అనంతపురం

కమనీయం.. కల్యాణం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం కల్చరల్, ఏప్రిల్ 15: శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం నగరంలోని వివిధ ఆలయాల్లో శ్రీ సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించారు. దీంతో రామనామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. కల్యాణం వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. మొదటి రోడ్డు కాశీవిశే్వశ్వర కోదండ రామాలయంలో నవమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. సీతారాముల ఉత్సవ విగ్రహాలను విశేషంగా అలంకరించి కల్యాణోత్సవం కన్నులపండువగా నిర్వహించారు. స్వామివార్లకు పుష్పాభిషేకం నిర్వహించారు. ముత్యాల తలంబ్రాలతో సీతారాముల కల్యాణం వేడుకగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు ఇంద్రకంటి ప్రసాదశర్మ వేదమంత్రోచ్చారణలతో సంప్రదాయబద్దంగా కల్యాణోత్సవం నిర్వహించారు. సాయంత్రం స్వామివార్లను శేషవాహనంపై ఊరేగించారు. ఆధ్యాత్మిక ప్రవచనములు, భజనలు నిర్వహించారు. భక్తులకు పానకం, వడపప్పు ప్రసాదములు పంపిణీ చేశారు. సాయిగీతా మందిరంలో సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించారు. పంచామృతాభిషేకం, సహస్రనామార్చన, శ్రీ విష్ణుసహస్రనామ పారాయణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం ఆధ్యాత్మిక ప్రవచనములతో పాటు నగరోత్సవం వైభవంగా నిర్వహించారు. ఎర్రనేల కొట్టాలలోని శ్రీ అభయాంజనేయస్వామి ఆలయంలో కన్నుల పండువగా శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహించారు. సాయంత్రం రథోత్సవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. అదేవిధంగా నగరంలోని ఆర్‌ఎఫ్ రోడ్ శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయం, రామచంద్రనగర్ కోదండ రామాలయం, శ్రీనివాసనగర్ రామాలయం, ఆజాద్‌నగర్ దత్తాత్రేయ ఆలయం, కోర్టురోడ్ ఆంజనేయస్వామి ఆలయం, పాతవూరు కోదండ రామాలయం, అంబేద్కర్ నగర్, ఉమానగర్, భైరవనగర్, కృష్ణకళామందిర్, లక్ష్మీనగర్, మారుతీనగర్, సోమనాథనగర్ రామాలయాల్లో శ్రీరామనవమి వేడుకలు, సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఆయాప్రాంతాల్లో నిర్వహించిన స్వామివారి ఊరేగింపు కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.