని పెదవి విరుస్తున్నారు. ఈ పరిస్థితిని ఎలా అధిగమించాలో తెలియక అటు బ్యాంకులు ఇటు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దీంతో పెన్షన్ల సొమ్ము బ్యాంకు అకౌంట్లకు జమ కావటంతో వృద్ధులు, వికలాంగులకు, వితంతువులకు కొత్త సమస్యలను తెచ్చిపెట్టినట్లైంది. చిన్ననోట్లు అందుబాటులోకి వస్తేకాని ఇప్పట్లో పెన్షన్‌దారులకు సాంఘిక భద్రత పెన్షన్లు అందే అవకాశాలు తక్కువేనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

ఆటో, ట్రాక్టర్ ఢీ.. ఒకని మృతి
మడకశిర, డిసెంబర్ 1 : మండల పరిధిలోని గుర్రపుకొండ క్రాస్ వద్ద గురువారం ఆటో, ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో శివన్న (50) అనే వ్యక్తి మృతి చెందాడు. మధుగిరి తాలూకా కదిరేపల్లికి చెందిన శివన్న తన భార్య జయమ్మ తదితరులు ఆటోలో శంకరగల్లు నుండి మడకశిరకు వస్తుండగా మార్గమధ్యలో గుర్రపుకొండ క్రాస్ వద్ద ట్రాక్టర్ ఢీకొనడంతో శివన్న అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో జయమ్మ, లక్ష్మిదేవి, పార్వతమ్మ, రంగనాథ్ మరో ఆరుగురు గాయాలకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
గోరంట్ల, డిసెంబర్ 1: మండల పరిధిలోని పాలసముద్రం వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు ఎఎస్సై ఆంజనేయులు తెలిపారు. చిలమత్తూరు మండలం బంద్రేపల్లికి చెందిన సుబ్బిరెడ్డి (58), భార్య ఈశ్వరమ్మ (50)తో కలసి ద్విచక్ర వాహనంలో హిందూపురం నుండి బంద్రేపల్లికి వెళుతూ జాతీయ రహదారిపై రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో సుబ్బిరెడ్డి మృతి చెందినట్లు చెప్పారు. తీవ్రంగా గాయపడిన ఈశ్వరమ్మను హిందూపురం తరలించినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
మహిళ ఆత్మహత్య
బొమ్మనహాల్, డిసెంబర్ 1 : మండల పరిధిలోని ఉద్దేహాల్ గ్రామంలో బోయ ఎర్రమ్మ (40) గురువారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎఎస్‌ఐ బషీర్ ఖాన్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు ఎర్రమ్మ అనారోగ్యంతో బాధపడుతూ మందుల కోసం చిల్లర దొరక్క మానసికంగా కృంగిపోయింది. రెండురోజులుగా చుట్టు పక్కల వారిని అప్పు అడిగి చాలీచాలని మందులు కొనేది. దీంతో జీవితంపై విరక్తి చెందినట్లు తెలిపారు. మృతురాలి కుమారుడు వన్నూర్‌స్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించినట్లు తెలిపారు.
43 కిలోల గంజాయి పట్టివేత.. ఐదుగురి అరెస్టు
పుట్టపర్తి, డిసెంబర్ 1 : అక్రమంగా తరలిస్తున్న 43 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతోపాటు ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు సిఐ శ్రీ్ధర్, ఎస్సై రాఘవరెడ్డి తెలిపారు. గురువారం పుట్టపర్తి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లా నుంచి 43 కిలోల గంజాయిని ప్రశాంతి నిలయం రైల్వేస్టేషన్‌కు తరలిస్తూ బుధవారం పోలీసులకు పట్టుబడినట్లు తెలిపారు. ముందస్తు అందిన సమాచారం మేరకు కొన్నాళ్లుగా మాటువేసి గంజాయి తరలిస్తున్న వారిని అరెస్టు చేసినట్లు తెలిపారు. పుట్టపర్తి మండలం వీరచిన్నయ్యపల్లికి చెందిన జయమ్మ, నల్లమాడకు చెందిన లక్ష్మీదేవి, శకుంతలమ్మ, బుక్కపట్నం మండలం గసికవారిపల్లికి చెందిన అశ్వని, సుంకమ్మ, పీట్ల రాజును అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరు గత కొంతకాలంగా పోలీసుల కళ్లుగప్పి గంజాయి వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. సుమారు రూ.1.30లక్షల విలువజేసే గంజాయి మూటలతో నిందితులు పట్టుబడినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితులను కోర్టుకు తరలిస్తున్నట్లు తెలిపారు.