అనంతపురం

జేఎన్‌టీయూ 10వ కాన్వికేషన్ గోల్డ్ మెడల్ జాబితా విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపుర సిటీ, ఫిబ్రవరి 12: జేఎన్‌టీయూ పదవ కాన్వికేషన్ ఈ నెల 27వ తేదీన జేఎన్‌టీయూ ఎన్‌టీఆర్ ఆడిటోరియంలో ఉదయం 10 గంటల నుండి నిర్వహించనున్నారు. ప్రతి సంవత్సరం నిర్వహించే కాన్వికేషన్‌లో యూనివర్సిటీలో మంచి మార్కులు, మంచి మెరిట్ విద్యార్థులకు ఇచ్చే గోల్డ్ మెడల్స్‌ను విశ్వ విద్యాలయ అధికారులు ప్రకటించారు. ఇందులో 2014-18 బ్యాచ్‌కు 2017-18 అకడమిక్ సంవత్సరానికి సీఈలో 84 శాతంతో వై హిమబిందు, ఈఈఈ విభాగంలో 88 శాతంతో కొడగంటి నిఖిత, ఎంఈలో 87 శాతంతో సిద్దా గోవర్థన్, ఈసీఈలో 88 శాతంతో మోహమ్మద్ ఇర్ఫాన్ అహ్మద్, సీఎస్‌ఈ 86 శాతంతో చక్రవరం శ్రావణి, ఈఐలో 79 శాతంతో చిట్టెటీ పూజిత, ఐటీలో 79 శాతంతో పి.శ్రావణిలకు బీటెక్‌లోను, బీ.్ఫర్మసీలో 90.14 శాతంతో దూదేకుల రేష్మాలకు అకడమిక్ వైపుకు గోల్డ్‌మెడల్స్ అందజేయనున్నారు. జేఎన్‌టీయూ పులివెందుల కాలేజిలో టాపర్స్ బి.టెక్‌లో శెట్టి దివ్యకు 80.81 శాతం, పోరెడ్డి హరితకు 83.33 శాతం, పోతుల భార్గవికి 81.77 శాతం, కుణుతురు విష్ణుప్రియ 84.86 శాతం, బాడురు వౌనిక 79.82 శాతంతో, ఎస్‌బీహెచ్ గోల్డ్ మెడలిస్టు కునుతురు విష్ణుప్రియకు 84.86 శాతంతో ఈసీఈ విభాగంలో లభించింది. జేఎన్‌టీయూ అనంతపురం కాలేజిలోని విద్యార్థులైన విజయ్‌రెడ్డి రాజశ్రీ 88.89 శాతం, ఈడిగ నిఖిత 88.49 శాతం, అల్లూరి వౌనిక 87.01 శాతం, మారాల సాయి స్వప్న 86.94 శాతం, ఎదుల హర్షిత 87.10 శాతం, గుండాల సుదీప్ 84.11 శాతంతో కాలేజి టాపర్స్‌గా గోల్డ్ మెడల్స్‌ను, 2017-18 ఎండోమెంట్ బెస్ట్ అకడమిక్ పర్ఫార్మెన్స్‌కు విజయరెడ్డి రాజశ్రీకి, షేక్ మాతీన్ మాహ్‌జీజ్‌కు లభించాయి. ఎండోమెంట్ గోల్డ్‌మెడల్స్‌లో మొదటిగా ఈడిగ నిఖితకు 88.49 శాతానికి, విజయరెడ్డి రాజశ్రీకి 88.89 శాతానికి నాలుగు గోల్డ్‌మెడల్స్‌ను, అల్లూరి వౌనిక 87.01 శాతం, ఎస్.శ్రీనాథ్‌కు 89 శాతం, గుండాల సుదీప్‌కు 84.11 శాతం, మారాల సాయి స్వప్నకు 86.94 శాతంతో ఎండోమెంట్ గోల్డ్‌మెడల్స్‌ను అందజేయనున్నారు. అలాగే ఎంటెక్‌లో కాటమరెడ్డి పావనీ 84.78 శాతం, పుల్లగురు హరితకు 85 శాతం, షేక్ మహమ్మద్ రఫీకి 78.92 శాతంతో ఎండోమెంట్ గోల్డ్‌మెడల్స్ అందజేయనున్నారు. జేఎన్‌టీయూ పదవ కాన్వికేషన్‌లో అత్యధికంగా విజయ రాజశ్రీకి 5 గోల్డ్‌మెడల్స్‌ను అందుకోనున్నది. గోల్డ్ మెడల్స్ పొందే వారు, డిగ్రీలు అందుకునే వారు ఈ నెల 26వ తేదీన తమ ఎంట్రీ పాసులను తీసుకోవాలని యూనివర్సిటీ అధికారులు తెలిపారు.