అనంతపురం

ప్లాస్టిక్ విక్రయాలపై దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం టౌన్, మే 17 : పట్టణంలో ప్టాస్టిక్ కవర్ల వాడకాన్ని నిషేధించిన నేపథ్యంలో మున్సిపల్ శానిటరీ విభాగం అధికారులు మంగళవారం సాయంత్రం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక రైల్వేరోడ్డులోని ఓ దుకాణంలో ప్లాస్టిక్ విక్రయాలు సాగుతున్నట్లు సమాచారం అందడంతో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు రాజగోపాల్, జబ్బార్‌మియా, సుధాకర్, మహబూబ్‌బాషాలు తనిఖీలు చేపట్టారు. దీంతో దుకాణంలో దాదాపు 50 కిలోలకు పైగా నిషేధిత ప్టాస్టిక్ కవర్లు ఉన్నట్లు గుర్తించి సీజ్ చేశారు. ఈ మేరకు సంబంధిత యజమానికి రూ.5 వేల అపరాద రుసుం విధించారు. ఎవరైనా నిషేధిత ప్లాస్టిక్ కవర్లను ఉపయోగిస్తే అపరాద రుసుం విధిస్తామని హెచ్చరించారు. పర్యావరణం దెబ్బతినకుండా జూట్, కాగితపు కవర్లను ఉపయోగించాలని సూచించారు