అనంతపురం

సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాప్తాడు, డిసెంబర్ 3: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు అవగాహన కల్పించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. శనివారం నియోజకవర్గ కేంద్రంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో శ్రీనివాసులు ఆధ్వర్యంలో నియోజకవర్గస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులకు నగదు రహిత లావాదేవీలపై శిక్షణ, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సునీత హాజరయ్యారు. ముందుగా బ్యాంకు మేనేజర్లు నగదు రహిత లావాదేవీలపై రూపే, డెబిట్ కార్డులు, ఇంటర్‌నెట్ బ్యాంకింగ్, ఎంవ్యాలెట్లను ఎలా ఉపయోగించాలి అని ప్రజాప్రతినిధులు, అధికారులకు వివరించారు. అనంతరం మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం కారణంగా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు కొంతవరకు ఇబ్బందులుపడుతున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నగదురహిత లావాదేవీలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతాలు తెరిచి రూపే, డెబిట్ కార్డులు పొందాలని దాని ద్వారా మొబైల్ బ్యాంకింగ్ కూడా అలవాటు చేసుకోవాలని, బ్యాంక్ అకౌంట్‌కు మొబైల్ నెంబర్, ఆధార్ నెంబరును అనుసంధానం చేసుకొని నగదురహిత లావాదేవీలు నిర్వహించాలని తెలిపారు. అలాగే కుటుంబంలో ఇంటర్నెట్ సదుపాయం గల స్మార్ట్ఫోన్లను ఉపయోగించడం అలవాటు చేసుకోవాలన్నారు. ఇప్పటికే ఇంటర్, డిగ్రీ, బీటెక్ చదివే విద్యార్థులు ఎక్కువగా ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. ఈ నెల ప్రభుత్వ రేషన్‌షాపుల్లో అరువుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని, జనవరి నెల నుండి వేలిముద్రల ద్వారా బ్యాంక్ అకౌంట్ నుండి నగదు బదిలీ చేసి సరుకులు పొందవచ్చన్నారు. ఇందుపై ఎలాంటి అవకతవకలు జరగకుండా మండలస్థాయి అధికారులు పర్యవేక్షించాలని పేర్కొన్నారు. ఈ నగదురహిత లావాదేవీలపై మండలస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, బ్యాంక్ సిబ్బంది గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో బాలానాయక్, వైస్ ఎంపీపీ పరంధామ, స్పెషలాఫీసర్ గంగన్న, సర్పంచి వెంకటరాముడు, తహసీల్దార్ నాగభూషణం, నియోజకవర్గంలోని అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, బ్యాంక్ మేనేజర్లు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

అవినీతి లేని సమాజాన్ని ఆవిష్కరిద్దాం
* ఎసిబి డిఎస్పీ భాస్కర్‌రెడ్డి
అనంతపురం అర్బన్, డిసెంబర్ 3: దేశంలో అవినీతి అధికారుల భరతం పట్టి ప్రజలకు స్వచ్ఛమైన పాలన అందించడంలో ఎసిబి పాత్ర ఎంతో వుందని, అవినీతిని ప్రత్యక్షంగానో, పరోక్షంగానే ప్రోత్సహించే వారిపై కఠిన చట్టాలు అమలులో వున్నాయని వీటిని ప్రయోగించటం జరుగుతుందని ఎసిబి డిఎస్పీ భాస్కర్‌రెడ్డి తెలిపారు. శనివారం అవినీతి వారోత్సవాల్లో భాగంగా ఎసిబి కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది డిసెంబర్ 3న అవినీతి వారోత్సవాలు నిర్వహించటం జరుగుతుందన్నారు. వారోత్సవాల్లో భాగంగా అవినీతికి పాల్పడే అధికారులకు శిక్షలు, ఎసీబీ చట్టాలు, సమాచార సేకరణ, నిఘా వ్యవస్థలాంటి పలు విషయాలు ఆయన పంచుకున్నారు. వారోత్సవాల్లో అవినీతి లేని సమాజాన్ని నిర్మించడానికి ప్రజలను చైతన్యం చేయడం చాలా ప్రధాన విషయంగా తెలిపారు. వారంపాటు ఎసిబి ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలను ఆయన వివరించారు. ఈ నెల 4న అన్ని కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థులకు అవినీతి అరికట్టడానికి తమ సిబ్బంది ఆధ్వర్యంలో అవగాహన కల్పించడం, 5న నగరంతోపాటు పట్టణాల్లో రద్దీ ప్రాంతాల్లో సమావేశాలు, 6న నగరంలో కళాశాల, పాఠశాలల్లో ఇంగ్లీషు, తెలుగు మీడియం విద్యార్థులకు వేరువేరుగా వ్యాసరచన పోటీలు నిర్వహించటం జరుగుతుందన్నారు. ఇందులో తెలుగు మీడియం విద్యార్థులకు అవినీతి సమాజంపై దాని ప్రభావం అన్న అంశంపై వుంటుందన్నారు. ఇంగ్లీషు మీడియం విద్యార్థులకు సమాజంలో అవినీతి వల్ల ఎదురయ్యే దుష్ప్రభావాలు అన్న అంశంపై వుంటుందన్నారు. 