అనంతపురం

రాష్ట్రంలో అరాచక పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురంటౌన్, డిసెంబర్ 23: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, సాక్షాత్తూ తెలుగుదేశం ఎమ్మెల్యేనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసు అధికారులను దూషిస్తుంటే కట్టడి చేయాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చోద్యం చూస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. శనివారం స్థానిక పద్మశ్రీ కల్లూరు సుబ్బారావుకాంగ్రెస్ భవన్‌లో ఆయన కార్యకర్తల నుద్దేశించి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రజా ప్రతినిధులు ఒకరిపై మరొకరు దూషణల పర్వం సాగించటం వారి పార్టీ స్వంత వ్యవహారమన్నారు. అయితే నిందితులను అరెస్టు చేసి విడిచిపెట్టలేదని తాడిపత్రిలో ఎమ్మెల్యే పోలీసులను దూషించటం సభ్యసమాజాన్ని నివ్వెరపరిచిందన్నారు. పోలీసులు నిస్పక్షపాతంగా విధులు నిర్వహించాలని, వారికి తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అధికారులు, పోలీసులపై తెలుగుదేశం నేతల దౌర్జన్యాలు అధికమయ్యాయని అన్నారు. కాంగ్రెస్ పనైపోయిందంటూ విమర్శలు చేసిన వారికి గుజరాత్ ఎన్నికలు కనువిప్పులాంటివన్నారు. గాంధిమహాత్ముడు పుట్టిన పోర్‌బందర్ నుంచి కాంగ్రెస్ విజయయాత్ర ప్రారంభమైందన్నారు. గుజరాత్‌లో 145 సీట్లు వస్తాయని లెక్కలు గట్టిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిందన్నారు. చావుతప్పి కన్ను లొట్టబోయినట్లు బొటాబొటి మెజారిటీని సాధించారన్నారు. నోట్ల రద్దు, జీ.ఎస్.టీ ప్రజల జీవనాన్ని చిన్నాభిన్నం చేసిందన్నారు. దీని ఫలితంగానే గుజరాత్ ఓటర్లు ఓటుహక్కుతో బీజేపీని ఖంగుతినిపించారన్నారు. దివంగత మాజీ ప్రధానమంత్రి ఆర్థిక సంస్కరణలతో భారతదేశం ప్రగతి వైపు పరుగులు తీసిందన్నారు. నరేంద్రమోదీ పాలనలో దేశం దివాలా తీసిందన్నారు. ద్రవ్యోల్భణం పెరిగి తలసరి ఆదాయం తగ్గిందన్నారు. ప్రజల జీవనం దుర్భరంగా మారిందన్నారు. రాహుల్‌గాంధీ సారధ్యంలో దేశాన్ని రక్షించుకునేందుకు అందరూ కలిసిరావాలన్నారు. తాడిపత్రి వైసీపీ నేతలు నాగిరెడ్డి తదితరులు పీసీసీ అధ్యక్షుడి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే క్రిస్మస్‌ను పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు కోటా సత్యం, దాదాగాంధీ, రమణ, కొండారెడ్డి, ప్రభాకర్, కొండారెడ్డి, రామాంజి, కృష్ణ, మురళి పాల్గొన్నారు.
24 మంది ఈవ్‌టీజర్ల పట్టివేత
* మహిళా రక్షక్ బృందాల పనితీరుపై ఎస్పీ సమీక్ష
అనంతపురం అర్బన్, డిసెంబర్ 23: అమ్మాయిలు, విద్యార్థులను వేధించే వారిపై గట్టి నిఘా ఉంచి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, గడిచిన వారం రోజుల్లో 24 మంది ఈవ్‌టీజర్లను పట్టుకోవటం జరిగిందని ఎస్పీ అశోక్‌కుమార్ పేర్కొన్నారు. శనివారం జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ సబ్ డివిజన్ల పరిధిలో గడిచిన వారం రోజుల్లో మహిళా రక్షక్ బృందాలు తీసుకొన్న చర్యలపై ఎస్పీ సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈవ్‌టీజర్లపై మహిళా రక్షక్ బృందాల నిఘా మరింత తీవ్రతరం చేయాలన్నారు, అదేవిధంగా అవగాహన సదస్సులు మరింత ఉద్ధృతం చేయాలని ఆయన సూచించారు. గత వారం రోజుల్లో 24 మంది ఈవ్‌టీజర్లను పట్టుకోవటం జరిగిందన్నారు. ఆయా సబ్ డివిజన్ల పరిధిలో ఈవ్‌టీజర్లకు వారి తల్లిదండ్రులు ఆధ్వర్యంలో కౌనె్సలింగ్ నిర్వహించారు. ఒక్క అనంతపురం సబ్ డివిజన్ పరిధిలో 15 మందిని అత్యధికంగా పట్టుకోవటం జరిగిందని డీఎస్పీ తెలిపారు. వీరందరికీ నైతిక విలువలతోపాటు మహిళా చట్టాలు, వాటిని అతిక్రమించే వారిపై ఎటువంటి చర్యలు ఉంటావో అవగాహన కల్పించారు. ఈ అవగాహన సదస్సులో అడ్వకేట్ పరిటాల శైలజ, ఎస్‌ఎస్‌బీఎన్ రిటైర్డ్ ప్రిన్సిపాల్ నిర్మలమ్మ, ఇందిర, మహిళా ఎస్.మున్వర్ సుల్తాన్, ఎస్‌ఐ రాజారెడ్డి పాల్గొన్నారు.