అనంతపురం

అరచేతిలో వైకుంఠం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం టౌన్, ఏప్రిల్ 15: పట్టణంలో వచ్చే వందేళ్లను దృష్టిలో ఉంచుకుని నూతన కూరగాయల మార్కెట్‌ను నిర్మిస్తాం.. రూ.100 కోట్లతో నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం.. మార్కెట్ పైభాగంలో మల్టీఫ్లెక్స్ థియేటర్లు, కోల్డ్ స్టోరేజ్‌లు, రెస్టారెంట్లు... మార్కెట్‌లోకి వెళితే ‘ఇది దొరకదు’ అనే పరిస్థితి ఉండదు... దేశంలోనే అధునాతన మార్కెట్లను పరిశీలించి హిందూపురానికి సరిపోయే విధంగా ఉండే మార్కెట్‌ను నిర్పిస్తాం... అంటూ ఆరు నెలల క్రితం అధికారులు ఊద రగొట్టారు... ఔరా అనిపించేలా గ్రాఫిక్స్ మాయాజాలంతో ఏక ంగా ప్రొజెక్టర్ ద్వారా కౌన్సిల్ సభ్యులు, మీడియాకు మార్కెట్ రూపురేఖలు చూపించారు. దీంతో హిందూపురం మారిపోతోందని అందరూ నమ్మారు. తీరా మార్కెట్ అనుమతులు చూశాకా మార్కెట్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. కన్సల్టెంట్లు, అధికారులు తయారు చేసిన మార్కెట్ నిర్మాణ ప్రతిపాదనలను రాష్ట్ర టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు పరిశీలించి చీవాట్లు పెట్టారు. ప్రాథమిక నిబంధనలను మరచిపోయి ఎలా ప్రతిపాదనలు తయారు చేస్తారని ప్రశ్నించారు. అక్కడ ఉన్న రోడ్ల విస్తీర్ణాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్ని అంతస్తులు నిర్మించాలి అన్న విషయాన్ని పట్టించుకోరా అంటూ నిలదీశారు. చివరకు నిర్మాణ ప్రణాళికలో మార్పులు, చేర్పులు చేశారు. అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్న మూడో అంతస్తు ఎగిరిప3యింది. చివరకు రెండు అంతస్తులకే పరిమితమైంది. వంద కోట్ల మార్కెట్ బడ్జెట్ చివరకు రూ.34 కోట్లకు దిగింది. అధికారులకు, కన్సల్టెంట్లకు అపార అనుభవం ఉందని నమ్మిన నాయకులకు దిమ్మతిరిగింది. రాజకీయ నాయకులకు, పాలకులకు సరైన సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన అధికార యంత్రాంగం తప్పు దారి పట్టించింది. కేవలం నాయకుల మెప్పు కోసమే నిర్మాణ ప్రణాళికలు తయారు చేసింది. దీని వల్ల కాలయాపన తప్ప ఒరిగిందేమి లేదు.
మార్కెట్ నిర్మాణం ఇలా...
మార్కెట్ విస్తీర్ణం 2.79 ఎకరాలు ఉంది. ఇందులో రెండు విభాగాలుగా చేసి ఓ వైపు వాణిజ్య భవన సముదాయాలను, మరో వైపు కూరగాయల మార్కెట్ సముదాయాన్ని నిర్మించేందుకు రాష్ట్ర టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు అనుమతించారు. రెండు సముదాయాలు కలిపి రెండు అంతస్తుల్లో ఉంటాయి. వాణిజ్య, మార్కెట్ సముదాయంలో కింద వైపున సెల్లార్‌ను పూర్తిగా పార్కింగ్‌కు కేటాయించాలని, ఎలాంటి షాపులు, కోల్డ్ స్టోరేజ్‌లు ఉంచవద్దని ఆదేశాలు ఇచ్చారు. దీంతో సెల్లార్ అంతా పార్కింగ్‌కు మాత్రమే పరిమితం చేశారు. వాణిజ్య సముదాయ విభాగంలో గ్రౌండ్ ఫ్లోర్‌లో 73, మొదటి అంతస్తులో 78 కలిపి మొత్తం 151 షాపులు ఉంటాయి. కూరగాయల మార్కెట్‌లో గ్రౌండ్ ఫ్లోర్‌లో 38 హోల్‌సేల్, 14 కిరాణా దుకాణాలు, మొదటి అంతస్తులో ఎనిమిది హోల్‌సేల్, 60 కిరాణా దుకాణాలు వుంటాయి. మొత్తంగా కూరగాయల మార్కెట్‌లో 120 దుకాణాలు నిర్మించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. వాణిజ్య, కూరగాయల మార్కెట్‌లో మొత్తం దుకాణాల సంఖ్యలో 271గా పేర్కొన్నారు. వీటి నిర్మాణానికి అయ్యే మొత్తాన్ని ఇంజినీరింగ్ విభాగం లెక్కించి రూ.34 కోట్లు అవసరమని తేల్చింది. వీటికి సంబంధించి సాంకేతిక అనుమతుల కోసం ప్రతిపాదనలను రాష్ట్ర ముఖ్య ఇంజనీర్‌కు ఇటీవలే పంపారు. అక్కడ నుండి అనుమతులు రాగానే మార్కెట్ నిర్మాణానికి ప్రభుత్వం నుండి అనుమతి తీసుకోవాలి. ఇది పూర్తయిన తర్వాతనే ఆర్థిక వనరుల సమకూర్పుపై దృష్టి పెట్టనున్నారు. పట్టణంలో వ్యాపారుల నుండి ముందుగానే డబ్బులు వసూలు చేసి మార్కెట్‌ను నిర్మించాలని యోచిస్తున్నారు. అయితే వ్యాపారుల నుండి రూ.34 కోట్లు వచ్చే అవకాశం లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి నిధులు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవి రావాలంటే ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయాల్సి ఉంది. లేకపోతే మార్కెట్ నిర్మాణం మరింత ఆలస్యమయ్యే ప్రమాదం కనిపిస్తోంది.