7, 8న ఇదే రీతిన సామాజిక సంస్థలు, అవినీతికి వ్యతిరేకంగా పోరాడే వారితో కలిసి పలు సమావేశాలు, 9న చివరి రోజున ఉదయం 11 గంటలకు అంబేద్కర్ భవన్ నుంచి సప్తగిరి సర్కిల్, టవర్‌క్లాక్ మీదుగా ఆర్ట్స్ కాలేజీ ఆడిటోరియం వరకు ర్యాలీ చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం ఆడిటోరియంలో పలువురు మేధావులతో అవినీతి వ్యతిరేక ఉపన్యాసాలు వుంటాయన్నారు. అదేరోజున కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కోన శశిధర్‌ను కలిసి ప్రతి ఉద్యోగికి లైట్ బ్లూ కలర్ రిబ్బన్ చేతికి కట్టడం జరుగుతుందన్నారు. వ్యాసరచన పోటీల్లో ఉత్తమ ప్రతిభకనపరిచిన ముగ్గురికి బహుమతులతోపాటు షీల్డ్‌లు, సర్ట్ఫికెట్లు అందిస్తామన్నారు. సమావేశంలో ఎసీబీ సిఐ ఖాదర్‌బాషా హాజరయ్యారు.
దివ్యాంగులకు చేయూతనివ్వాలి : మంత్రి సునీత
రాప్తాడు, డిసెంబర్ 3: దివ్యాంగులకు ప్రతి ఒక్కరూ చేయూతనందించి వారు అన్ని రంగాల్లో రాణించేలా కృషి చేయాలని మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. శనివారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో వికలాంగ విద్యార్థులకు రొలేటర్ పంపిణీ కార్యక్రమాన్ని ఎంఈవో మల్లికార్జున ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి పరిటాల సునీత హాజరయ్యారు. ఈ సందర్భంగా ముందుగా మంత్రి సునీత వికలాంగ విద్యార్థులచే కేక్ కట్ చేయించి విద్యార్థులకు అందించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మేనరిక వివాహాలు, పౌష్టికాహారలోపంతోనే వికలాంగులుగా మారుతారని, తల్లిదండ్రులు వికలాంగుల విద్యార్థులను ప్రేమానురాగాలతో చూసుకోవాలని, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపి వారి అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. ఈ కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. వికలాంగుల పింఛన్లు ప్రతి ఒక్కరికి మంజూరవుతున్నాయా లేదా అని తెలుసుకున్నారు. ఇంకా వికలాంగ పెన్షన్లు మంజూరు కాని వారు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. అన్ని రంగాల్లో వికలాంగులు రాణించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకొని వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపాలన్నారు. అనంతరం విద్యార్థులకు రొలేటర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచి వెంకటరాముడు, మండల ఉపాధ్యక్షుడు గవ్వలపరంధామ, ఎంపీడీవో శ్రీనివాసులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
అధైర్యపడవద్దు.. ఆదుకుంటాం..: మంత్రి పల్లె
నల్లమాడ, డిసెంబర్ 3: పంటల్లో నష్టపోయిన రైతన్నలను ఆదుకోవాలన్న సంకల్పంతో జిల్లాలోని రైతన్నలకు హెక్టారుకు రూ. 15వేలు పంట నష్టపరిహారం అందజేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదించారని ఐటీ శాఖామాత్యులు పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. శనివారం మంత్రి నల్లమాడ మండలంలోని చారుపల్లి, పోలంవాండ్లపల్లి, మీసాలవాండ్లపల్లి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అనంతపురం జిల్లా అంటే ఎనలేని అభిమానం వుందన్నారు. ఖరీఫ్‌లో వరణుడి కరుణ లేక జిల్లా రైతులు సాగు చేసిన పంటల్లో తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం జిల్లాలో వున్న కరవును దృష్టిలో పెట్టుకుని జిల్లావాసుల్ని అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకోనుందన్నారు. అదేవిధంగా పంట నష్టపరిహారం అందుతుందో లేదోనన్న