అనంతపురం

నేతల కనుసన్నల్లోనే ‘పిఎబిఆర్’కు తూట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురంటౌన్, ఏప్రిల్ 12: పిఎబిఆర్ తాగునీటి పైపులైను పథకం ఉన్నా అనంత నగర ప్రజలకు తాగునీటి ఇక్కట్లు తప్పటం లేదు. అప్పుడు ఇప్పుడు నేతల కనుసన్నలలోనే పిఎబిఆర్ పైపులైను పథకానికి తూట్లు పొడిచి గ్రామ పంచాయతీలకు అక్రమంగా తాగునీటి కనెక్షన్లను ఇప్పించారని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. పిఎబిఆర్ తాగునీటి పథకంపై అనధికార కనెక్షన్ల ప్రభావంతో నగరంలోని ట్యాంకులు నిండని పరిస్థితి నెలకొంది. సోమనాథనగర్, ఐటిఐ ట్యాంక్, లక్ష్మీనగర్, పాతవూరు ట్యాంకు తదితర ప్రాంతాల్లోని ట్యాంకులకు వచ్చే నీటి వత్తిడి తగ్గటంతో సకాలంలో ట్యాంకులు నిండని పరిస్థితి ఏర్పడటం అధికారవర్గాలను కలవరపరుస్తున్నాయి. ఒకవైపు ఎండలు తీవ్రమవుతుండటం మరోవైపు ట్యాంకులు సకాలంలో నిండకపోవటంతో వివిధ ప్రాంతాలకు అరకొరగా తాగునీటిని సరఫరా చేయాల్సి వస్తోందని సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళారు. అనధికార కనెక్షన్లతో పైపులైనులో నీటి వత్తిడి తగ్గిపోయి దిగువ ప్రాంతాల్లోని ట్యాంకులు నిండటం గగనంగా మారిందని వారికి విన్నవించటంతో పరిస్థితిని చక్కదిద్దటం ఎలాగో అర్థం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగితే నగరంలో తొలిసారిగా తాగునీటి ఎద్దడిని ఎదుర్కొనాల్సి వస్తుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఐదు రోజుల క్రితం కల్యాణదుర్గం బైపాస్ రోడ్డు దాటిన తర్వాత పిఎబిఆర్ మెయిన్ పైపులైను నుంచి పాపంపేట, వడ్డెకాలనీ తదితర గ్రామ పంచాయతీలోని ప్రాంతాలకు తాగునీటి కనెక్షన్‌ను రాత్రికి రాత్రే ప్రైవేట్ వ్యక్తులు ఇప్పించారు. విషయం తెలుసుకుని వెళ్ళిన ఇంజినీరింగ్ అధికారులపైకి స్థానిక మహిళలను ఉసిగొల్పటంతో వారు నిస్సహాయులుగా ఉండిపోవాల్సి వచ్చిందని వారంటున్నారు. కనెక్షన్ తొలగించాలని యత్నించిన అధికారులు మంత్రి పేరు చెప్పి వారిని బెదరగొట్టే ప్రయత్నం చేశారంటున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి ఇంజినీరింగ్ అధికారులు తీసుకెళ్ళినా అప్పుడు ఇప్పుడు వస్తానంటూ కాలయాపన చేశారని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. దీనికితోడు గత పాలకవర్గ హయాంలో నారాయణపురం పంచాయతీ పరిధిలోని ప్రశాంతినగర్‌కు పైపులైను నుంచి అక్రమంగా కనెక్షన్ ఇచ్చినపుడు మాకెందుకు ఇవ్వరంటూ వాదనకు దిగటంతో అధికారవర్గాల వద్ద సమాధానం లేకపోయిందంటున్నారు. అర్బన్ నియోజకవర్గ పరిధిలో ఉన్న శివారు గ్రామ పంచాయతీలు అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం కానందున తాగునీటిని అందించలేమని గతంలో ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే పరిటాల సునీతకు అధికారులు నిక్కచ్చిగా తేల్చి చెప్పారు. అప్పటి అర్బన్ ముఖ్య నేత సిఫారసులతో పంచాయతీ పరిధిలోని ప్రశాంతినగర్‌కు అనధికార కనెక్షన్ ఇచ్చినట్లు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. దీనితో ప్రస్తుత అధికార పార్టీలోని మరో ముఖ్య నేత అండదండలతోనే పాపంపేట తదితర గ్రామాలకు అనధికార కనెక్షన్‌కు బాటలు వేసినట్లు తెలిపాయి. ఇదిలా ఉండగా ఓట్ల కోసం పాట్లు పడే నేతలు తమ లబ్ధికై నగర ప్రజలను తాగునీటి ఇక్కట్లకు గురిచేయటం సరికాదన్న అభిప్రాయం వినవస్తోంది. నగరంలో తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చితే ఆ పాపం నేతలదేనని అధికార వర్గాలు పేర్కొనటం విశేషం.