అనంతపురం

భానుడి భగభగలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, ఏప్రిల్ 12 : జిల్లాలో భానుడి భగభగలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ భానుడు తన ప్రతాపం ఎక్కువగా చూపిస్తున్నాడు. దీంతో ప్రజలు ఉదయం నుంచే బయటకు రావడానికి భయపడుతున్నారు. జిల్లాలో 42.1 డిగ్రీల సెల్సియస్ సగటు ఉష్ణోగ్రత నమోదు కాగా జిల్లా కేంద్రంలో 40.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. జిల్లాలోని పరిగిలో అత్యధికంగా 44.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా, అత్యల్పంగా మడకశిరలో 37.9 డిగ్రీల సెల్సియస్ నమోదయింది. జిల్లా వ్యాప్తంగా 42 డిగ్రీల సెల్సియస్ నమోదు కావడంతో ఉదయం 8 గంటలపైన ప్రజలు బయటకు రావాలంటే తీవ్ర ఇబ్బందలకు గురవుతున్నారు. ప్రజలు తలపై టోపీలు, మహిళలైతే గొడులుతో సేద తీర్చుకుంటూ తమ పనులను కొనసాగిస్తున్నారు.