అనంతపురం

రెండవ రోజూ డబ్బుల్లేవు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం అర్బన్, నవంబర్ 2:శ్రమజీవులకు వేతనాల తిప్పలు రెండవరోజు తప్పలేదు. వేతనంతో కుటుంబాలను నెట్టుకొచ్చే ఉద్యోగులు గత నెలలో నగదు సమస్య నుంచి బయట పడ్డవారు. ఈనెల 8న ప్రధాని మోదీ పెద్దనోట్ల రద్దుతో డిశంబర్ 1న వేతనాలు అందకపోవడంతో ఇంటి అద్దెలు, పాలు, పిల్లల స్కూల్ ఫీజులు తదితర వాటికి సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగదు సమస్యలేదని అధికారులు కొందరు పేర్కొంటుండగా అమలులోకి వచ్చేసరికి తీవ్ర ఇబ్బందులను ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగులకు పదివేల అందజేస్తామన్న ప్రభుత్వం చివరికి ఆ పదివేలు సైతం అందించలేక చేతులు ఎత్తేసింది. ఇక పింఛన్‌దారులది అదే పరిస్థితు వీరి అకౌంట్లు ఖాళీ చూపిస్తున్నాయి. శుక్రవారం రెండవరోజు సైతం బ్యాంకుల్లో నగదు కొరత తీవ్రంగా నెలకొంది, డిపాజిట్లపై ఆధారపడ్డ అధికారులు కొద్దిమందికి అందజేసి నో క్యాస్ బోర్డులు పెట్టారు. ఇక ఎటియమ్‌లు కేవలం ఐదే శాతం మాత్రమే పనిచేశాయి. నగరంలో పరిస్థితి ఇలా వుంటే గ్రామీణ ప్రాంతల్లోని బ్యాంకు ల్లో పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యింది. ఎన్‌టి ఆర్ భరోసా పింఛన్లలో చిత్ర విచిత్రాలు నమోదు అవుతున్నాయి. అధికారులు ఇప్పటికే సంబంధిత బ్యాంకులకు సరిపడ నగదును జమచేశామని చెపుతున్నప్పటికి ఇదికూడ అమలు వైఫల్యం కనిసిస్తుంది. శనివారం రోజుకు జిల్లాకు నగదు వచ్చే అవకాశం ఉందని ఓ బ్యాంక్ అధికారి పేర్కొన్నారు. వుద్యోగులతో పాటు సామాన్యజనానికి ఉరట కలగనుందని ఆయన తెలిపారు.

ఆర్థిక లోటు ఉన్నా ఆగని సంక్షేమ పథకాలు
* మంత్రులు పల్లె రఘునాథ్‌రెడ్డి, పరిటాల సునీత
పెనుకొండ, డిసెంబర్ 2 : రాష్ట్ర విభజన అనంతరం తీవ్ర ఆర్థిక లోటు ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఏమాత్రం ఆగలేదని మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని గొల్లపల్లి వద్ద నిర్మించిన రిజర్వాయర్ ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ రూ.6 వేల కోట్ల ఆర్థిక లోటు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక సంక్షమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. గొల్లపల్లి రిజర్వాయర్‌కు రూ. 1000 కోట్లు ఖర్చు చేసి రెండో దశ ప నులు పూర్తి చేసి నీళ్లు తీసుకురావడం గర్వకారణమన్నారు. రైతులు, డ్వాక్రా రుణాల మాఫీ, వృద్ధులకు రూ.1000 పెన్షన్లు వంటి సంక్షేమ పథకాలు నిరంతరంగా కొనసాగుతున్నాయన్నారు. మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ జిల్లాను కరవు నుంచి ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎనలేని కృ షి చేస్తున్నారన్నారు. అందుకు జిల్లా ప్రజలు రుణపడి ఉండాలన్నారు. హం ద్రీనీవా పనులను కాంగ్రెస్ లాభాపేక్ష తో చేయగా టిడిపి అధికారంలోకి వ చ్చాక రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ఎంపి నిమ్మల కిష్టప్ప మాట్లాడుతూ టిడిపి పాలనలోనే అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో మరిన్ని నిధులు ఖర్చు చేసి అభివృద్ధి పరచనున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ టిడిపి వ్యవస్థాపకులు ఎన్టీఆర్ కన్న కలలు ప్రస్తుతం నిజం కావడం సంతోకరమన్నారు. ఆనాడు ఎన్టీఆర్ గాలేరు, నగరి, తెలుగుగంగ, హంద్రీనీవా ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టగా ముఖ్యమంత్రి చంద్రబాబు దశలవారీగా పూర్తి చేస్తుండటం గర్వకారణమన్నారు. జిల్లాకు నీటి ప్రాజెక్టులే ఆధారమన్నారు. హిందూపురానికి పైపులైన్ ద్వారా తాగునీటిని అందించాలని కోరారు. ఎమ్మెల్యే బికె పార్థసారథి మాట్లాడుతూ నియోజకవర్గానికి బిసి, ఎస్సీ మోడల్ స్కూళ్లు మంజూరు చేయాలని, రిజర్వాయర్ నుండి పైపులైన్ ద్వారా గోరంట్ల, పరిగి మండలాలకు తాగునీటిని అందించాలని సిఎంను కోరారు.