అనంతపురం

ఔషధ దుకాణాల్లో కాలం చెల్లిన మందులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, డిసెంబర్ 12 : జిల్లాలోని పలు ప్రధాన పట్టణాల్లో ఔషధ దుకాణాలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. విజయవాడలోని విజిలెన్స్ ప్రధాన కార్యాలయం నుంచి అందిన ఆదేశాల మేరకు అనంతపురం ప్రాంతీయ విభాగం అధికారి జీ.రామాంజనేయులు ఆదేశాల మేరకు బుధవారం సంబంధిత అధికారులు నాలుగు ప్రత్యేక బృందాలు మొత్తం 19 ఔషధ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. అనంతపురం నగరంలో 6 మెడికల్ స్టోర్స్, కదిరి-4, ధర్మవరం-5, హిందూపురం-4 చొప్పున ఔషధ దుకాణాల్లో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా చాలా దుకాణాల్లో ఫార్మసిస్టులు అందుబాటులో లేకపోవడం, అనేకచోట్ల కాలం చెల్లిన మందులు దుకాణాల్లో ఉండటాన్ని అధికారులు గుర్తించారు. అలాగే హెచ్, హెచ్-1 రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించకుండా వ్యాపారం సాగిస్తుండటం వెలుగు చూసింది. అలాగే సెరిలాక్, గ్లూకోజ్‌వంటి ఆహార పదార్థాలను ఫుడ్, అడస్ట్రేషన్ యాక్ట్-9154 మేరకు లైసెన్సులు పొందకుండా అమ్ముతున్నట్లు తేలింది. అంతేకాకుండా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్ముతుండటం, తక్కువ ఉష్ణోగ్రతలో ఉండవలసిన మందుల్ని బయట ఉంచటం తనిఖీల్లో వెల్లడైంది. అలాగే దుకాణదారులు ఔషధాల అమ్మకం వివరాలను తనిఖీ సమయంలో అధికారులను చూపకలేకపోవడం విశేషం.