అనుమానంతో రైతన్నలున్నారన్నారు. ఏ విధంగానైనా రైతన్నలను ఆదుకుంటామని, పంట నష్టపరిహారం ఖచ్చితంగా అందజేస్తామని భరోసా ఇచ్చా రు. పింఛన్లు అందనివారు దిగులు చెందొద్దని జనవరి నుంచి ప్రతి అర్హుడికీ పింఛన్ అందేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఒక్కరూ నగదురహిత కార్యకలాపాలను అలవాటు చేసుకోవాలన్నారు. మీసాలవాండ్లపల్లిలో గ్రామ మైనార్టీలు మంత్రిని అడగ్గానే వెంటనే పీర్లచావిడికి నిధులు మంజూరు చేస్తానని అదేవిధంగా మసీదుకు ప్రహరీ గోడను నిర్మింపచేయడానికి మంత్రి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం పోలంవాండ్లపల్లి ఎస్సీ కాలనీ, బడవాండ్లపల్లి, రెడ్డివారిపల్లి, చారుపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకటేశులు, తహశీల్దార్ నాగరాజు, ఎంపీడీవో రాబర్ట్ విల్సన్, సిఐ శివరాముడు, ఎస్సై గోపి, ఆరై శ్రీధర్, ఏపీవో రఘునాథరెడ్డి, ఎపీయం వీరనారాయణ, ఏఈవో శిరీష, కార్యదర్శి శంకర్‌నాయుడు, నాయకులు అన్నం లక్ష్మినారాయణ, మధుసూధన్‌రెడ్డి, ప్రసాద్‌రెడ్డి, జయ రాం, గడ్డం రమణారెడ్డి, నరసింహు లు, రమణ, సురేష్, చంద్రశేఖర్‌రెడ్డి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
వైభవంగా పల్లకిసేవ
ఉరవకొండ, డిసెంబర్ 3 : పెన్నోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం అత్యంత వైభవంగా పల్లకిసేవ నిర్వహించారు. తెల్లవారు జామున సుప్రభాత సేవలో భాగంగా స్వామివారికి అభిషేకం, వివిధ పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం స్వామివారికి పూజలు నిర్వహించారు. భూదేవి, శ్రీదేవి సమేతుడైన నరసింహస్వామి ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలు, వివిధ పుష్పాలతో అలంకరించారు. అనంతరం ప్రత్యేకంగా తయారు చేసిన పల్లకిలో స్వామివారికి కొలువుదీర్చి ఆలయ ప్రాంగణంలో స్వామివారిని భాజాభజంత్రీల నడుమ ఊరేగించారు. ఉత్సవాన్ని తిలకించడానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు ద్వారకనాథాచార్యులు, ఆలయ ఇఓ రమేష్‌బాబు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వందశాతం నగదు రహిత లావాదేవీలే లక్ష్యం
* రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్
అనంతపురం సిటీ, డిసెంబర్ 3: పెద్ద నోట్లు రద్దు నేపథ్యంలో ప్రజలకు, వ్యాపారులకు ఇబ్బ ంది కలగకుండా ఉండేం దు కోసం వంద శాతం నగదు రహిత లావాదేవీలే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ ప్రి న్సిపల్ సెక్రటరీ, జిల్లా స్పెషల్ ఆఫీసర్ ఆదిత్యనాథ్ దాస్ పేర్కొన్నారు.
విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి కృషి
* మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి
అనంతపురం సిటీ, డిసెంబర్ 3: విభిన్న ప్రతిభావంతులకు సాంకేతిక రంగంలో అర్థమయ్యే రీతిలో ఐటి శాఖ ద్వారా శిక్షణను ఇప్పించి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తామని, అలాగే వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పౌర సంబంధాలు సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం జెడ్పి సమావేశంలో 57 అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులను ఆదుకునేందుకు మెరుగైన విద్యనందించేందుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఉపకార వేతనాలు, బోధనా రుసుములను అందజేస్తోందన్నారు. విభిన్న ప్రతిభావాంతులకు తమ ప్రభుత్వం పెన్షన్‌ను అందిస్తోందన్నారు. శారీరకంగా వారికి వికలాంగత్వం వుండవచ్చునే కాని మేథా సంపత్తిలోను విభిన్న ప్రతిభావంతులకు, వృద్ధులకు, అత్యంత ప్రాధాన్యతనిస్తూ వారి పనులను అందరికన్నా ముందుగా పరిష్కరించాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ ఇప్పించి నగదు రహిత లావాదేవీలను అలవర్చేందుకు మొబైల్ , ఆన్‌లైన్ ఆపరేషన్స్‌ను నేర్పిస్తామన్నారు. బ్లైండ్ హోం నిర్మించుకునేందుకు 50 సెంట్ల భూమిని కేటాయించాలన్న వారి విజ్ఞప్తికి మంత్రి స్పందిస్తూ వారికి అనుకూలమైన ప్రాంతంలో భవన నిర్మాణానికై 50 సెంట్లు భూమిని కేటాయిస్తామని, ఇందుకు అవసరమైన ప్రభుత్వ భూమిని పరిశీలించాలని స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరితో అన్నారు. బ్రైలీ లిపి లైబ్రరీని ఏర్పాటుచేస్తామన్నారు. 