అనంతపురం

‘పురం’ మార్కెట్ నిర్మాణ పనులపై తీవ్ర అసంతృప్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం టౌన్, జూలై 17 : ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టుల్లో ఒకటైన మార్కెట్ నిర్మాణం పనులపై ప్రజారోగ్య ఇంజనీరింగ్ విభాగం ముఖ్యులు ఈఎన్‌సీ చంద్రయ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పట్టణంలో రూ.23 కోట్లతో చేపట్టిన కూరగాయల మార్కెట్ నిర్మాణ పనులను చంద్రయ్య మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఇసుక మార్చాలని ఆదేశాలు జారీ చేశారు. తక్కువ మంది కూలీలు, ఇతరత్రా నిర్మాణ పనులను చేసే వారిని పెట్టుకుంటే వేగంగా ఎలా పనులు సాగుతాయని ప్రశ్నించారు. నిర్మాణాల్లోనూ చిన్నచిన్న మార్పులు చేసుకోవాలని సూచించారు. కూలీలను పెంచి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. మున్సిపల్ యంత్రాంగం పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేయాలని ఇంజనీర్లపై మండిపడ్డారు. వచ్చే ఆరు నెలల్లో మార్కెట్ నిర్మాణ పనుల రూపురేఖలు మారాల్సిందేనని స్పష్టం చేశారు. అధికారుల తీరు మార్చుకోవాలని సూచించారు. అనంతరం రూ.194 కోట్లతో గొల్లపల్లి నుండి పట్టణానికి నీటిని తీసుకొచ్చే తాగునీటి పథకం పనులను కొల్లకుంట వద్ద పరిశీలించారు. అక్కడ నిర్మిస్తున్న ఇన్‌టెక్ వెల్ ఇతరత్రా పనులను తనిఖీ చేశారు. అనంతరం రోడ్డు పక్కన వేస్తున్న పైపులైన్ పనుల నాణ్యతను పరిశీలించారు. అక్కడి నుండి గొల్లపల్లికి చేరుకొని ప్రాజెక్టు వద్ద పనులను ఈఎన్‌సీ పర్యవేక్షించారు. పనులు సాగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. తాను అనుకున్న ప్రణాళిక కన్నా గుత్తేదారు వేగవంతంగా చేస్తున్నారని ప్రశంసించారు. కాగా అంతకుముందు ఈఎన్‌సీ చంద్రయ్య మున్సిపల్ చైర్‌పర్సన్ రావిళ్ల లక్ష్మితో సమావేశమై పట్టణంలో వౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.66 కోట్లతో రూపొందించిన ప్రతిపాదనలు తదితర అంశాలపై చర్చించారు.

జీడిపల్లి పునరావాసంపై పరిశీలన
బెళుగుప్ప, జూలై 17 : మండల పరిధిలోని జీడిపల్లి గ్రామానికి పునరావాసం కల్పించేందుకు జాయింట్ కలెక్టర్ ఢిల్లీరావు మంగళవారం పరిశీలించారు. రిజర్వాయర్ ఊటనీటితో గ్రామంలో ఇళ్లు పూర్తిగా దెబ్బతిని ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని ఆందోళన చెందుతున్న తరుణంలో ప్రభుత్వం పునరావాసం కల్పించేందుకు రూ.54.60 కోట్లు మంజూరు చేసింది. ఇందులో భాగంగా జాయింట్ కలెక్టర్ ఢీల్లీరావు, కళ్యాణదుర్గం ఆర్డీఓ రామకృష్ణరెడ్డితో కలిసి పునరావాసంపై పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ ట్లాడుతూ ప్రభుత్వం ఆర్‌అండ్‌ఆర్ పథకంతో గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు చర్యలు చేపట్టిందన్నారు. అయితే గ్రామానికి సంబంధించిన తిమ్మప్ప స్వామి ఆలయ మాణ్యం 273 సర్వే నెంబర్‌లో 16.84 ఎకరాలు, 274 సర్వే నెంబర్‌లో 16.26 ఎకరాలతోపాటు 3 ఎకరాలు గ్రామకంఠం నిమిత్తం ఉందన్నారు. ఇందులో ప్రజలకు ఇళ్లు నిర్మించేందుకు అనుకూలంగా ఉంటుందా లేదా అనే విషయంపై చర్చించారు. ప్రభుత్వమే ఇళ్లను నిర్మించి ఇవ్వాలని గ్రామస్థులు కోరారు. వెంటనే నివేదికలు తయారు చేసి తమకు పంపాలని ఆర్డీఓ రామకృష్ణారెడ్డిని ఆదేశించారు.