అనంతపురం

సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉరవకొండ, మే 13 : జిల్లాలో కరవు పరిస్థితులు నెలకున్నప్పటికీ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తి విఫలమైందని జిల్లా పరిషత్ ప్రతిపక్ష నేత రవీంద్రాద్రరెడ్డి విమర్శించారు. శుక్రవారం పట్టణంలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో కరవు పరిస్థితులు నెలకొనడంతో గ్రామాల్లో తాగునీటి సమస్య, పశువులకు గ్రాసం కొరత ఏర్పడిందన్నారు. గ్రాసం దొరక్క రైతులు పశువులను కబేళాలకు తరలిస్తున్నారన్నారు. గ్రామాల్లో తాగునీటి ఎద్దడిని తీర్చడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా చేస్తోందన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకున్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదన్నారు. అనంత వెంకటరెడ్డి, జెసి నాగిరెడ్డి, నీలకంఠాపురం శ్రీరామిరెడ్డి తాగునీటి పథకాల మెయింటెనెన్స్ చేయడానికి నిధులు మంజూరు చేయడం లేదన్నారు. పంట సంజీవిని పథకం కింద పారంఫాండ్ల నిర్మాణానికి రూ.కోట్లు ఖర్చు చేసి కేవలం 2075 మాత్రమే పనులు చేపట్టినట్లు తెలిపారు. వ్యవసాయ కూలీలకు పనులు లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారన్నారు. కాగా కదిరి ఎమ్మెల్యే అత్తర్ చాంద్‌బాషాను ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు చేసి కొనుగోలు చేసిందన్నారు. రూ.కోట్లు ఖర్చు చేసి ఎమ్మెల్యేలు కొంటున్న ప్రభుత్వం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు కేటాయించేందుకు నిధులు లేవా? అని ప్రశ్నించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి జిల్లాను కరవు బారి నుంచి కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిమ్మప్ప, తిరుపాల్ శెట్టి, నరసింహులు, ఎర్రిస్వామి పాల్గొన్నారు.