17 బ్యాక్‌లాగ్ వేకన్సీలను భర్తీ చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. పెళ్లి చేసుకునేందుకు ఆర్థిక ఇబ్బందులు, వివక్షకు గురికాకూడదన్న సదుద్దేశ్యంతో సకలాంగులు విభిన్న ప్రతిభావాంతులను వివాహం చేసుకుంటే ఆ జంటకు లక్ష రూపాయలు ప్రభుత్వం మంజూరు చేస్తున్నదన్నారు. అనంతరం అనంత అర్బన్ ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి మాట్లాడుతూ సకలాంగులకంటే విభిన్న ప్రతిభావంతులలో అత్యంత ప్రతిభ వుంటుందన్నారు. బ్రైయిలీ లిపి ద్వారా వారు అత్యంత వేగంగా చదువుగలుగుతున్నారంటే వారికి భగవంతుడు కల్పించిన ప్రతిభ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కోన శశిధర్ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులకు విరామం పథకం ద్వారా గత సంవత్సరం 7,030 మందికి బీమాను చేయించి దేశంలోనే మన జిల్లా అగ్రగామిగా నిలిచిందన్నారు. జెడ్పి ఛైర్మెన్ చమన్‌సాబ్ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులు అన్ని రంగాల్లో ముందంజలో ఉంటున్నారని, అలాగే ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని మరింత అభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు. అంతకుముందు విభిన్న ప్రతిభావంతులు స్థానిక కెఎస్‌ఆర్ ఉన్నత పాఠశాల నుండి జెడ్పి హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ మదమంచి స్వరూప, జెసి-2 సయ్యద్ ఖాజామొహిద్దీన్, విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు రవీంద్రరెడ్డి, ఏడి తిమ్మప్ప, డిఎఫ్‌ఓ చంద్రశేఖర్, అధికారులు, విభిన్న ప్రతిభావంతులు తదితరులు పాల్గొన్నారు.
పంటలకు నీరందించేందుకు
నిద్రలేని రాత్రులు గడిపా...
* చీఫ్‌విప్ కాలవ శ్రీనివాసులు
బొమ్మనహాల్, డిసెంబర్ 3 : హెచ్చెల్సీ ఆయకట్టు కింద భూములకు సాగునీరు అందించాలని ఎన్నో నిద్రలేని రా త్రులు గడిపానని ఎమ్మెల్యే, చీఫ్‌విప్ కాలవ శ్రీనివాసులు అన్నారు. శనివారం మండల పరిధిలోని గొనేహాల్ గ్రామం వద్ద 200 ఎకరాల వరి మాగాణికి వంకనీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా గొనేహాల్ సర్పంచు శివశంకర్‌రెడ్డి గృహంలో ఏర్పా టు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మా ట్లాడుతూ తుంగభద్ర జలాశయంలో నీటి మట్టం లేనికారణంగా దాదాపు 34వేల ఎకరాల్లో పంట లు సాగు చేసిన రైతుల పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించానన్నారు. ఇందుకు ఆ యన స్పందించి జల్లాకు అందిస్తున్న సాగునీటిని కృష్ణజలాలను హెచ్‌ఎల్‌సి ఆయకట్టుకు విడుదల చేసి వినియోగించుకోవాలని సూచించారన్నారు. ఈమేరకు నీటి పారుదల శాఖ మంత్రి నుంచి అధికారులకు ఆదేశాలు జారీ చేశారన్నారు. ఈవిధంగా రాష్ట్ర, జిల్లా అధికారులను ఒప్పించడానికి శక్తి వంచలేకుండా కృషి చేశామన్నారు. కణేకల్లు, బొమ్మనహాల్ మండల పరిధిలోని 34వేల ఎకరాలకు సాగునీరు అందించి రైతులను కాపాడగలిగామన్నారు. రైతుల నుంచి వచ్చిన ఒత్తిడిల మేర కు 7 గంటలున్న విద్యుత్‌ను 12 గంటలకు పొడిగించి పంటలు ఎండిపోకుండా బోరు నీరు అంది ంచుకునేలా సౌకర్యం కల్పించామన్నారు. ఈ కా ర్యక్రమంలో మండల కన్వీనర్ చలపతి, జడ్పీటీసీ వాణీజగన్నాథ్‌రెడ్డి, సాగునీటి సంఘం అధ్యక్షుడు కేశవరెడ్డి, సల్లాపురం బాబు, మండలంలోని ఎంపిటిసిలు, సర్పంచులు, జన్మభూమి కమిటీ సభ్యులు, సింగిల్ విండో అధ్యక్షుడు మల్లికార్జున, కణేకల్లు, బొమ్మనహాల్ రైతులు పాల్గొన్నారు.