అనంతపురం

జిల్లాకు 60 వేల క్వింటాళ్ల పప్పుశెనగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, సెప్టెంబర్ 24 : ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో వర్షాభావంతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రత్యామ్నాయ పంటల సాగుకు వంద శాతం సబ్సిడీతో వివిధ రకాల పంట విత్తనాలను అందిస్తున్న ప్రభుత్వం, ఈ (2018-19) రబీ సీజన్‌లో పప్పుశెనగ పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఈ పంట సాగుకు అవసరమైన విత్తనం అందించేందుకు వ్యవసాయ శాఖ తగిన చర్యలు చేపట్టింది. జిల్లా అవసరాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన నివేదిక మేరకు జిల్లాకు 60 వేల క్వింటాళ్ల పప్పుశెనగ కేటాయించడం జరిగింది. జిల్లాలోని 9 వ్యవసాయ శాఖ డివిజన్లలోని 27 మండలాల పరిధిలో 80,002 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయడానికి 50 శాతం సబ్సిడీతో పంపిణీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీడ్స్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఎస్‌డీసీ), నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పంపిణీ చేపట్టనున్నారు. క్వింటా పూర్తి ధర రూ.5,800 కాగా, రాయితీ పోనూ రైతులు రూ.2,900 చెల్లించాల్సి ఉంటుంది. ఈ నెలాఖరు నుంచిగానీ, లేదా అక్టోబర్ మొదటి వారం నుంచిగానీ పంపిణీ ప్రారంభించే అవకాశం ఉంది. వ్యవసాయ శాఖ డివిజన్ల వారీగా అనంతపురం డివిజన్ పరిధిలోని ఆత్మకూరు, బుక్కరాయసముద్రం, ధర్మవరం డివిజన్‌లోని కనగానపల్లి, రామగిరి, గుత్తి పరిధిలోని గుత్తి, పామిడి, పెద్దవడుగూరు, శింగనమల, యాడికి, హిందూపురం పరిధిలోని హిందూపురం, లేపాక్షి, పరిగి, కళ్యాణదుర్గంలోని బెళుగుప్ప, పెనుకొండ పరిధిలోని పెనుకొండ, రొద్దం, రాయదుర్గంలోని బొమ్మనహాల్, డీ.హారేహాళ్, కణేకల్లు, రాయదుర్గం, తాడిపత్రి డివిజన్‌లోని పెద్దపప్పూరు, పుట్లూరు, తాడిపత్రి, యల్లనూరు, ఉరవకొండ డివిజన్‌లోని గుంతకల్లు, విడపనకల్లు, ఉరవకొండ, వజ్రకరూరు మండలాల్లోని రైతులకు పప్పుశెనగ పంపిణీ చేయనున్నారు. బెళుగుప్ప, రొద్దం, పుట్లూరు, తాడిపత్రిలో ఎన్‌ఎస్‌సీ సంస్థ పంపిణీ చేపట్టనుంది. కలెక్టర్ జీ.వీరపాండ్యన్ ఆదేశాల మేరకు వెంటనే అన్ని మండలాల్లోనూ పప్పుశెనగను నిల్వ చేస్తామని జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు ఎస్‌కే.హబీబ్‌బాషా తెలిపారు. ఈ నెలాఖరు లేదా అక్టోబర్ మొదటి వారంలో పంపిణీ ప్రారంభించే అవకాశం ఉందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కరవు పరిస్థితుల నుంచి ఉపశమనం పొందాలని జేడీఏ కోరారు.